
ఈదురుగాలుల బీభత్సం
● ఏడు ఎకరాల్లో నేలకొరిగిన అరటితోట ● రూ. 20 లక్షల నష్టం
ప్యాపిలి: మండల పరిధిలోని పీఆర్ పల్లె గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సానికి అరటితోట నేలకొరిగింది. గ్రామానికి చెందిన ప్రేమసాగర్ రెడ్డి తనుకున్న 10 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. మంచి దిగుబడి రావడంతో మరికొద్ది రోజుల్లో పంటకోసేందుకు సిద్ధమయ్యాడు. అయితే గురువారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో ఏడు ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినట్లు రైతు వాపోయాడు. ప్రస్తుతం వచ్చిన దిగుబడిని విక్రయిస్తే దాదాపు రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని తెలిపాడు.