
అహోబిలేశుడి సేవలో కేంద్ర మంత్రి
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను కేంద్ర ఆహార పౌరసరఫరాల, శుద్ధ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అహోబిలం క్షేత్రంలోని శ్రీ లక్మీనరసింహస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదశ్వీరచనాలు అందించా రు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, అహోబిలం దేవస్థాన మేనేజర్ మాధవన్ తదితరులు ఉన్నారు