
ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హొళగుందలో అడ్డ పల్లకీలో ఆశీనులైన కాశీ జగద్గురువు
కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలు ఈ నెల 19 నుంచి 26వ తేది వరకు తమ వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్ https://cse.ap.gov.in/ లో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 16 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ ద్వారా మొదటి విడత సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలను 21 నుంచి 24వ తేదీ మధ్య ప్రకటిస్తామని పేర్కొన్నారు.