ఉల్లాసం... ఉత్సాహం | Dasari Lokesh Babu Ullasangaane utsahamgaane movie Teaser Launch | Sakshi
Sakshi News home page

ఉల్లాసం... ఉత్సాహం

Published Mon, Dec 16 2024 3:09 AM | Last Updated on Mon, Dec 16 2024 3:09 AM

Dasari Lokesh Babu Ullasangaane utsahamgaane movie Teaser Launch

దాసరి లోకేశ్‌బాబు, శిరీష నులు జంటగా నటిస్తున్న సినిమా ‘ఉల్లాసంగానే ఉత్సాహంగానే.’. కేవీజీ రాజు దర్శకత్వంలో మైత్రీ క్రియేషన్స్‌ పతాకంపై యార్లగడ్డ ఉమా మహేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో లోకేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్‌ అంశాలతోపాటు అన్ని కమర్షియల్‌ హంగులు ఉన్న ఈ సినిమా మా టీమ్‌ అందరికీ సక్సెస్‌ ఇస్తుందని నమ్మతున్నాను’’ అన్నారు.

‘‘లోకేశ్‌ ఎనర్జిటిక్‌గా నటించాడు. ఈ సినిమా విషయంలో మా నిర్మాతల సాయం మర్చిపోలేనిది’’ అని తెలిపారు కేవీజీ రాజు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఉమా మహేశ్వరరావు. ఈ సినిమా సహ నిర్మాతలు ఎండీ కలామ్, ఖదీర్, నటుడు జబర్దస్త్‌ ప్రవీణ్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement