
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తిరిగి క్షమాపణలు చెబుతుంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలానే క్రికెటర్ వార్నర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. బహిరంగంగా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు)
ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీతో నటుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... వార్నర్ ని దొంగ ముం* కొడుకు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈవెంట్ కి తాగొచ్చారా అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. త్వరలో రిలీజ్ పెట్టుకుని ఇలాంటివి సరికాదని అర్థం చేసుకున్నారేమో రాజేంద్రప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్- వార్నర్ తనకు పిల్లల్లాంటి వారని.. సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించమని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3
— Milagro Movies (@MilagroMovies) March 25, 2025
Comments
Please login to add a commentAdd a comment