
యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది
నాటక రంగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో సాంకేతిక విప్లవంతో నాటక రంగం పోటీ పడలేకపోయింది. పల్లెటూర్లలో ఇప్పటికీ జరిగే తిరునాళ్లు జాతర్లలో తెల్లవార్లు నాటకాలు వేస్తున్న పరిస్థితి ఉంది. సాంఘిక నాటకాలు అంతగా ప్రదర్శితం కావడం లేదు. పద్య నాటకాలకే ఆదరణ ఉంది. ఇప్పటికే సినిమా, టీవీలు లాంటి వాటి వల్ల కొంత మోజు తగ్గింది. రంగస్థల కళలోకి యువతీ యువకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– పత్తి ఓబులయ్య, అధ్యక్షుడు, టీజీవీ కళాక్షేత్రం
కళాకారులను ప్రోత్సహించాలి
కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. మా కళారాధన సంస్థ ద్వారా నటనలో శిక్షణ ఇవ్వడంతో పాటు నాటకాలను ప్రదర్శిస్తున్నాం. నాటక పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాం. మరికొందరు కళా పోషకులకు ముందుకు వస్తే రంగస్థలం లాంటి కళలను భావితరాలకు అందించేందుకు అవకాశం ఉంటుంది.
– డాక్టర్ గుర్రాల రవికృష్ణ, కళారాధన సంస్థ
అధ్యక్షుడు, నంద్యాల
కళాకారులకు చేయూత ఇవ్వాలి
మూడు దశాబ్దాలకు పైగా నేను నాటకాల్లో పాత్రలు వేస్తున్నాను. ప్రస్తుతం నాటక ప్రదర్శనలు బా గా తగ్గిపోయాయి. కళాకారులకు నాటకాలు లేక బతుకుదెరువు కష్టంగా మారింది. ప్రభుత్వం, కళా సంస్థలు కళా పోష కులు చేయూత అందిస్తే కళను నమ్ముకుని జీవిస్తున్న వారికి జీవనోపాధి లభిస్తుంది.
– ఎం.ఆర్.రాధిక, సీనియర్ రంగస్థల కళాకారిణి
●

యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది

యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది