
రేష్మ (ఫైల్)
సాక్షి, మూసాపేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్ హాస్టల్స్‌లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్‌సింగ్, శ్రావణ్‌కుమార్‌లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్‌ఎం మాల్‌లో సినిమా చూడటానికి వెళ్లింది.
రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్‌బీకాలనీకి వస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. దీంతో రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. లారీ డ్రైవర్ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాయడు. స్కూటీ ఇచ్చినందుకు అజయ్‌కుమార్, లారీ డ్రైవర్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్)
(అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. )
Comments
Please login to add a commentAdd a comment