
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‌హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o
— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024