Kanna Laxminarayana
-
‘కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణగదొక్కబడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబును ప్రజలు బహిష్కరించే పరిస్థితి వస్తుంది. నోరు ఉంది కదా అని ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుందనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు బ్రతుకే హింసాత్మకమైనది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి అని ప్రశ్నించారు. కన్నా ఆటలు మా దగ్గర సాగవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ.. సోము వీర్రాజుపై ఎఫెక్ట్ ఎంత?
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. వివరాల ప్రకారం.. ఏపీ బీజేపీ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు. -
వీర్రాజు Vs కన్నా.. ఏపీ బీజేపీలో లుకలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక నేపథ్యంలో రెండు రోజులుగా సోము వీర్రాజునుద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ‘పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలో మా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. గతంలో ఇలాంటి పార్టీ విషయాలపై రెండు నెలలకోసారి అందరమూ కూర్చొని మాట్లాడే వాళ్లం. ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే ఇవన్నీ చూస్తున్నారు. ఎవరితోనూ చర్చించడంలేదు. చివరకు కోర్ కమిటీలో కూడా చర్చకు రావడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో మాకు తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు. పవన్‌తో సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, ఆ బాధ్యతను జాతీయ నాయకుడు మురళీధరన్‌కు అప్పగించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే, 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అధిష్ఠానం స్పష్టం చేసిందని.. అందువల్లే ఆసంతృప్తితో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ కూడా రాష్ట్రంలో సోము వీర్రాజు నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కన్నా కొట్టిపారేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన నాటి నుంచి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. బుధవారం తాను ఎలాంటి కార్యకర్తల సమావేశం నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం వీర్రాజు ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం ఎయిర్‌పోర్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన విజయవాడకు రాలేదు. నేరుగా బెంగళూరుకు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వీర్రాజుకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించినా.. పార్టీలోనే కొందరు నేతలు మోకాలడ్డినట్టు విమర్శలు వచ్చాయి. మండల నాయకుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు.. సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము సూర్యారావు, గంగమ్మ దంపతులకు 1957లో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన ఆయన బీఎస్సీ చదివారు. వృత్తి వ్యాపారం. వీర్రాజు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. – 1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా అరంగేట్రం చేశారు 1980లో యువమోర్చా తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2006–10 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010–13 తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు మొదటిసారి, 2014 నుంచి ఇప్పటి వరకు రెండోసారి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. – ప్రస్తుతం ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. శుభాకాంక్షలు తెలిపిన జీవీఎల్ బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీర్రాజు నాయకత్వంలో పార్టీ బలమైన రాజకీయ పార్టీగా ముందుకు వెళుతుందని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. పార్టీ నిర్ణయానికి సర్వదా కృతజ్ఞుడను. ప్రధాని నరేంద్ర మోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షాలు పార్టీకి, రాష్ట్రానికి ఒక మంచి దిశను అందించారు. – సోము వీర్రాజు -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం సోము వీర్రాజు స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. దశాబ్దాలుగా సంఘ్ పరివార్‌లో కొనసాగారు. గతంలోనే సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి.. చేతికి అందినట్టే అంది చేజారింది. ప్రస్తుతం ఆయన ఏపీ మండలిలో సభ్యునిగా కొనసాగుతున్నారు. -
ప్రపంచానికి మోదీ ఆదర్శం
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ తన పాలనా సామర్థ్యంతో ప్రపంచానికే ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి కన్నా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో మోదీ పారదర్శకమైన పాలనతో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశారని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ను నియంత్రిస్తుండటమే కాకుండా.. దేశం స్వయం సమృద్ధితో ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్న గొప్పనాయకుడిగా ప్రజల నుంచి మన్ననలు పొందారని అన్నారు. రమేష్ కుమార్‌ను కొనసాగించండి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మరింత సాగదీస్తే రాష్ట్రానికున్న మంచి పేరు పోవడమే కాకుండా, న్యాయవ్యవస్థ పట్ల రాష్ట్రానికున్న గౌరవాన్ని కూడా తగ్గించినట్టవుతుందని పేర్కొన్నారు. -
కన్నా కోడలి మృతిపై వీడని గుట్టు
సాక్షి,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక(38) మృతి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుహారిక మృతిలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. దీంతో ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసు విచారణలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు సుహారిక నివాసంతో పాటు, ఆమె పార్టీకి వెళ్లిన స్నేహితుల ఇళ్ల పరిశీలనతోపాటుగా పలువురిని ప్రశ్నించనున్నారు. (కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి) సుహారిక వయస్సు చిన్నదే కావటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా ఆమెకు గుండెపోటుకు దారితీసిన కారణాలపై పోలీసు విచారణ కొనసాగనుంది. అయితే, ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ రఫీ మీడియాతో మాట్లాడుతూ.. సుహారిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో కన్నా కుటుంబసభ్యుల సమక్షంలో సుహారిక అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుహారిక భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతికి గల కారణాలు తెలియనున్నాయి. సుహారిక తల్లి, భర్త ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
'ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదు'
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విపత్కర సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డి పై నీచమైన కామెంట్లు చేసినందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారన్నారు. బీజేపీకి అండగా అండగా ఉంటున్న జనసేనతో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రపంచంలో భారత దేశం ముందుంటే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని జాతీయ మీడియా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు సహా ఇతర టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రికి నివేదించానంటూ కొట్ట సత్యనారాయణ పేర్కొన్నారు. అంతకముందు తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాణిజ్య, వ్యాపార, డ్వాక్రా మహిళలు తదితర వర్గాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటానికి మద్దతుగా ఇచ్చిన విరాళాలను బుధవారం అమరావతిలో సీఎంను కలిసి రూ. 2 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. మంచి సమాజం రావాలంటే అందరూ సహకరించాలి అలా సహకరించాలని పేర్కొన్నారు. -
పార్టీ నిధులకు కన్నం..!
