rta checks
-
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు
సాక్షి, కృష్ణా : పండగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేయగా.. తాజాగా కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రేవేటు బస్సులపై దాడి నర్వహించింది. ఈ దాడిలో 23 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. 14 కనకదుర్గమ్మ వారధి, 2 పొట్టిపాడు టోల్ ప్లాజా, 3 పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీజ్ చేశారు. నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని, తనిఖీలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు. గద్వాల జిల్లా అలంపూర్ వద్ద జరిపిన తనిఖీల్లో సరైన ప్రమాణాలు పాటించని 30 బస్సులపై, హైదరాబాద్ శివార్లలో మరో 30 బస్సులపై అధికారులు కేసులు నమోదయ్యాయి. -
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-11 బస్సులు సీజ్ హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారటం లేదు. సరైన పత్రాలు లేకుండా, లెసైన్స్ లేని డ్రైవర్లు తో ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్లో శుక్రవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు 100 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అందులో 11 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. టాక్స్ చెల్లించని బస్సులకు జరిమానాలు విధించారు.