
సాతనూరులో ఉపాధి కూలీల హాజరుపై విచారణ
కోసిగి: సాతనూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజు వారి పనిదినాలకు వెళ్లే కూలీల సంఖ్య హాజరు శాతాన్ని అధికారులు నేరుగా గ్రామానికి వెళ్లి నమోదు చేశారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఉపాధి సిత్రాలు’ కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఇందులో సాతనూరు గ్రామంలో 60 నుంచి 70 మందితో దొంగ పేర్లతో మస్టర్లులో నమోదు చేస్తున్నారని ఫిర్యాదు ఉన్నాయి. ఇందుకు స్పందించిన అధికారులు బుధ, గురువారాల్లో గ్రామానికి చేరుకుని నేరుగా కూలీలతో పనులు చేస్తున్న చోటుకు వెళ్లి మస్టర్లు పేర్లు పరిశీలించి హాజరు శాతం చేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజు 260 మంది హాజరైనట్లు ఏపీఓ వెల్లడించారు. ఫీల్డు అసిస్టెంట్స్, మేటీలు అక్రమాలకు పాల్పడుతు దొంగ పేర్లుతో మస్టర్లు నమోదు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చింతకుంట గ్రామంలో ఈనెల 13, 14, 15వ తేదీలలో గ్రామం నుంచి 480 నుంచి 680 వరకు కూలీలు పనికి వెళ్లుతున్నట్లు మస్టర్లు పేర్లును ఆన్‌లైన్‌లోఎంట్రీ చేశారు. ఓకే ఫొటోతో 8 నుంచి 10 మస్టర్లు వరకు పేర్లు మార్పు చేస్తు హాజరు నమోదు చేశారు. ఈ విషయంపై టెక్నికల్ అసిస్టెంట్ మంజు, ఇన్‌చార్జ్ ఏపీఓ కాలిక్‌ను వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పుడు పేర్లుతో మస్టర్లు నమోదు చేసిన వాటిని తొలగించి వాస్తవంగా పని చేసిన వారి మాత్రమే ఆన్‌లైన్ బిల్లు వచ్చేలా ఎంట్రీ చేస్తామన్నారు.

సాతనూరులో ఉపాధి కూలీల హాజరుపై విచారణ