-
కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?
సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ కన్నా విసిరిన సవాలుపై స్పందిస్తూ.. తాను దేవుడిపై ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కన్నా, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిలు కూడా ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. తాజాగా కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్ అంటూ కన్నా లక్ష్మీ నారాయణను విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అలాగే కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ. 30 కోట్లు నొక్కేశాడని ఎన్నికల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. స్థానికంగా సమీకరించిన విరాళాలు కూడా దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు అందాయని తెలిపారు. కన్నాతో పాటుగా కొత్తగా చేరిన నేతలు.. ఈ నిధులను పంచుకున్నట్టు బీజేపీ పెద్దలకు తెలుసునని పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చీమ కుడితే.. బీజేపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి.ఎప్పుడు ఏ విధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్...? @klnbjp — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు. pic.twitter.com/B3sUlBrwUC — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి. ఎప్పుడు ఏవిధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది. — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చదవండి : ‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా -
కన్నా మాట్లాడుతోంది బిజెపి లైనా?.. టిడిపి లైనా?
-
‘నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు’
సాక్షి, విశాఖపట్నం : గతి భారతి ఫౌండేషన్ ద్వారా కొందరు స్నేహితుల సహాయంతో ప్రజలకు సహాయం చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తాము ఫౌండేషన్ నడపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనెప్పుడూ అసత్య ఆరోపణలు చేయ్యలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఎప్పుడూ తెలిసి అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేసి చెప్పారు. (పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత.. ) ప్రస్తుతం కొన్ని బ్యాంకులు విలీనం చెయ్యడం.. ఆర్థికంగా చితికి పోవడం లాంటి దుస్థితి సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లే జరుగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి రింగ్ ఎంట్రీలు చేసి ఎలా బోగస్ కంపెనీలు సృష్టించారో ఆధారాలతో సహా రుజువు చేయగలనని స్పష్టం చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నా.. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు కన్నా లక్ష్మీనారాయణ ఎంత వరకు దుర్వినియోగం చేశారో తాను లెక్కల్లో చెప్పగలనని అన్నారు. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. (జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి: కవిత) కేంద్రం ఇచ్చిన ఎన్నికల నిధులు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఎంత దారి మల్లించారో తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని, కళ్లు ముసుకొని పిల్లి పాలు తాగి ఎవరూ చూడలేదని అనుకుంటుందని.. సుజనా, కన్నా లాంటి అవినీతి పరులు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా ) -
‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!’
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? ) టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు. -
కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
కమలానికి కొత్త సారధి..?
-
‘పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఆయనొక’
విశాఖపట్నం: ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తే పవన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ పవర్ స్టార్ కాదని, ఆయనో పిరికి స్టార్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఒకటే వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు జరిగిందో అలాగే ఉంటుందని, మిగిలిన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పిన విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ రికార్డు పవన్ పేరిటే ఉంది.. జనసేన ఆరు ఏళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు ఘనత సాధించిందని ఎమ్మెల్యే అమర్నాథ్ చురకలంటించారు. పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు చోట్ల ఓడిపోయిన రికార్డు కూడా పవన్ పేరిట ఉందని ఎద్దేవా చేశారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. నిన్న కన్నా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా అని కన్నాని సూటిగా ప్రశ్నించారు. ఆయన భూములు సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఇష్టం లేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీలా మారిందని, దానికి జనసేన ఈక పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలో టీడీపీతో జనసేన లోపకారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. -
అప్పుడు ‘కన్నా’ ఏమైపోయారు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందు మతాన్ని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడో చిన్న ఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాగా నెల్లూరు జిల్లా రథం కాల్చివేసిన ఘటనపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దేవాలయాలు ఎవరూ కూలదోసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చారించారు. ఏపీ గవర్నర్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగా.. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల్లో వేల కోట్ల రూపాయలను దోచుకున్నప్పుడు, విజయవాడలో దేవాలయాలను కూల్చివేసినప్పుడు.. కన్నా ఏమైపోయారని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీని కన్నా తెలుగుదేశం జనతా పార్టీగా మార్చివేశారని.. దానికి అధ్యక్షుడిగా సుజనా చౌదరి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరిల డైరెక్షన్లో ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో సదావర్తి భూములను దోచుకుంటే ఆయన ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో అమరావతి భూములను వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మేనిఫెస్టో కన్నాకు కనిపించడం లేదా అని విమర్శించారు. -
ఏపీ గవర్నర్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ: మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో రథం తగలబెట్టి, దేవాలయాలను కూల్చివేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదే విధంగా పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)పై పార్లమెంటులో చట్టం చేసినప్పటీ నుంచి కాంగ్రెస్, వామపక్షాలు క్షేత్రస్థాయిలో ప్రజల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. భారతదేశంలో ఎన్ఆర్సీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నోసార్లు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై మార్పు చేయడం జరగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డాయని మండిపడ్డారు. ఎన్ఆర్సీ లేదని చెబుతున్నా అసదుద్దీన్ ఒవైసీ గుంటూరులో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఓవైసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల భారతదేశంలో ఏ ఒక్క ముస్లింలకు అన్యాయం జరగదని కన్నా పేర్కొన్నారు. -
‘కన్నా.. వాస్తవాలు తెలుసుకోండి’
సాక్షి, అమరావతి: జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్‌లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్లో ఉన్నారని పేర్కొంది. వెయిటింగ్లో ఉన్న పోలీసు అధికారులకు పోస్టింగులివ్వండి: కన్నా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వక వెయిటింగ్లో కొనసాగుతున్న పోలీసు అధికారులకు వెంటనే పోస్టులను కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు వెయిటింగ్లో ఉంచిన పోలీసులందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు. -
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు..
-
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు..
సాక్షి, విశాఖపట్నం: సంక్షేమ పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని వెల్లడించారు. రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయని.. రాష్ట్ర రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. టీడీపీతో గత ఐదేళ్లుగా జత కట్టిన బీజేపీ ఎందుకు 1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందో సమాధానం చెప్పాలన్నారు. ‘రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చువుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు చెప్పలేదా.. బీజేపీ లక్ష కోట్లు ఇస్తే రాజధానిని అమరావతిలో కొనసాగించడానికి సిద్ధమని’ తెలిపారు. ఆయనకు విజన్ లేదు..ప్యాకేజీ ఇస్తే చాలు.. పవన్‌కు విజన్ లేదని..ప్యాకేజీ ఇస్తే చాలని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ గుర్తింపు కోసమే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌పై తప్పుడు కేసు పెట్టలేదా.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను అడ్డుకోలేదా’ అని నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో చంద్రబాబు మూడు సీట్లకే పరిమితమవుతారన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. వారే రాజధాని ఉద్యమంలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ మాఫీయా, భూదందా చేసేవాళ్లే ఎక్కువ మంది రాజధాని ఉద్యమంలో ఉన్నారని దుయ్యబట్టారు. రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని సూచించారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థులకు వరమని.. సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. అని వర్గాల సంక్షేమమే వైస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. -
చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా
సాక్షి, లబ్బీపేట / విజయవాడ తూర్పు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించినా, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. బృందావన కాలనీలో బీజేపీ అధికార ప్రతినిధి, ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోగులూరి శ్రీకృష్ణచైతన్య శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధారి్మక సెల్ కార్యాలయాన్ని సోమవారం కన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల విద్యాబోధన కాకుండా, తెలుగు మీడియం పాఠశాలలు తొలగించకుండా, ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని, గత ప్రభుత్వం దేవాలయాలను కూలి్చందని, ఎన్ని క్షుద్రపూజలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ధారి్మక సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
‘పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. -
కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. గురజాలలో ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడంలేదని, గత ప్రభుత్వంలో గురజాలలో సున్నపురాయి దోపిడీ జరుగుతుంటే అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు అక్రమ కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ప్రశ్నించలేదు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకుల ద్వారా నిజాలు తెలుసుకోవాలని’ కన్నాకు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ మైనింగ్, అక్రమ గ్రానైట్, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు జరగకుండా అదుపు చేశాం. గడచిన 3 నెలల్లో గురజాలలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. 2 నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారి మాటలు వింటే పచ్చ కామెర్ల వారికి అంత పచ్చగానే కనపడుతుందనేలాగే ఉంటుందని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని బీజేపీలోకి పంపి మళ్ళీ 3సంవత్సరాల తర్వాత టీడీపీలో చేర్చుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం బీజేపీ భుజాలపైన గన్ను పెట్టి వైఎస్సార్సీపీపై దాడిచేయాలని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు టీడీపీ దుర్మార్గాలను గ్రహించాలని సూచించారు. గతంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధర్నా చేసే వారికి ప్రొటెక్షన్ కల్పించమని పోలీసు అధికారులకు సూచిస్తుంది అని పేర్కొన్నారు.