
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసులు కేసును ఛేదించారు. అయితే, ఈ కేసులో డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు ప్రైవేటు టావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ యజమానిపై కక్షతోనే బస్సులకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు.
అయితే, ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి కొట్టడం వల్లే డ్రైవర్ వీరబాబు ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడు వీరబాబుతోపాటు అతనిపై దాడి చేసిన ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి, అతని బంధువుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment