
ఒకప్పటితో పోలిస్తే జనాలు ఇప్పుడు థియేటర్ కి రావడం బాగా తగ్గించేశారు. సమ్ థింగ్ డిఫరెంట్ లేదా మూవీ హిట్ అనిపించుకుంటేనే వస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ వారం రాబోతున్న రెండు మీడియం బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. దీంతో ఓ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్)
ఈ శుక్రవారం నితిన్ 'రాబిన్ హుడ్', మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై ఓ మాదిరి హైప్ ఉంది. అలా అని ఇవేం భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో తీసిన సినిమాలైతే కాదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు కానీ ఆంధ్రాలో మాత్రం సింగిల్ స్క్రీన్ కి రూ.50, మల్టీప్లెక్స్ కి రూ.75 పెంపు ఇచ్చారు. దీంతో ఈ సినిమాలకు పెంపు అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి.
దీంతో 'రాబిన్ హుడ్' నిర్మించిన మైత్రీ మూవీస్ ఓ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ అంతా టికెట్ రేట్ల పెంపు లేదని, కొన్నిచోట్ల మాత్రం ఈ రేట్స్ అమల్లోకి వస్తాయన చెప్పింది. వీళ్లు చెప్పిన దానిబట్టి వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి కొన్నిచోట్ల మాత్రమే పెంపు ఉండొచ్చు. మిగిలిన చోట్ల సాధారణ ధరలే ఉండనున్నాయి.
(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)

Comments
Please login to add a commentAdd a comment