గాయపడిన వ్యక్తి మృతి
మహానంది: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగవరం గ్రామానికి చెందిన గాలి శ్రీనివాసులు(62) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నందిపల్లె మెట్ట వద్ద శుక్రవారం రాత్రి నంద్యాలకు వెళ్తున్న ఓ ఆటో ఎదురుగా బైక్‌పై వస్తున్న గోపవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మృతి చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఏపీ మోడల్ హాస్టల్‌లో నాగుపాము
మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్ హాస్టల్‌లో శనివారం రాత్రి నాగుపాము కనిపించడంతో విద్యార్థినులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. నాగుపామును చూసిన సిబ్బంది వెంటనే అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్‌క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించగా మోహన్ వెంటనే హాస్టల్ వద్దకు చేరుకుని నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు.


