సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.
బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు.
Comments
Please login to add a commentAdd a comment