
నాటుసారా స్థావరాలపై దాడులు
కర్నూలు: కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండా, గుడుంబాయి తండా గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ కృష్ణ, ఎస్‌ఐ మధు, సిబ్బంది రామలింగయ్య, చంద్రపాల్, చంద్రుడు, వీరన్న తదితరులు బృందాలుగా ఏర్పడి సారా స్థావరాలపై దాడులు చేశారు. గుమ్మితంతండాలో 400 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారా, గుడుంబాయి తండా శివారులో 600 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి బట్టీలను పగులగొట్టారు. సారాకు వినియోగించే సామాగ్రి, ప్లాస్టిక్ డబ్బులు, బిందెలు, వంట పాత్రలన్నీ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీబాయి, లోక్‌నాయక్‌లు కలసి సారా తయారీ చేయిస్తున్నట్లు వెలుగు చూసిందని, వారిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి సారా వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాలను వివరించారు. నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా దాడులు ఇకపై విస్తృతంగా కొనసాగుతాయని, సారా తయారీ, విక్రయాలు, రవాణా ఆపకపోతే పీడీ కేసులు నమోదు చేసి శాశ్వతంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు.
పొలం రస్తా విషయంలో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని బాలుర ఉన్నత పాఠశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్న తిమ్మాపురం ఈరన్న, దళవాయి యల్లయ్య మధ్య పొలం రస్తా విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పొలంలో రస్తా విషయంలో గొడవ పడగా, అది మనస్సులో పెట్టుకుని రాత్రి ఇంటి ప్రాంగణంలో గొడపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో తిమ్మాపురం ఈరన్న మెడకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్
ఆదోని రూరల్: మండలంలోని పెద్దపెండేకల్ గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి బెల్టు షాపు నిర్వహిస్తుండగా అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు శుక్రవారం తెలిపారు. సుభాన్ ఆంధ్రాకు చెందిన మద్యం అక్రమంగా అమ్ముతుండగా పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 180 ఎంఎల్‌ల 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.