
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment