మంటలు చేలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్: మంటలు చేలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని కుకట్‌పల్లి ఐడీఎల్ వద్ద ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బస్సుకు ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా.. లేక మరేదైనా కారణాలతో జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.