private travel buses
-
తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
కర్నూలు, నిర్మల్/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎక్కువ ట్రిప్పుల కోసం వేగంగా.. నిరక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరగ్గా.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. గాయపడిన వాళ్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.గురువారం వేకువ ఝామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలీసులు స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్ని హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి(13), గోవర్థిని(8)గా పోలీసులు నిర్ధారించారు.ఇక.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై ముస్కాన్ ప్రైవేట్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 25 మందికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పది మందిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందని.. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు. -
కూకట్పల్లి: ట్రావెల్స్ బస్సుల్లో మంటలు.. సూత్రధారి అతడే..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసులు కేసును ఛేదించారు. అయితే, ఈ కేసులో డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు ప్రైవేటు టావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ యజమానిపై కక్షతోనే బస్సులకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి కొట్టడం వల్లే డ్రైవర్ వీరబాబు ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడు వీరబాబుతోపాటు అతనిపై దాడి చేసిన ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి, అతని బంధువుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు
సాక్షి, కృష్ణా : పండగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేయగా.. తాజాగా కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రేవేటు బస్సులపై దాడి నర్వహించింది. ఈ దాడిలో 23 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. 14 కనకదుర్గమ్మ వారధి, 2 పొట్టిపాడు టోల్ ప్లాజా, 3 పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీజ్ చేశారు. నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని, తనిఖీలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండుగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. గాజువాక సమీపంలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేశారు. మొత్తం 59 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఐదు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. -
పండగ పూట టికేట్ల దోపిడీ
-
64 బస్సులను సీజ్ చేసిన అధికారులు
-
ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్చగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాపారావు ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడిన రవాణాశాఖ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. పాపారావు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జరిగిన ఈ దాడుల్లో అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం గమనార్హం. ఈ తనిఖీలకు సంబంధించి పాపారావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ అధిక ఆదాయాన్ని చేకూర్చే వనరుగా ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచాలన్నారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆర్టీఏ తనిఖీలు : 27 బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్ : నగర శివారుల్లో జాతీయ రహదారిపైర ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 27 బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..!
మామూళ్ల మత్తులో రవాణా శాఖ రోడ్డెక్కుతున్న ఫిట్‌నెస్‌లేని బస్సులు అదుపు తప్పుతున్న ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ బస్సులు అదుపుతప్పుతున్నాయి. నిత్యం రోడ్లపై తిరగాల్సిన బస్సులు చెట్లను ఢీకొట్టడం, డివైడర్లు ఎక్కటం లాంటివి చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీసులు సైతం కళ్లెం వేయలేకపోతున్నారు. పర్యవసానంగా ఆభంశుభం తెలియని ప్రయాణికులు బలి అవుతున్నారు. విజయవాడ : గత కొన్నేళ్లుగా ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జిల్లాలోని జాతీయ రహదారిపై ఈపరిస్థితి అధికంగా ఉంది. అనుభవం లేని డ్రైవర్లు, క్లీనర్లకు డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించటం, బస్సులకు స్పీడ్ లాక్ లేకపోవటం వెరసి ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నార ుు. జిల్లాలో మొత్తం 410 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర జిల్లాలో రిజిస్ట్రేషన్లు జరిగి ఇక్కడ రాకపోకలు నిర్వహించే బస్సులు మరో 300 వరకు ఉన్నాయి. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో రవాణా శాఖ అధికారుల నిబంధనల్ని ప్రైవేట్ ఆపరేటర్లు కాసులతో సరిపెడుతుండటంతో ఫిట్‌లెస్ బస్సులకు కూడా సర్టిఫికెట్లు ఆఘమేఘాల మీద వస్తున్నాయి. ఇటీవల కంచికచర్లలో అర్ధరాత్రి సమయంలో కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కార్తీక ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులోని బ్యాటరీ ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ నిద్రపోతున్న ప్రయాణికులను అప్రమత్తం చేయటంతో వెంటనే వారందరు బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పెనుప్రమాదం మాత్రం తప్పింది. ఈఏడాది మార్చి 15న అమలాపురం నుం చి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. గొల్లపూడి సమీపంలోని సూరాయపాలెం వద్ద డ్రైవర్ పూటుగా మద్యం తాగడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో డ్రైవర్‌తోపాటు ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు మెడికోలు మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగినప్పుడు రవాణా, పోలీసులు అధికారులు కొంత హడావుడి చేసి కేసులు నమోదు చేసి, ఆ తర్వాత రెండు రోజులకే దీనిని మరిచిపోయారు. ఇదే తరహాలో ప్రమాదాలు అనేకం జరగుతున్నాయి. చర్యలు శూన్యం ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖాలాలు లేవు. ముఖ్యంగా అన్ని బస్సులకు స్పీడ్ లాక్ పెట్టకపోవటం, జాతీయ రహదారిపై వాహన వేగాన్ని పరిశీలించే స్పీడ్గన్లు వినియోగించటకపోవటం, వాహన సామర్థ్యాన్ని పరీక్షించటంతోపాటు, డ్రైవర్ సామర్థ్యాన్ని పరీక్షించటం, అతని దృష్టి లోపం, ఇతర ఇబ్బందుల్ని పరీక్షించటం, వాహనం కండీషన్ చూడటం, కనీసం రెండు వారాలకు ఒకసారైనా బస్సు డ్రైవర్‌ను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించటం తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఏటా వేల సంఖ్యలో ప్రమాదాలు జిల్లాలో సగటున ప్రతి ఏటా 2800 వాహన ప్రమాదాలు జరగుతున్నాయి. వీటిలో 25 శాతం ప్రమాదాలు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులే ఉంటున్నాయి. వాహన ప్రమాదాల్లో సగటున 700 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలోని పెద్ద అంబర్ పేట సమీపంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎల్బీనగర్ లో శుక్రవారం ప్రైవేటు ట్రావెల్స్ పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇందులో దివాకర్, కేశినేని, మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. పండగ నేపధ్యంలో అనుమతి లేకుండా ప్రైవేటు ట్రావె ల్స్ బస్సులను నడుపుతుండటంతో ఆర్టీఏ అధికారులు రంగంలో దిగారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. అలాగే మరో 9 బస్సులను కూడా స్వాధీనం చేసుకుని రవాణశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. -
గోదావరి జిల్లాల్లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన నేపథ్యంలో పలు జిల్లాలలో రవాణ ఆధికారులు ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) శ్రీదేవి ఆధ్వర్యంలో గత అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న13 బస్సులను సీజ్ చేశారు. ఏలూరు - 6,తణుకు -2, తాడేపల్లిగూడెం -3, భీమవరం-2 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ శ్రీదేవి వెల్లడించారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఐదుగురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.