kukatpalli
-
కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం
-
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్‌కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
కూకట్ పల్లిలో కృష్ణారావును ఓడించాలంటే బండి రమేష్ ను గెలిపించాలి: రేవంత్ రెడ్డి
-
కూకట్పల్లి ప్రజలు ఈసారి ఎన్నుకోబోతున్న అభ్యర్థి ఎవరు?
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్పల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె, టిడిపి అభ్యర్ధి నందమూరి సుహాసినిపై ఘన విజయం సాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఈ నియోజకవర్గం ఆకర్షించింది. కాంగ్రెస్ఐ, టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐల మహా కూటమిలో భాగంగా టిడిపి ఈ సీటు తీసుకుంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు. చంద్రబాబు, కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీలు కలిసి కూకట్‌పల్లితో సహా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినా ఓటమి తప్పలేదు. మాదవరం కృష్ణారావు 41049 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. 2014 లో కృష్ణారావు టిడిపి టిక్కెట్‌పై గెలిచి, తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలిచారు. కృష్ణారావుకు 111612 ఓట్లు రాగా, సుహాసినికి 70563 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసిన హరిశ్చంద్రారెడ్డికి 12 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మాధవరం కృష్ణారావు 43186 ఓట్ల ఆదిక్యతతో టిఆర్ఎస్ అభ్యర్ధి గొట్టుముక్కల పద్మారావుపై విజయం సాదించారు. 2009లో కూకట్‌పల్లికి ప్రాతినిద్యం వహించిన లోక్‌సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ 2014లో ఇక్కడ పోటీచేయలేదు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒకసారి కమ్మ సామాజికవర్గం నేత, రెండుసార్లు వెలమ సామాజికవర్గం నేత గెలిచారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కూకట్‌పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
కూకట్ పల్లిలో ‘మహానటి’ కీర్తి సురేశ్ సందడి
టాలీవుడ్ హీరోయిన్, ‘మహానటి’ కీర్తి సురేశ్ కూకట్‌పల్లిలో సందడి చేసింది. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ముగ్ధ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ముగ్ధ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించారు. ఇప్పటికే నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియోని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... హైదరాబాద్‌లోని కూకట్పల్లి వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. -
సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్
Shriya Came to Mallikarjuna Theater in Auto Video: ప్రముఖ నటి శ్రియ సరన్ చాలా గ్యాప్ తర్వాత ‘గమనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆమె తాజాగా నటించిన ఈ మూవీ నేడు(డిసెంబర్ 10) థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుకట్పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్పల్లి దగ్గర నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది. చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో ఆమె ఆటోలో థియేటర్‌కు రావడం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది. కాసేపటికి క్రితమే ఆమె ఆటోలో థియేటర్‌కు చేరుకుంది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రమేష్ కరుటూరి నిర్మించాడు. సామాజికంగా వెనుకబడిన ముగ్గురు యువతుల జీవితాల చుట్టు తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరక్కింది. ఇందులో శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నటించారు. -
కూకట్పల్లి మాల్లో సల్మాన్ సందడి, వీడియో వైరల్
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనదైన మ్యానరిజం, కండలతో లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హైదరాబాద్‌లో దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది. అది ఓ మాల్లో.. ఇంకేముందు హైదరాబాద్ ఫ్యాన్స్‌కు పండగే. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని Handsome Hunk #SalmanKhan With Fans In Hyderabad, @BeingSalmanKhan 🤯🔥 pic.twitter.com/05LawU4ZHJ — राधे (@iBadasSalmaniac) December 1, 2021 ఈ బి-టౌన్ కండల వీరుడు కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్లో సందడి చేయబోతున్నాడు. తాజాగా ఆయన నటించిన అంథిమ్ మూవీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి ఎంటర్ అయిన సల్మాన్ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సల్మాన్‌ను చూస్తూ ‘ఏక్ సెల్ఫీ’ అంటూ ఫ్యాన్స్ అంతా కేకలు పెడుతూ సల్మాన్‌పై అభిమానం ఒలకబోస్తున్నారు. ఈ వీడియోలను అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ‘హైదరాబాద్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ @సల్మాన్ ఖాన్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా? Most Handsome #SalmanKhan pic.twitter.com/QvEMPCkesa — BALLU🥺🤙 (@Balludlegend) December 1, 2021 కాగా ఈ రోజు సుజన ఫోరం మాల్‌కు సల్మాన్ రాబోతున్నాడు అంటూ పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం కూడా వెల్లడించింది. పీవీఆర్ సినిమాస్ ‘ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫోరం మాల్లో అంథిమ్ సినిమా చూసేందుకు సల్మాన్ రానున్నారు. ప్రతి ఒక్కరు టికెట్టు కొనుక్కొని సల్మాన్‌తో సినిమా చూసేందుకు సిద్దం అవ్వండి’ అంటూ ట్విటర్లో ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ‘భాయిజాన్’ హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా కుకట్పల్లి సుజన ఫోరం మాల్‌కు క్యూ కడుతున్నారు. సల్మాన్ రాకతో మాల్ అంతా సందడి వాతావరణం నెలకొననుంది. కాగా తన చిత్రం అంథిమ్ ప్రమోషన్లో భాగంగా సల్మాన్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ చేరుకున్నాడు. చదవండి: Salman Khan: చిరంజీవిగారు అడగ్గానే ఓకే చెప్పా! #SalmanKhan Instagram Stories, @BeingSalmanKhan pic.twitter.com/uIbSwd8YCv — राधे (@iBadasSalmaniac) December 1, 2021 Catch SALMAN KHAN in a meet and greet event at PVR exclusive FAN SCREENING of #ANTIM Time: 4:00 pm Venue: PVR FORUM SUJANA MALL, HYDERABAD Book your tickets now!@BeingSalmanKhan @MahimaMakwana_ @manjrekarmahesh @SKFilmsOfficial #aayushsharma @ZeeStudios_ pic.twitter.com/ILdW7r3mKo — P V R C i n e m a s (@_PVRCinemas) December 1, 2021 -
గిన్నిస్ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది
పటాన్చెరు: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శివాలి శ్రీవాస్తవ తన రికార్డులను తానేబద్దలు కొడుతోంది. ఆమె చేసిన కాగితపు బొమ్మలను మరో రికార్డు కోసం గీతం అధ్యాపకులు మంగళవారం ప్రదర్శించారు. గీతం పూర్వ విద్యార్థి అయిన శివాలి... విద్యార్థిగా ఉన్న కాలంలోనే మొత్తం 13 గిన్నిస్ రికార్డులను సాధించింది. ఆరెగామీ పేపర్‌తో రూపొందించిన ఆకృతులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదయ్యాయి. ఆమె పేరిట ప్రస్తుతం 13 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. అలాగే 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులనూ నెలకొల్పింది. ఈ ప్రదర్శనకోసం ఆరెగామి పేపర్‌తో ఆమె రెండు వేల నెమళ్లు, 1,600 కుక్కల బొమ్మలను తయారు చేసింది. అలాగే 5,500 బూరెలు, 6 వేల నిమ్మ తొనలు, ఇరవై వేల చేపలు, ఏడు వేల వేల్స్‌తో పాటు నాలుగు వేల క్విల్లింగ్ దేవదూతలు, 3,200ల క్విల్లింగ్ బొమ్మలను తయారు చేసి వాటిని ఒక చోట ప్రదర్శించింది. ఆమె ప్రదర్శనను రికార్డు చేసి గిన్నిస్ అధికారులకు పంపినట్లు గీతం అధ్యాపకులు తెలిపారు. గిన్నిస్ అధికారుల ఆమోదం పొందితే ఆమె పేరిట మరో 8 రికార్డులు వచ్చే అవకాశం ఉంది. -
ఊరికెళ్లే విషయంలో సాఫ్ట్వేర్ యువ దంపతుల గొడవ.. ఉదయం లేచేసరికి
-
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
సాక్షి, మూసాపేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్ హాస్టల్స్‌లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్‌సింగ్, శ్రావణ్కుమార్లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్ఎం మాల్లో సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్‌బీకాలనీకి వస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. దీంతో రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. లారీ డ్రైవర్ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాయడు. స్కూటీ ఇచ్చినందుకు అజయ్‌కుమార్, లారీ డ్రైవర్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్) (అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. ) -
వివాహితకు బిస్కెట్లలో మత్తుమందు, ఆపై
సాక్షి, హైదరాబాద్: వివాహితకు మత్తుమందు ఇచ్చి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరరం ఆమె నగ్న ఫొటోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ దారుణం కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. శ్రీధర్‌గౌడ్ అనే వ్యక్తి ఓ వివాహితకు మత్తుతో కూడిన బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న వివాహత సృహ కోల్పోయింది. దాంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఫోటోలను డిలీట్ చేయాలంటే 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఆ మొత్తం ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ షీ టీమ్ అతన్ని వలపన్ని పట్టుకుంది. క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన మాదాపూర్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ తనతో అభ్యంతరకరంగా వ్యవహరించాడని యువతి ఆన్లైన్ ఫిర్యాదులో పేర్కొంది. డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో యువతి ఫిర్యాదు చేయగా.. షీ టీమ్స్ అతన్ని అరెస్టు చేశాయి. ట్యూషన్ టీచర్ నిర్వాకం పాఠాలు చెబుతానంటూ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్‌ను సైబరాబాద్ షీ టీమ్ శనివారం అరెస్టు చేసింది. కూకట్‌పల్లిలో ఈఘటన వెలుగు చూసింది. అభ్యంతరకరంగా వ్యవహరించిన టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు బాలిక ఇదివరకే చెప్పింది. తల్లిదండ్రులు మందలించినా టీచర్ తీరు మారకపోవడంతో షీటీమ్‌కు సమాచారం అందించారు. ట్యూషన్ టీచర్‌ను అరెస్టు చేసిన షీ టీమ్ రిమాండ్‌కు తరలించింది. (చదవండి: కూతుళ్లను యువకుడి దగ్గరకు పంపుతున్న తల్లి) -
కూకట్‌పల్లిలో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి మరో కారును వేగంగా ఢీకొట్టింది. అనంతరం ఆటో, ద్విచక్ర వాహనంపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కేటీఆర్ @ కేపీ
సాక్షి, సిటీబ్యూరో: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి రూ.9.34 కోట్లతో చిత్తారమ్మబస్తీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.5.65 కోట్ల వ్యయంతో కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, 3వ ఫేజ్‌లో నిర్మించిన రూ.2.78 కోట్ల ఆధునిక ఫిష్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. కైతలాపూర్‌లో రూ.83.06 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. హైటెక్‌సిటీ–బోరబండ స్టేషన్ల మధ్య నాలుగులేన్లతో నిర్మించనున్న కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణ వ్యయంలో భూసేకరణకే రూ.25 కోట్లు ఖర్చుకానుండగా, మిగతా వ్యయంలో జీహెచ్ఎంసీ రూ.40 కోట్లు, రైల్వే శాఖ రూ.18.06 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఆర్ఓబీ పూర్తయ్యాక కూకట్పల్లి వైపు నుంచి హైటెక్సిటీవైపు సమాంతర మార్గంగా ఉపయోగపడుతుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేసియన్ టౌన్షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్‌ల వైపు నుంచి వెళ్లేవారు మూసాపేట వద్ద కైతలాపూర్ మీదుగా మాదాపూర్ మెయిన్‌రోడ్‌కు చేరుకోవచ్చు. తద్వారా మూడున్నర కి.మీ.ల మేర దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుందని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. చిత్తారమ్మ బస్తీలో 108 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సెల్లార్+స్టిల్ట్+9 అంతస్తులుగా నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ.7.90 లక్షలు, మౌలిక సదుపాయాలకు రూ.75 వేల వంతున వెరసి మొత్తం వ్యయం రూ.8.65 లక్షలు ఖర్చు చేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 560 చదరపు అడుగులు ఉంది. ఇండోర్ స్టేడియం.. ఇండోర్స్టేడియమ్లో రెండంతస్తులతోపాటు టెర్రస్ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్ నిర్మించారు. పురుషులు, మహిళలకు వేర్వేరు గ్రీన్‌రూమ్‌లు, కెఫ్టేరియా, యోగా రూమ్ తదితర సదుపాయాలున్నాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆర్ఓబీ వివరాలు.. పొడవు : 676 మీటర్లు వెడల్పు: 16.61 మీటర్లు వరుసలు:4 ప్రయాణం: రెండు వైపులా ఈ మార్గంలో రద్దీ సమయంలోప్రయాణించే వాహనాలు గంటకు: 3902 2040 నాటికి గంటకు ప్రయాణించేవాహనాలు : 7207 -
కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కుకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చైతన్య స్వస్థలం విశాఖ జిల్లా దువ్వాడ. చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేకపోవడంతో పాటు, తల్లిదండ్రుల మాట కాదనలేక మానసిక వేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి స్నేహితులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. వివరాలు.. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్‌కు కరీంనగర్ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్‌ను వదిలిపెట్టి.. లక్ష్మణ్‌తో కలిసి కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నాడు లక్ష్మణ్. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్, అనూషలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. చెప్పుతీసుకుని చితకబాదింది. -
కూకట్‌పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య
-
‘ఏపీలో దోచి.. కూకట్‌పల్లిలో..’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడి దోచిన సొమ్ముతో చంద్రబాబు కూకట్పల్లి నియోజకవర్గంలో గెలవడానికి విశ్వప్రయంత్నం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బాబు మీద ఉన్న వ్యతిరేకతతోనే సుహాసిని ఓడిపోయిందని అన్నారు. ‘చక్రాలు తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉండేది’ అని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, అంగన్వాడీలు, స్మశానాలకు కేంద్రకే నిధులిస్తోందని తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తన బాబు సొమ్ములాగా రోడ్లకు తన పేరు పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరపత్రాల రూపంలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే ప్రతిపనికి నిధులు కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పేరుతో ఎన్ని పార్టీలు జట్టుకట్టినా మోదీ ఇమేజ్ను తగ్గించలేరని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం సహజమేనన్నారు. -
జూపూడి ఇంటి వద్ద డబ్బు సంచులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాక ర్రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు. -
కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బస్సులు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి కాలేజీ విద్యార్థిని బలైందని తోటి విద్యార్థులు ఆగ్రహించటంతో కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రమ్య అనే ఇంటర్ విద్యార్థిని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది. ఈ ఉదయం కాలేజీకి వెళ్లడానికి కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీ చైతన్య కాలేజీకి చెందిన బస్సు ఆమెను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. శ్రీ చైతన్య కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. దాదాపు 10 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయటానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. కూకట్‌పల్లిలోని కాలేజీలను విద్యార్థులు బంద్ చేయిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ఈ సంఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. ‘‘ జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా విద్యార్థినిని బస్సు ఢీకొంది. కోపంతో ఉన్న విద్యార్థులు బస్సులపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. యాజమాన్యంతో కూడా మాట్లాడతాం. ఈ ప్రాంతంలో 20 వేల మంది విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రులు, టీచర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది’’ అని అన్నారు. చైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలి శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కూకట్పల్లి ప్రమాద ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు స్పందించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
ఫీజులపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏదీ!
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పాఠశా లలో గురువారం స్టేజీ కూలిపోయి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనపై నిరసన వెల్లువెత్తింది. చిన్నారుల మృతదేహాలతో శుక్రవారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బంధువులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కాగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆరోపించారు. పాఠశాల పైకప్పు ప్రమాదకరంగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన పలువురు పాఠశాల బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల పరిహారం... సంఘటన జరిగిన వెంటనే న్యూ సెంచరీ పాఠశాల డైరెక్టర్ ఎం.వెంకట్ పరారయ్యాడు. చిన్నారులు మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యం కోసం నిరీక్షించారు. యాజమాన్యం అజ్ఞాతంలో ఉండటంతో అధికారులతో చర్చించి నష్టపరిహారాన్ని ప్రకటించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. స్కూల్ అనుమతిని రద్దు చేయడంతో పాటు భవనాన్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. పాఠశాలలోని 176 మంది విద్యార్థులకు నష్టం జరగకుండా సమీపంలోని 11 పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికయ్యే ఫీజును ప్రభు త్వమే భరిస్తుందని ప్రకటించారు. అలాగే మృతి చెంది న విద్యార్థినులు మణికీర్తన, చందనశ్రీ కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందివ్వనున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ సందర్శన... మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవోను సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే ప్రతి వారం మండల ఎడ్యుకేషన్ అధికారులు అన్ని పాఠశాలలను తనిఖీ చేసి ఎప్పటికప్పడు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఒక విద్యార్థి డిశ్చార్జ్.. న్యూ సెంచరీ పాఠశాల ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో సందీప్‌ను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నరేశ్, లిఖిత ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలోనే చెప్పాం... పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని గతంలోనే పలుమార్లు యాజమాన్యానికి గుర్తు చేశాం. లైట్ వెయిట్‌గానే ఉంది.. ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం వహించారు. పాఠశాల పైకప్పు కూడా తాటి చెక్కలతో పేర్చారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే చిన్నారులు బలయ్యారు. – రమణారావు, విద్యార్థి తండ్రి వెంకట్రావ్‌నగర్ నా ఆనందం ఆవిరైంది... నా మనవరాలు మణికీర్తన గొప్పగా చదువుకుంటుందని చాలా ఆనందపడ్డాం. పెద్ద డాక్టర్ అయి నాకు మెరుగైన వైద్యం చేస్తానని, తన దగ్గరే ఉంచుకుంటా అని చెబుతుంటే ఎంతో ఆనందపడ్డా. ఇప్పుడు ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. నా మనవరాల్ని ఈ పాఠశాల బలిగొంది. – పద్మ, మణికీర్తన నానమ్మ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... రూ.లక్షల ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల భద్రతలో లేకపోవడం దారుణం. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విలువైన చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిశాయి. నా మనవరాలు పాఠశాలలో చేరి రెండు నెలలైనా కాలేదు.. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది మాకు తీరని గుండెకోత. దీనికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. – డి. రంగయ్య, చందనశ్రీ తాతయ్య -
రూ.100 కోసం హత్య
భాగ్యనగర్‌కాలనీ : క్షణికావేశంలో ఓ వ్యక్తిపై కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో శనివారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ భుజంగరావు నిందితుడి వివరాలు వెల్లడించారు. మూసాపేటలో నివాసముంటున్న బంక సైదులు(25) జేకే పాయింట్ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పెయింటింగ్ పని కూడా చేశాడు. అయితే ఆ సమయంలో మృతుడు సయ్యద్ పాషాతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఇరువురు కలిసి కల్లు తాగేవారు. ఈ క్రమంలోనే సయ్యద్ పాషా సైదులు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈ నెల 24వ తేదీన కల్లు కాంపౌండ్ నుంచి సయ్యద్ పాషా బయటకు వస్తుండగా గమనించిన నిందితుడు సైదులు తన వద్ద నుంచి తీసుకున్న రూ.100 ఇవ్వమని అడగడంతో పాషా పక్కకు నెట్టివేయటంతో సైదులు కింద పడిపోయాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకుని సమీపంలో ఉన్న కర్రతో మారుతినగర్లో పాషాపై దాడి చేశాడు. దీంతో తల, మొహంపై తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య చాంద్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడు సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ సీఐ మహేష్‌గౌడ్, ఎస్ఐ భానుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
అవమానించాడనే అంతం చేశారు..
హైదరాబాద్: ‘అందరి ముందూ అవమానించాడు.. జనమంతా చూస్తుండగా చేయి చేసుకున్నాడు.. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.. ఈ అవమానం భరించలేక అంతం చేయాలని నిర్ణయించుకున్నాం.. నలుగురు స్నేహితులం కలసి పరీక్ష రాయడానికి వెళ్తున్న సుధీర్‌ను నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి హత్యచేశాం..’సుధీర్ హత్య కేసులో కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు వెల్లడించిన విషయాలివీ. సోమవారం కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి సుధీర్ కేసులో ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ ఎన్.భుజంగరావు, సీఐ వడ్డే ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. హత్యకు దారి తీసిన గొడవ.. ఇంటర్ చదువుతున్న మూసాపేటకు చెందిన ఎలగల సుధీర్(19) ఈ నెల 9న స్థానిక సభ్యత గ్రౌండ్లో అదే ప్రాంతానికి చెందిన ఇప్పలి కృష్ణ స్నేహితులతో గొడవ పడ్డాడు. సుధీర్‌ను కృష్ణ ప్రశ్నించడంతో.. వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. సుధీర్.. కృష్ణపై చేయి చేసుకున్నాడు. గొడవ విషయాన్ని సుధీర్ సోదరుడు ప్రసాద్‌కు చెప్పాడు. అదే రోజు సాయంత్రం కృష్ణ స్నేహితులైన జిల్లా మహేశ్, నవీన్.. సుధీర్, ప్రసాద్‌లకు గొడవ జరిగింది. అందరూ చూస్తుండగానే మహేశ్, నవీన్‌ను ప్రసాద్, సుధీర్ కొట్టారు. రాత్రి 9 గంటల సమయంలో మల్లన్న ఆలయం సమీపంలోకి వెళ్లిన మహేశ్‌కు అక్కడే ఉన్న సుధీర్, ప్రసాద్‌కు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తనపై దాడికి పాల్పడిన సుధీర్‌ను అంతం చేయాలని మహేశ్ నిశ్చయించుకున్నాడు. స్నేహితులు కృష్ణ, నవీన్, తేజతో కలసి పథకం వేశాడు. 2 వేటకొడవళ్లను కొనుగోలు చేసి.. వాటిని తేజ హోండా యాక్టివాలో దాచిపెట్టారు. సుధీర్ కదలికలు తెలుసుకోడానికి అదే ప్రాంతానికి చెందిన బైరెడ్ల శివ సహకారం తీసుకున్నారు. సోమవారం ఉదయం సుధీర్ పరీక్ష రాసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరి వసుంధర ఆస్పత్రి రోడ్డులో వస్తున్నాడని సమాచారం అందించాడు. కాపు కాసి.. దాడి చేసి.. దీంతో మహేశ్, మిగతా ముగ్గురు జాతీయ రహదారి పక్కనే ఉన్న సాగర్ హోటల్ వద్ద కాపు కాశారు. సుధీర్ రావడంతో అతడిని బైక్‌పై నుంచి లాగి కత్తులతో దాడి చేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రభాకర్, అంజి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ముగ్గురు పారిపోగా నవీన్ పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా మిగతా నిందితుల సమాచారం, సంఘటనకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు.. నిందితులు జిల్లా మహేశ్, శివను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బుల్లెట్ వాహనం,రెండు వేటకొడవళ్లు, మూడు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల్లో ఇప్పలి కృష్ణ, తేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులకు కమిషనర్ చేతుల మీదుగా రివార్డును అందజేయనున్నట్లు ఏసీపీ భుజంగరావు సమావేశంలో తెలిపారు. -
చట్నీస్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
-
కూకట్‌పల్లిలో మహిళ అనుమానాస్పద మృతి