
ఇంద్రాణి దావులూరి లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’(Andhela Ravamidhi movie). విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్యా మీనన్, జయలలిత, ఆది లోకేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శివ భట్టిప్రోలు సమర్పిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘మన కళలు, సంస్కృతీ సంప్రదాయాలపై ఇంద్రాణిగారికి ఎంతో మక్కువ.
హద్దులు దాటుతున్న కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్‌లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కల్చర్‌ను తెలియజెప్పాలనే ప్రయత్నంతో ‘అందెల రవమిది’ సినిమా తీశారు. ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘భరతనాట్యం నేపథ్యంలో వస్తున్న ‘అందెల రవమిది’కి మన వంతు సహకారం అందించడం మన బాధ్యత’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘రెండువేల ఏళ్ల నాటి నృత్య కళ భరతనాట్యం. ఈ కళను బతికించుకోవాలి.
వెస్ట్రన్ డ్యాన్స్‌లను 30 సంవత్సరాల తర్వాత మనం చేయలేం. కానీ భరతనాట్యాన్ని చనిపోయేవరకూ చేయవచ్చు. ఇప్పటివరకూ మా సినిమాకి డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఉమెన్ మేడ్ మూవీ, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్‌గా పలు పురస్కారాలు దక్కాయి’’ అని తెలిపారు ఇంద్రాణి.
Comments
Please login to add a commentAdd a comment