నితేష్‌సాయి (ఫైల్)
సాక్షి, నాగోలు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేçసుకుంది. ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్ వాస్తుకాలనీకి చెందిన కీత నితేష్‌సాయి(26) మృత్తి రీత్యా వ్యాపారి. బుధవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న స్నేహితుడిని కలసి బుల్లెట్‌పై వాస్తుకాలనీలో ఉన్న తన ఇంటి రాత్రి 11:45గంటలకు సమయంలో వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓంకార్‌నగర్ యూటర్న్ వద్ద మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన నితేష్‌సాయిని చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతూ నితేష్‌సాయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణలు దక్కేవి...
హెల్మెంట్ లేక పోవడంతో కింద పడిన నితేష్‌సాయి తలకు తీవ్ర గాయలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెంట్ ధరించి ఉంటే నితేష్‌సాయి ప్రాణాలతో బయట పడేవారని పేర్కొన్నారు.
ఆరు నెలల క్రితమే తండ్రి మృతి.. నితేష్‌సాయి తండ్రి మధుసూదన్ ఆరు నెలల క్రితం నాగోలు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంతలోనే కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment