సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడి దోచిన సొమ్ముతో చంద్రబాబు కూకట్‌పల్లి నియోజకవర్గంలో గెలవడానికి విశ్వప్రయంత్నం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బాబు మీద ఉన్న వ్యతిరేకతతోనే సుహాసిని ఓడిపోయిందని అన్నారు. ‘చక్రాలు తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉండేది’ అని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్రామాల్లో రోడ్లు, అంగన్‌వాడీలు, స్మశానాలకు కేంద్రకే నిధులిస్తోందని తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తన బాబు సొమ్ములాగా రోడ్లకు తన పేరు పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరపత్రాల రూపంలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే ప్రతిపనికి నిధులు కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పేరుతో ఎన్ని పార్టీలు జట్టుకట్టినా మోదీ ఇమేజ్‌ను తగ్గించలేరని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం సహజమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment