
తల్లిదండ్రులకు అండగా నిలుస్తా
అనంతపురం జిల్లా పెద్దపప్పురు గ్రామానికి చెందిన వెన్నపూస రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మీదేవిల కుమార్తె వి. వైష్ణవి ఏపీఆర్‌జేసీ బనవాసిలో చదివి ఎంఈసీలో 979 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి ప్రశంసలతో పాటు ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. బనవాసి ఏపీఆర్‌జేసీ కాలేజీలో విద్యార్థిని రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించటం గత ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించటమే కారణమని తెలుస్తోంది. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఉందని విద్యార్థిని వి. వైష్ణవి చెప్పారు.