
సాక్షి, కృష్ణా : పండగ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేయగా.. తాజాగా కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రేవేటు బస్సులపై దాడి నర్వహించింది. ఈ దాడిలో 23 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. 14 కనకదుర్గమ్మ వారధి, 2 పొట్టిపాడు టోల్ ప్లాజా, 3 పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీజ్ చేశారు. నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని, తనిఖీలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment