సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు... | - | Sakshi
Sakshi News home page

సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు...

Published Fri, Apr 18 2025 1:51 AM | Last Updated on Fri, Apr 18 2025 1:51 AM

సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు...

సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు...

రంగు..

● సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండు లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది.

● కృత్రిమంగా మాగిన వాటిలో పండు మొత్తం ఒకే విధమైన కాంతివంతమైన లేత పసుపు కలిగి ఉంటాయి. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి పుల్లగా ఉంటాయి.

వాసన..

● సహజంగా మాగిన పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. కృత్రిమంగా మాగిన పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది.

రుచి..

● సహజంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడుతుంది. కావున తియ్యగా రుచిగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడక తక్కువ తీపిదనం, రుచి లేకకుండా ఉంటాయి.

నిల్వ..

● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement