lb nagar
-
పండగ పూట ప్రయాణికులకు పాట్లు
-
హైదరాబాద్ : ఎల్ బి నగర్ ఆక్సిజన్ పార్క్ (ఫొటోలు)
-
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. -
ఎల్బీ నగర్ విషాదంలో షాకింగ్ ట్విస్ట్..!
-
HYD: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్ ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది. pic.twitter.com/GaPhmhUzwC — kutharamp OG (@nanisumanth29) March 19, 2024 ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. -
రాంగ్ రూట్ లో కారు బీభత్సం.. ఎక్సైజ్ సీఐ మృతి..
-
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్‌ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు. -
LB Nagar:మెడికల్ షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్‌లోని మెడికల్ షాప్‌లపై ఎస్ఓటీ పోలీసులు, నార్కో టిక్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మెడికల్ షాప్‌లలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పలు మెడికల్ షాప్‌లపై దాడులు నిర్వహించి నిషేధిత ఆల్ ఫ్రాక్స్ డ్రగ్స్ (NDPS), ఇంజెక్షన్లు, మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పది మంది మెడికల్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అల్కాపూరిలో దాడులు కొనసాగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
నాగోలు: ఎల్బీనగర్లోని చింతల్‌కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్నాడు. ఎల్బీనగర్ చింతల్‌కుంట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్ (50)తో పాటు నగరానికి చెందిన పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే ఎల్బీనగర్ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతుర్ని చూసేందుకు వచ్చి.. చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్ కుమారుడు వినయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ ఐటీ దాడులు, పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి దాడులు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధు యాష్కీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు. కాగా, పోలీసుల సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆయన ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో, ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం -
మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు: సుధీర్ రెడ్డి
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్‌క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్‌క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్‌క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
Hyderabad Metro: మూత్ర విసర్జన కోసం మరో ప్లాట్‌ఫాంకు..
ఖమ్మంలీగల్: నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10రూ. కట్ చేసినందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. నాలుగేళ్ల కిందటి నాటి ఈ ఘటనలో తీర్పు తాజాగా వెల్లడైంది. ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ 2019 జనవరి 10న హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎల్బీ.నగర్ మెట్రో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాక తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేక మరోవైపు వెళ్లాడు. ఈక్రమంలో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆపై పాత మార్గానికి వచ్చేందుకు ఇంకో సారి స్వైప్ చేశాడు. ఈమేరకు కార్డు నుంచి రూ.10 మినహాయించుకుంది హైదరాబాద్ మెట్రో. అయితే, తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును పరిశీలించి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అసౌకర్యానికి రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు. సదరు పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులు పెట్టాలని హైదరాబాద్ మెట్రోకు సూచించింది ఖమ్మం వినియోగదారుల కమిషన్. -
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్‌కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్‌ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్‌ను రామాంతపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
రెండుసార్లు ఎంపీ.. కానీ ఈసారి విముఖత..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తన తదుపరి రాజకీయ రంగస్థలంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శాసనసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎల్బీనగర్ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం నుంచే మధుయాష్కీ ఎల్బీనగర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిచిన యాష్కీ, జిల్లా విషయమై ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వివిధ సమావేశాల్లోనే విమర్శలు చేయడం గమనార్హం. మధుయాష్కీ ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ ‘సాక్షి’ పత్రికలో 2022 ఏప్రిల్ 3వ తేదీనే కథనం ప్రచురితమైంది. కష్టకాలంలో వదిలేసి వెళ్తే ఎలా.. బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా, జాతీయ నాయకుడిగా రాహుల్‌గాంధీ వద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుయాష్కీ ఈ విధంగా తరలివెళ్లడ మే మిటని నాయకు లు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆలోచనతోనే ముందునుంచే నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా దూరమయ్యారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినప్పటికీ జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అంతగా మమేకం కాకపోవడంతో తరువాత వరుసగా రెండు సార్లు గెలిచే అవకాశాలను దూరం చేసుకున్నారంటున్నారు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని, తా జాగా ఆర్మూర్ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎల్బీనగర్ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు మీ నాక్షీ నటరాజన్ పాదయాత్రకు సైతం యాష్కీ దూ రంగా ఉన్నారని పార్టీ నాయకులు అసహనంగా ఉ న్నారు. కీలకమైన నిజాం షుగర్స్, పసుపు బోర్డు అంశాలపై చేసిన పోరాటాల్లో యాష్కీ తనకేమీ ప ట్టనట్లు ఉండడంతోనే గత ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచుకో లేని దుస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నా రు. గతంలో మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ యాష్కీపై బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే యగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం. ఆర్మూర్‌లో పోటీ అవసరమైనప్పటికీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన, ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
Hyderabad : ఎల్బీనగర్లో కుప్పకూలిన ఫ్లైఓవర్ (ఫొటోలు)
-
ఎల్బీనగర్ ఫైఓవర్ ప్రమాదం.. గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంబంధిత వార్త: HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం..