Ticket price
-
తెలంగాణలో తండేల్ షోలు.. అంత బెనిఫిట్ మాకొద్దు: అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
నాగచైతన్య హీరోగా వస్తోన్న తండేల్ చిత్ర టికెట్ ధరలపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదని అన్నారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగామని తెలిపారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవని.. అంత బెనిఫిట్ కూడా వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.295, రూ. 395 టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయని అల్లు అరవింద్ తెలిపారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. అంత బెనిఫిట్ కూడా మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామని అడిగారు. కానీ నేను సినిమా చూశాక మనమే విడుదల చేద్దామని చెప్పా' అని అన్నారు.కాగా.. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
రిలీజ్‌కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. -
కేసీఆర్‌కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్‌గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్‌గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్‌గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. తెలుగు ప్రేక్షకులంటే ఎందుకంత చిన్నచూపు
-
అల్లు శిరీష్ బడ్డీ మూవీ.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్!
అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో బడ్డీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. Our team wants you & your whole family to enjoy #Buddy🧸in cinemas. So we've made the prices of ticket accessible. So, buddy.. Are you ready? #BuddyonAug2nd @StudioGreen2 pic.twitter.com/9yV1A3ZqSc— Allu Sirish (@AlluSirish) July 29, 2024 -
అందుకే టిక్కెట్ ధర తగ్గించాం
‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ ధర ఎంత పెట్టినా ప్రేక్షకులు వస్తారు. కానీ, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ‘పేక మేడలు’ టిక్కెట్ ధరని వంద రూ΄ాయలు చేశాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘పేక మేడలు’. రాకేశ్ వర్రే నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘పేక మేడలు’లాంటి మంచి సిని మాని ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో యాభై రూ΄ాయలకే ప్రీమియర్స్ వేశాం. చూసినవారు సినిమా బాగుందన్నారు’’ అన్నారు. ‘‘ప్రీమియర్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్‌లాగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు నీలగిరి. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్న ధీరజ్, రానా, అడివి శేష్, విశ్వక్ సేన్ గార్లకి కృతజ్ఞతలు’’ అన్నారు రాకేశ్ వర్రే. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
#HYD Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది. కాగా, హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు. BREAKING: #Hyderabad Metro Rail officials took a crucial decision due to the increase in traffic. 10% discount on metro card along with Rs.59 holiday card has been cancelled. On the other hand, the demand for metro travel has increased with the intensity of the summer. — Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) April 7, 2024 మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదేవిధానాన్ని అమలుచేస్తున్నారు. -
ఆంధ్రాలోనూ 'గుంటూరు కారం' టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైపోయింది. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే టికెట్ రేట్ల పెంపుపై ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించేసింది. అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 వరకు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. అలానే ఈనెల 12 నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపు కోసం వెసులుబాటు కల్పించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) ఇక తెలంగాణ విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంపు ఇచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి అనుమతి లభించిన దృష్ట్యా ఆంధ్రాలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సినిమా విషయానికొస్తే.. మాస్-ఫ్యామిలీ-కమర్షియల్ ఎలిమెంట్స్‌తో 'గుంటూరు కారం' తీశారు. మహేశ్‌కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. చినబాబు నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) -
‘సలార్’ టికెట్ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’కు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సలార్’చిత్రం ప్రదర్శించే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ ధరపై రూ.65, మల్టిప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ టికెట్ ధర పెంపు ఈనెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో కు, ఆరోజు ఆరో షో వేసేందుకు అనుమతించారు. ఈనెల 22న తెల్లవారుజామున ఒంటిగంటకు ‘సలార్’చిత్రం బెనిఫిట్ షో వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు అప్పటితో పోలిస్తే డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ స్టార్ హీరోల మూవీస్‌కి మాత్రం వేరే లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. అలా వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిలో తెలుగు-తమిళ ప్రేక్షకుల చాలా అంటే చాలా ఎదురుచూస్తున్న మూవీ 'లియో'. ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతోంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) 'లియో' సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడటానికి కారణం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 'విక్రమ్' సినిమాతో ఒక్కొక్కరిని అవాక్కయ్యేలా చేసిన ఇతడు.. ఈ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. అలానే 'LCU'తో దీనికి లింక్ ఉందని, ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని రూమర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఇలా పలు కారణాల వల్ల 'లియో'పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు ఎంచుకున్నారు. అభిమానులు ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారని తెలిసి, ఏకంగా ఒక్కో టికెట్‌ని రూ.5 వేలకు అమ్ముతున్నారనట. తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన దగ్గర అంతంత టికెట్ ధరలు ఉండకపోవచ్చులే! (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
చవక రేటుకే ఆదిపురుష్ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ హవా చప్పున చల్లారిపోయింది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తర్వాత మాత్రం మరో నూరు కోట్లు రాబట్టేందుకు వారం రోజులు తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద దారుణ కలెక్షన్లు అందుకుంటున్న ఈ సినిమాను ఎలాగైనా గండం గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే టికెట్ రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు. తొలుత జూన్ 21న ఆదిపురుష్ త్రీడీ టికెట్ రేట్లను రూ.150కే అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించింది చిత్రయూనిట్. అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆదిపురుష్‌పై వస్తున్న వ్యతిరేకత కలెక్షన్లకు గండి కొడుతూనే ఉంది. దీంతో తాజాగా మరోసారి టికెట్ రేట్లు తగ్గించారు. కేవలం 112 రూపాయలకే ఆదిపురుష్ 3D టికెట్లు బుక్ చేసుకోండి అని ప్రకటించారు. సోమవారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఆదిపురుష్ మేకర్స్ ప్రకటించిన బంపర్ ఆఫర్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా చూడం', 'మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమాను ఎలా భ్రష్టుపట్టించారో అర్థమైంది', 'సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకునేకన్నా ఇంట్లో ఉండటం నయం', 'అరె.. బాబూ.. రూపాయికి టికెట్లు ఇచ్చినా సరే చూసేదే లేదు', 'ఓం రౌత్ హనుమాన్ కోసం థియేటర్లో ఒక సీటు వదిలేయమన్నాడు, కాబట్టి మనమంతా వానర సేన కోసం సినిమా హాల్ అంతా వదిలేద్దాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Witness the epic saga unfold!🏹 Book your tickets starting from just Rs112/-* and experience the grandeur world of Adipurush🧡 Offer starts tomorrow! #JaiShriRam 🙏 Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut… pic.twitter.com/cQOKqn0I4S — T-Series (@TSeries) June 25, 2023 చదవండి: ఆదిపురుష్ 2 ఉందా? బూతులు మాట్లాడుతున్న జనాలు -
ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. ) View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
ఆదిపురుష్.. టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపోతే అటు తెలంగాణ సర్కార్ కూడా టికెట్ రేట్ల పెంపునకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. చదవండి: ఆదిపురుష్ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! ఆదిపురుష్ మరికొద్ది గంటల్లో రిలీజ్.. ప్రచారం ఎక్కడ? -
ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
మరో రెండు రోజుల్లో థియేటర్లలో ఆదిపురుష్ సందడి చేయనుంది. జూన్ 16వ తేదీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి నుంచే అటు ర్యాలీలు, ఇటు భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. వీళ్ల రచ్చతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది. మరోపక్క అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షురూ కావడంతో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు సమాయత్తమయ్యారు ఫ్యాన్స్. టికెట్ రేటు ఎంతున్నా సరే తగ్గేదే లేదంటూ ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి! అయితే కొన్ని చోట్ల టికెట్ల రేట్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయట. ఢిల్లీ ఆంబియన్స్ మాల్లోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఆదిపురుష్ టికెట్ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2,200 రూపాయలు. ఇదేదో త్రీడీ వర్షన్‌కు అనుకునేరు. కేవలం 2డీ ఫార్మాట్‌కు మాత్రమే! ఢిల్లీలోని పీవీఆర్: వేగాస్ లగ్జ్ థియేటర్లో కూడా ఒక్క టికెట్ ధర రెండు వేల రూపాయలుగా ఉంది. ఇంత ధర పలుకుతున్నా సరే ఫ్యాన్స్ ఎగబడి టికెట్స్ కొనడంతో అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ అవుతుండటం విశేషం. హైదరాబాద్‌లో త్రీడీ వర్షన్ టికెట్ ధర విషయానికి వస్తే కొన్ని చోట్ల రూ.325 నుంచి మొదలవుతుండగా మరికొన్ని చోట్ల రూ.400గా ఉంది. ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించారు. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. చదవండి: మొన్ననే విడాకులు.. అంతలోనే మళ్లీ కలవాలనుందన్న నటుడు -
'ఆదిపురుష్' టికెట్స్ రేట్ల పెంపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం.. 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచగా.. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ( ఇది చదవండి: 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్త ఎక్కువే) తాజాగా ఈ చిత్ర బృందానికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అది పురుష్ సినిమా టిక్కెట్స్ రేటు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌కు 50 రూపాయల పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ చిత్రం రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) -
ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు
లెబ్రాన్ జేమ్స్(Lebron James).. బాస్కెట్ బాల్ గేమ్ ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్(NBA) గేమ్‌లో అతనికున్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికాలో ఎన్బీఏ గేమ్ బాగా పాపులర్. తాజాగా లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. దీంతో లీగ్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతని ఆట కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి అభిమానులు వెనుకాడడం లేదు. ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఓక్లహామా సిటీ థండర్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు రికార్డు ధర పలికాయి. ఒక్కో టికెట్ 92 వేల డాలర్లు (సుమారు రూ.75 లక్షలు)కు అమ్ముడుపోతున్నట్లు బ్లీచర్ రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి ఈ మ్యాచ్ లో లెబ్రాన్ జేమ్స్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు . లాస్ ఏంజిల్స్ లేకర్స్ అంతకుముందు ఫిబ్రవరి 4న న్యూ ఆర్లీన్స్ పెలికాన్స్ తో, ఫిబ్రవరి 9న మిల్వౌకీ బక్స్ తో, ఫిబ్రవరి 11న గోల్డెన్ స్టేట్ వారియర్స్ తో ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఏదో ఒకదాంట్లో జేమ్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సగటున లేకర్స్, థండర్ మ్యాచ్ టికెట్ ధర 1152 డాలర్లు (రూ.94 వేలు) గా ఉంది. ఇక లేకర్స్, బక్స్ మ్యాచ్ టికెట్ సగటు ధర 1302 డాలర్లు (రూ.లక్ష)గా ఉండటం విశేషం. ఎన్బీఏ (NBA)లో ఆల్ టైమ్ రికార్డు 38,387 పాయింట్లుగా ఉంది. ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఈ రికార్డు నాలుగు దశాబ్దాలుగా అలాగే ఉంది. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ 38,325 పాయింట్లతో అతనికి చాలా దగ్గరగా ఉన్నాడు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. ఈ మధ్యే ఇండియాన పేసర్స్ తోనూ అతడు 26 పాయింట్లు స్కోరు చేశాడు. -
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్
మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్సైట్ చూడాలని సూచించింది. -
APSRTC: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ
కడప (వైఎస్ఆర్ జిల్లా): ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు పాటుపడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. నలుగురు ప్రయాణికులు (పిల్లలతోసహా) ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే ఛార్జి మొత్తంలో 5 శాతం రాయితీ కల్పించింది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు ఈ–వ్యాలెట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే ఛార్జిలో ఐదుశాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులు రానుపోను టిక్కెట్‌ను ముందుగా రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జిలో పది శాతం తగ్గిస్తోంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు వర్తింపజేస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి కడప జోన్‌లోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి 400–450 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్‌పై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సదుపాయాలను వినియోగించుకోవాలని కడప జోన్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి కోరారు. (క్లిక్ చేయండి: సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి) -
కనీవినీ ఎరుగని రీతిలో 'అవతార్ 2' బిజినెస్
-
యాదాద్రి తలనీలాల టికెట్ ధర రూ.50
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాల టికెట్ ధరను రూ.50కి పెంచినట్టు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.20 ఉండగా రూ.50కి పెంచుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. పెంచిన ధర శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఈవో పేర్కొన్నారు. పెంచిన రూ.50 టికెట్ ధరలో 60 శాతం నాయీ బ్రాహ్మణులకు, 40 శాతం సొమ్ము దేవస్థానానికి చెందనుందని వివరించారు. -
మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. 75 రూపాయలకే సినిమా చూడొచ్చు
మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్ రేటు ఉంటుంది. సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఈ అవకాశం కల్పిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు అన్ని మల్టీప్లెక్స్‌లలో రూ.75కే అన్ని సినిమాలు చూడొచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటుకే టికెట్లు లభించనున్నాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రీనింగ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఉంది. ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీలో వీక్షించొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ ధర రూ. 330గా ఉంది. సో నేషనల్ మూవీ డే రోజున కేవలం 75 రూపాయలకే ఈ భారీ బడ్జెట్ మూవీని చూసే ఛాన్స్ కొట్టేయండి. -
గుడ్‌న్యూస్, ఇకమీదట అన్ని సినిమాలకు ఒకటే టికెట్ రేట్!
సినీప్రియులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని వెల్లడించాడు. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలకు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశాడు. బుధవారం నాడు జరిగిన థాంక్యూ చిత్ర ప్రెస్మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. స్టార్ హీరోల హై బడ్జెట్ చిత్రాలను మినహాయిస్తే అన్ని సినిమాలకు టికెట్ రేట్లు ఒకేలా ఉంటాయన్నాడు. మేజర్, విక్రమ్ సినిమాలకు ఉన్న రేట్లే అన్నింటికీ ఉంటాయని తెలిపాడు. హైదరాబాద్, వైజాగ్‌లాంటి పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీ కలిపి రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 ఉంటాయని పేర్కొన్నాడు. నిర్మాతలందరం కలిసి చర్చించాకే టికెట్ రేట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు 'లైగర్' ట్రైలర్ లాంచ్.. ఆకర్షిస్తోన్న రౌడీ హీరో భారీ కటౌట్ -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
‘సర్కారువారి పాట’ కు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
‘సర్కారువారి పాట’సినిమా యూనిట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) -
టికెట్ రేట్ల గురించి వేడుకుంటే తప్పేం కాదు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే! తాజాగా రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచడంపై చిరంజీవి స్పందించాడు. కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయని, ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్లు సినిమా రంగం కూడా నష్టపోయిందని వ్యాఖ్యానించాడు. తాము కూడా 42% టాక్స్‌లు కడుతున్నామని, కరోనా వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ కూడా పెరిగిందని పేర్కొన్నాడు. అలాంటప్పుడు టిక్కెట్ రేట్ల గురించి ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పులేదన్నాడు. కాగా ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు సైతం వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. చదవండి: దూరంగా ఉంటానన్న సింగర్, కానీ డబ్బుల కోసం మళ్లీ మొదలుపెట్టింది! -
షాకింగ్.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్
ప్రపంచవ్యప్తంగా ఎక్కువగా అభిమానించే క్రీడల్లో ఫుట్బాల్ది మొదటిస్థానం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉండే క్రేజ్ వేరు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగాసమరాన్ని కోట్ల మంది వీక్షిస్తుంటారు. అయితే అలాంటి ఫుట్‌బాల్‌ను మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక్క విషయంలో మాత్రం దాటేసి చరిత్రలో నిలిచింది. అదేంటో తెలుసా.. టికెట్ల విషయంలో. అవునండీ మన ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఫిఫా వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల టికెట్ల ధర కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖతార్ వేదికగా నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్‌కప్ సమరం జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 28 వరకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే టికెట్ రేట్ విషయం కాస్త షాక్ కలిగించింది. ఉదాహరణకు స్పెయిన్- జర్మనీ మ్యాచ్ తీసుకుంటే ఖతార్ కరెన్సీలో టికెట్ రేటు 250 ఖతార్ రియాల్‌గా ఉంది.(మన కరెన్సీలో దాదాపు రూ.5,211).. ఇది మన ఐపీఎల్ టికెట్ రేట్స్‌లో సగానికి సగం కావడం విశేషం. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర రూ. 45,828.. మన ఐపీఎల్ టికెట్‌తో పోలిస్తే రూ.10వేల వ్యత్యాసం మాత్రమే ఉంది. మరి మన ఐపీఎల్ ఫైనల్ టికెట్ రేట్ ఎంతో మీ ఊహకే వదిలేస్తున్నాం. వాస్తవానికి దీనికి ఒక కారణం ఉంది. నాలుగేళ్లకోసారి మాత్రమే ఫిఫా వరల్డ్‌కప్ జరుగుతుంది.. కానీ ఐపీఎల్ ప్రతీఏడాది కచ్చితంగా నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లక్రితం ఉన్న రేట్లకు డబుల్ రేట్లు ఫిక్స్ చేసి ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టికెట్ల రేట్లను నిర్ణయించారు. అందుకే మన ఐపీఎల్ టికెట్ రేట్లతో పోలిస్తే అవి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. భారత్‌లో ఎక్కువగా అభిమానించేది క్రికెట్.. కానీ ఈసారి ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల కోసం భారతీయులు కూడా ఎగబడ్డారు. అత్యధిక టికెట్స్ అప్లై చేసుకున్న టాప్-7 దేశాల జాబితాలో భారత్ కూడా ఉండడం విశేషం. చదవండి: CSK VS RCB: ఈ సీజన్ అత్యధిక వ్యూయర్షిప్ రికార్డైంది ఈ మ్యాచ్‌లోనే..! 𝗪𝗮𝘁𝗰𝗵 . 𝗦𝘁𝗿𝗲𝗮𝗺 . 𝗙𝗿𝗲𝗲 Introducing #FIFAPlus: your new home for football ✨ pic.twitter.com/xzhHLFD3cj — FIFA World Cup (@FIFAWorldCup) April 12, 2022 -
ఆర్ఆర్ఆర్ మేనియా.. ఒక్క టికెట్ రూ. 3వేలా?
'రౌద్రం రణం రుధిరం'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2018 నవంబర్ 11న ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగేళ్ల కష్టం అనంతరం ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా గురించే కాకుండా ఆర్ఆర్ఆర్ టికెట్ రేటు కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ చేశారని సినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మల్టీఫ్లెక్సుల్లోనూ టికెట్స్ బ్లాక్ చేయడంతో కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. గత వారం రోజులుగా ట్రై చేస్తున్నా టికెట్స్ అందుబాటులో లేవని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ను రూ. 3వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్‌కు ఎంతంటే..?!
-
4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: కేవలం 4 నెలలు.. ఏకంగా రూ.900 కోట్ల నష్టాలు.. ఆర్టీసీ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున టికెట్ ధరలను ప్రభుత్వం పెంచటంతో ఒక్క సారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. రోజు వారీ ఆదాయం రూ.14 కోట్లకు చేరుకోవటంతో తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకునే బాట పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కోవిడ్ దెబ్బ తీసింది. కోవిడ్‌తో దాదాపు ఏడాదిన్నరగా తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్న ఆర్టీసీని పట్టపగ్గా ల్లేకుండా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు మరింత దెబ్బకొట్టాయి. ఫలితంగా ఆర్టీసీ చరి త్రలో ఎన్నడూ లేనంతగా నష్టాలొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆర్టీసీకి రూ.900 కోట్లమేర నష్టాలు వచ్చినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున నెలకు రూ.225 కోట్ల చొప్పున నష్టం వస్తోంది. గతంలో 2015–16లో రూ.1,150 కోట్లు, 2019–20లో రూ.1,002 కోట్ల నష్టం వాటిల్లగా, ఈసారి వాటికి రెట్టింపు మొత్తంలో నష్టం వచ్చే దిశగా ఆర్టీసీ సాగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్టీసీని నిర్వహించడం కూడా కష్టం కానుంది. వీలైనంత తొందరలో టికెట్ ధరలను పెంచి కొంతలో కొంతైనా ఆదుకోవాలని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని కోరుతోంది. డీజిల్ భారం రోజుకు రూ.2 కోట్లు.. దాదాపు ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు డీజిల్‌పై రోజుకు రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. వరసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీని కోలుకోనీయకుండా చేస్తున్నాయి. మూడునాలుగు నెలల క్రితం కిలోమీటరుకు రూ.14 చొప్పున చమురు ఖర్చు ఉండేది. ఇప్పుడది దాదాపు రూ.18కి చేరింది. ఇప్పట్లో చమురు ధరలు తగ్గే అవకాశం కనిపించకపోవటంతో ఆర్టీసీ సతమతమవుతోంది. చమురు భారం నుంచి బయటపడే మార్గం లేకపోవటంతో ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తూ కొంత ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో బయో డీజిల్‌ను ఆర్టీసీ వినియోగంలోకి తెచ్చింది. 10 శాతం మేర బయో డీజిల్‌ను కలిపి వాడేది. ఇది సాధారణ డీజిల్‌తో పోలిస్తే లీటరుకు రూ.5 నుంచి రూ.6 వరకు తక్కువ. అంతమేర ఖర్చు ఆదాయ అయ్యేది. అయితే బయో డీజిల్ సరఫరా చేసే సంస్థ దాన్ని సరిగా అందించడం లేదన్న ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితమే ఆ ఒప్పందాన్ని ఆర్టీసీ రద్దు చేసుకుంది. ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం రూపంలో వచ్చే ఆదా కూడా లేకుండా పోయింది. బయోడీజిల్ స్థానంలో ఇథెనాల్‌ను కూడా వినియోగించే అవకాశం ఉంది. అయిదే దీని వినియోగంపై ఆర్టీసీ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. -
ప్రయాణికుల పై ఛార్జీల భారం మోపిన రైల్వే
-
ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరైనదే!
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులకు, చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుంది’’ అని ‘తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. టిక్కెట్ల ధర పెంచితే ప్రధానంగా హీరోలకే లాభం. టిక్కెట్ రేటు పెరిగేకొద్దీ హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. మరికొందరు లాభాల్లో వాటాలు అడుగుతారు. బెనిఫిట్ షోలు, సినిమా విడుదల రోజు ఎక్కువగా సినిమాకు క్యూ కట్టేది మధ్యతరగతి ప్రజలే. టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో చిన్న సినిమాలకే నష్టం. చిన్న సినిమాలకు ఫేస్ వ్యాల్యూ ఉండదు కనుక రూ.150, రూ. 200 టిక్కెట్ కొనుక్కుని చూసేందుకు ముందుకు రారు. పెద్ద సినిమా టిక్కెట్ ధర 100 రూపాయలున్నా నష్టమేమీ లేదు. పెద్ద హీరోల రెమ్యునరేషన్ తగ్గితే నిర్మాతలు బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోగలిగితే చిన్న, పెద్ద సినిమాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. -
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
-
‘స్పెషల్’ బాదుడు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక రైళ్లలో పండగ బాదుడు మొదలైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనపు బాదుడుకు దక్షిణమధ్య రైల్వే తెరలేపింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా రైల్వే సైతం పండగ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రంగంలోకి దిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పలు రైళ్లలో ఫిబ్రవరి చివరి నాటికి కూడా ‘నో రూమ్’ దర్శనమిస్తుండగా చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు 300 దాటిపోయింది. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు 150 వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. నగరం నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖపట్టణం, కాకినాడ, విజయవాడ, నర్సాపూర్, తిరుపతి, బెంగళూరు, టాటానగర్, నాగర్సోల్ తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. వీటిలో కొన్ని క్రిస్మస్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయగా మరికొన్ని రైళ్లు సంక్రాంతి రద్దీతో పాటు, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే భక్తుల కోసం కూడా ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లన్నింటిలోనూ రెగ్యులర్ చార్జీలపైన 30 శాతం అదనపు చార్జీలు విధించడం గమనార్హం. రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సాధారణ చార్జీలపైనే అదనపు రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, అందుకు భిన్నంగా చార్జీలను పెంచేశారు. దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా విధిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ మరో అడుగు ముందుకేసి రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణమధ్య రైల్వే సైతం అదనపు వసూళ్లకు దిగింది. సామాన్యుడిపై అధిక భారం .... సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణమే ఎంతో చౌక. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ చార్జీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేవలం రూ.220 ఉంటుంది. ఆర్టీసీ బస్సులో ఇది రూ.450 వరకు ఉంటే ప్రైవేట్ బస్సుల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. నలుగురు కుటుంబసభ్యులు ట్రైన్లో అయితే కేవలం రూ.880 చార్జీలతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్ చార్జీ రూ.385 వరకు ఉంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లేందుకు రూ.1540 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిందే. ఇక ఏసీల్లో ఈ చార్జీలు ఇంకా ఎక్కువే ఉంటాయి. తక్కువ చార్జీలతో దూర ప్రయాణం చేయవచ్చుననుకొనే ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు భారంగానే మారాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు థర్డ్ ఏసీ రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.1085 వరకు పెరిగింది. అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేక రైళ్లు జీవిత కాలం లేటు... ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలను అమాంతంగా పెంచేసినప్పటికీ రైళ్ల నిర్వహణ మాత్రం దారుణంగా ఉంటుంది. ప్రత్యేక రైళ్ల నిర్వహణపై అధికారులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 10 నుంచి 20 ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. ఇవి నిర్ణీత సమయం ప్రకారమే ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికీ గమ్యానికి చేరుకోవడంలో మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. రెగ్యులర్ రైళ్లకు ఉండే ప్రాధాన్యత ప్రత్యేక రైళ్లకు ఉండడం లేదు. దీంతో ఒక్కో రైలు5 గంటల నుంచి 8 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. ‘ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. రెగ్యులర్ రైళ్లు వెళితే తప్ప ప్రత్యేక రైళ్లకు అనుమతి లభించదు. దీంతో తరచుగా ఆగుతూ, సాగుతూ వెళ్తాయి.’ అని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ప్రత్యేక రైళ్లన్నింటి నెంబర్లు ‘సున్నా’తో మొదవులుతాయి. ఇలా ‘సున్నా’తో మొదలయ్యే రైళ్లనగానే ఒక నిర్లక్ష్యం ఉంటుంది. దీంతో బాగా ఆలస్యంగా నడుస్తాయని’అన్నారు. -
బొర్రా టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు
అనంతగిరి(అరకులోయ): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు ప్రవేశాల టికెట్ ధరల్లో పర్యాటక శాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం అమలవుతున్న ధరల కాస్త మార్చుతూ బుధవారం నుంచి నూతన ధరలను అందుబాటులోకి తేనుంది. ప్రసుత్తం పెద్దలకు రూ.60, చిన్న పిల్లలకు రూ.45, వీడియో కెమెరాకు రూ.100, సెల్‌ఫోన్‌కు రూ.25 టిక్కెట్ ధర ఉండేది. వీటిని మారుస్తూ పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 50 చేశారు. వీడియె కెమెరాకు గతంలో ఉన్న రూ.100 నే ఉంచగా, సెల్‌ఫోన్‌కు టికెట్ ధర రద్దుచేస్తూ పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు 23 నుంచి అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రతి బస్సులో చార్జీల పట్టిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి బస్సులో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్ తదితర బస్సులు ఈ నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీకి మించి ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయవద్దని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని నడిపిస్తున్న బస్సుల్లో అన్ని రకాల రాయితీ బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా ప్రయాణికుల కోసం తిప్పాలన్నారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయబోమని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్ బస్సులను స్థానిక పోలీస్ స్టేషన్లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్ చేయాలని సూచించారు. మద్యం మత్తులో విధులకు వచ్చే డ్రైవర్లను, కండక్టర్లను అనుమతించవద్దని పేర్కొన్నారు. రూ.6 కోట్ల మేర నష్టం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల జిల్లాలో ఆర్టీసీకి బుధవారం నాటికి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోల్చితే దసరా పండగ సీజన్లో ప్రయాణికులు అదనంగా 65 శాతం ప్రయాణిస్తారని పేర్కొంటున్నారు. -
రూ. 888కే విమాన ప్రయాణం..
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. దేశీయ రూట్లలో రూ.888కే టికెట్ సేల్ ప్రకటించింది. వర్షాకాల ఆఫర్లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 వరకు చేసే ప్రయాణాలపై ఈ ధర వర్తిస్తుంది. అయితే, ప్రయాణ టికెట్లను ఈనెల 6వ తేదీ లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆఫర్ అంతర్జాతీయ రూట్లలో అయితే.. ప్రారంభ టికెట్ ధర రూ.3,499 నుంచి ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఇక గతవారంలోనే అంతర్జాతీయ మార్గాల్లో కొత్త విమానాలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. -
గో ఎయిర్ చౌక ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ గో ఎయిర్ మినికేషన్ పేరుతో హైదరాబాద్ నుంచి పలు నగరాలకు టికెట్ ధరలను రూ.1,798 నుంచి ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,798, బెంగళూరు, లక్నో రూ.1,799, కోల్‌కతా రూ.1,983, కొచ్చి రూ.2,499, ఢిల్లీకి రూ.2,599 చార్జీ చేస్తారు. బుకింగ్ పీరియడ్ జూన్ 18 నుంచి 23 వరకు ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబరు 30లోగా కస్టమర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గో ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. Family time=Mini-cation time! 👨👩👧👦 Take off with our LOWEST fares starting ₹899* Use promo code GOAIR10 to get an additional 10%* off on https://t.co/0fTA5swRMW or mobile app. Book from 18th - 23rd June'19 & Travel from 1st July - 30th Sept'19 Book now: https://t.co/oBy0dKMKYw pic.twitter.com/PoChsP1o8m — GoAir (@goairlinesindia) June 18, 2019 -
జీఎస్టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా
సీజీఎస్టీ చాప్టర్ సెక్షన్ 15 ప్రకారం యాంటీ ప్రాఫిటింగ్ (వ్యతిరేక లాభాలు) ఇలా చేయడం నేరం.ఈ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాక్షి, సిటీబ్యూరో: వినోదం కోసం థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకులు నిలువునా మోసపోతున్నారు. టికెట్ల పైనా.. తినుబండారాల పైనా అధిక రేట్లు చెల్లిస్తూనే ఉన్నారు. వాస్తవంగా సినిమా టికెట్లపై ప్రభుత్వం జీఎస్టీ శాతాన్ని తగ్గించింది. కానీ తగ్గిన మేర టికెట్ రేట్ తగ్గడం లేదు. వినోదంపై జీఎస్టీ స్లాబ్ రేట్ 28 నుంచి 18 శాతానికి తగ్గింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు తెలివిగా జీఎస్టీ రేటును సవరిస్తున్నాయే కానీ.. ధర మాత్రం అదే వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఐమాక్స్ థియేటర్లో రూ.236 ఉన్న టికెట్ ధర జీఎస్టీ తగ్గక ముందు.. తగ్గిన తర్వాత కూడా అదే ధర ఉంది. జీఎస్టీ స్థానంలో తగ్గించిన మొత్తాన్ని టికెట్ మొత్తం ధరలో కలిపేశారు. దీంతో ప్రేక్షకుడి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. థియేటర్లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, తగ్గించిన ధరలను అమలు చేయడం లేదని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు జారీ చేస్తున్న టికెట్లో కేవలం తగ్గిన జీఎస్టీని ముద్రించి ఇస్తున్ననారే కానీ ధర యథాతథంగానే వసూలు చేస్తున్నారు. జనవరి19 నుంచే తగ్గిన జీఎస్టీ జీఎస్టీ కౌన్సిల్ ఈ ఏడాది జనవరి 19వ తేదీ నుంచి వినోదం పన్నును తగ్గించింది. దీంతో సినిమా టికెట్లపై ఉన్న జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఈ ప్రయోజనం ప్రేక్షకులకు అందకపోవడంపై కొందరు వినియోగదారులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరంలోని ఓ ఐమాక్స్ థియేటర్‌పై దాడిచేసి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తగ్గిన జీఎస్టీ ప్రయోజనాలు ప్రేక్షకులకు అందడం లేదని, అదేవిధంగా ఆహార ఉత్పత్తులపై కూడా ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని ఈ తనిఖీల్లో తేలింది. ప్రతి థియేటర్లో టికెట్ ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. మల్టీప్లెక్స్ వచ్చాక ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆ థియేటర్లలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదట టికెట్ ధర రూ.100 దాటితే దానిపై జీఎస్టీ 28 శాతం వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో జీఎస్టీ కౌన్సిల్ దాన్ని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్క ప్రకారం రూ.150 ఉన్న టికెట్ ధర రూ.138 వరకు తగ్గింది. అయినా కొన్ని థియేటర్లు పాత ధరలే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వినోద రంగంపై జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గే అవకాశం ఉందని, దీంతో టికెట్ ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. కాగా, వినోద పన్ను తగ్గినా ధరలు మాత్రం తగ్గలేదనే విషయం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇండిగో ‘వేసవి ఆఫర్’..999కే టికెట్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.999కే టికె ట్ అందిస్తోంది. జూన్ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుండగా.. జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ‘గతనెల్లో ఇచ్చిన ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి అద్భుత సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 4–రోజుల ప్రత్యేక వేసవి ఆఫర్‌ను ప్రకటించాం’ అని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. -
టికెట్ల మోత మోగుతోంది
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెంచిన సినిమా చార్జీలు ఈ వారం కూడా కొనసాగుతున్నాయి. గత వారం విడుదలైన ఓ సినిమాకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు తొలి వారం చార్జీలు పెంచుకున్న థియేటర్లు, మల్టీపెక్స్‌లు రెండవ వారంలోనూ చార్జీల మోతను కొనసాగిస్తున్నాయి. వారం రోజుల తర్వాత పాత చార్జీలనే కొనసాగించాల్సిన మాల్స్, థియేటర్ యజమానులపై ఎవరి నియంత్రణ లేకపోవటంతో గురువారం కొన్ని పలు ప్రాంతాల్లో కొత్త చార్జీలు వసూలు చేశారు. ఇదే విషయమై తార్నాకలోని ఓ సినిమా థియేటర్‌పై ప్రేక్షకులు ఫిర్యాదు చేసి, ఆధారాలు సైతం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అందించారు.పోలీసులు విచారించిన తర్వాత గురువారం సాయంత్రం నుంచి చార్జీలను తగ్గించారు. ఉప్పల్‌లోని ఓ మాల్లో సైతం గత వారం పెంచిన చార్జీలతను షో నడిపించారు. ఎల్బీనగర్ సింగిల్ థియేటరల్లోనూ పెంచిన చార్జీలతోనే రెండవ వారం కూడా టికెట్లు జారీ చేశారు. అయితే పెంచిన చార్జీలపై నిఘా ఉంచి తక్షణం స్పందించాల్సిన యంత్రాంగం చూసీ చూడని వైఖరితోనే రెండవ వారం కూడా చార్జీలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి తొలివారం ధరలు పెంచుకునే వెలుసులుబాటు ఇచ్చిన ఉత్తర్వులను అంగీకరించటం లేదని ప్రకటించిన ప్రభుత్వం సకాలంలో మళ్లీ కోర్టులో ఆప్పీల్ చేయకపోవటం, రెండవ వారం కూడా నగరంలో పలు చోట్ల పెంచిన చార్జీలే అమలవుతుండటం దారుణమని సామాజిక ఉద్యమకారుడు బొగ్గుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా యాక్టు ప్రకారంగా కేసు నమోదు –ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి... తార్నాకలోని ఆరాధన థియేటర్లో నడుస్తున్న మహర్షి సినిమా టికెట్లను హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. దీనిపై థియేటర్ మేనేజర్ మణిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టామనిచెప్పారు. ఈ విచారణలో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ అధిక ధరలకే టికెట్లు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. సెక్షన్ 9ఏ–(2) ఆఫ్ ఏపీ సినిమా రెగులేషన్ యాక్టు 1970 ప్రకారంగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. -
పక్షి.. విమానం.. కాదు రైలే!
వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆ రైలు వీడియోను పోస్టు చేస్తూ రైల్వే శాఖ ఓ సంబరానికి సిద్ధమవుతోందంటూ ట్వీట్ చేశారు. ‘‘ఇదొక పక్షి. ఇదొక విమానం. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు.. ఇదిగో చూడండి.. వందే భారత్ మెరుపు వేగంతో ఎలా దూసుకుపోతుందో’’అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కానీ ఆయనకి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రతిపక్షాలు, కొందరు నెటిజన్లు దానిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అదో మార్ఫింగ్ వీడియో అని, సహజంగా ఆ రైలు నడిచే స్పీడు కంటే ఎక్కువ వేగంతో వెళుతున్నట్టుగా చూపించడానికి టెక్నాలజీని వాడుకున్నారంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్ వీడియో ఫ్రేమ్స్‌లో స్పీడు పెంచి రైలు మెరుపు వేగంతో వెళుతోందని వర్ణిస్తే సరిపోతుందా అంటూ ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి గిమ్మిక్కులైనా చేయగలదని పీయూష్ మరోసారి నిరూపించారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రచార ఇన్చార్జి శ్రీవాత్సవ కామెంట్ చేశారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు చీట్ ఇండియా ఎగ్జిబిట్ 420 అంటూ ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఖాతాలో ఆ రైలు ట్రయల్ రన్ సమయంలో తీసిన అసలు వీడియోను, పీయూష్ గోయల్ పోస్టు చేసిన వీడియోను పక్కపక్క బాక్స్‌ల్లో పెట్టి రైలు వేగంలో ఎంత తేడా ఉందో చూడండి అని పోస్టు పెట్టింది. రైలు వేగం కంటే సర్కారీ అబద్ధాల స్పీడు ఎక్కువని ఎద్దేవా చేసింది. ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో రైలుని చూపించారని కొందరు, మేకిన్ ఇండియా కాదు.. ఫూల్ ఇన్ ఇండియా అని ఇంకొందరు, పక్షీ కాదూ, విమానమూ కాదు అదో నత్తనడక అంటూ మరికొందరు విమర్శలు చేశారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పీయూష్‌కి అండగా నిలిచారు. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన పీయూష్ అలాంటి పనులు చేయరంటూ రివర్స్ అయ్యారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాకే దానిలో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుందని కామెంట్లు చేశారు. వందే భారత్‌కు ప్రత్యేకతలెన్నో.. మనదేశానికే గర్వకారణంగా భావిస్తున్న హైస్పీడ్ వందే భారత్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రైలుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశంలో అత్యంత వేగంతో నడిచే శతాబ్ది రైళ్ల స్థానంలో వీటిని నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ రైలుని తయారు చేశారు. ఒకప్పుడు దీనిని ట్రైన్ 18 అని పిలిచేవారు. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు మార్చారు. ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకి ఢిల్లీలో బయల్దేరి మధ్యాహ్నం 2 కల్లా వారణాసి చేరుకుంటుంది. తిరిగి వారణాసిలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11కి ఢిల్లీ చేరుకుంటుంది. దేశంలోని మొట్టమొదటి ఇంజిన్ లేని రైలు ఇదే. గంటకి 180 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు అత్యధికంగా 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఢిల్లీ, వారణాసి మధ్య ఉన్న దూరం 770 కి.మీ దూరాన్ని కేవలం 8 గంటల్లోనే చేరుకోగలదు. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో 18 నెలల కాలంలోనే ఈ రైలుని తయారు చేశారు. ఈ రైలు తయారీకి రూ. 97 కోట్లు ఖర్చు చేశారు. శతాబ్ది కంటే ఒకటిన్నర రెట్లు ధరలు ఎక్కువ.. శతాబ్ది రైళ్లలో కంటే ఈ రైలులో టికెట్ ధరలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 3,520 కాగా, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 1,850. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కోసం రూ. 399 వసూలు చేస్తారు. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో అదే మెనూకి రూ. 344 వసూలు చేస్తారు. ఇదంతా రైలు టికెట్లో భాగంగానే ఉంటుంది. రైలు కోచ్‌లు ఎలా ఉంటాయంటే.. ఇది ఏసీ రైలు. మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లే సదుపాయం ఉంది.... తలుపులన్నీ ఆటోమేటిక్‌గా తెరుచుకొని మూసుకుంటాయి. యూరోపియన్ స్టైల్లో ఎటు కావాలంటే అటువైపు తిరిగే సీట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రయాణికుల కోసం వైఫై సౌకర్యం, ప్రతీ కోచ్‌లోనూ సీసీ టీవీల ఏర్పాటు కోచ్‌ల్లో జీపీఎస్ ద్వారా ప్రయాణికుల వివరాలున్న వ్యవస్థ బయో వ్యాక్యూమ్ వ్యవస్థ కలిగిన అత్యా ధునిక టాయిలెట్ సౌకర్యం. వికలాంగులు కూడా హాయిగా వాడుకునేలా టాయిలెట్లు రైలు మొత్తం ఎల్ఈడీ లైటింగ్లు బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైలు లోపల ఆటోమేటిక్‌గా వాతావరణాన్ని నియంత్రించే వ్యవస్థ దుమ్ము, ధూళి మచ్చుకి కూడా కనిపించకుండా రైలు లోపలంతా ఆరోగ్యకరమైన వాతావరణం. మొత్తమ్మీద అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే ఈ రైలు బోగీలను ఎగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలివే..
సాక్షి, న్యూఢిల్లీ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా ఢిల్లీ-వారణాసిల మధ్య పరుగులు పెట్టే ట్రైన్ 18 టికెట్ ధరలను ఖరారు చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ 1850కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జ్ రూ 3,520గా నిర్ధారించారు. ఇవి క్యాటరింగ్ సేవలతో కూడిన టికెట్ ధరలని అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో చైర్ కార్ ధర రూ 1795 కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ 3470గా ఖరారు చేశారు. కాగా, ఇదే దూరంలో తిరిగే శతాబ్ధి రైళ్లతో పోలిస్తే చైర్ కార్ ధరలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలు 1.4 రెట్లు అధికమని అధికారులు వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్‌ను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ నుంచి వారణాసికి ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని రూ 399కే అందించనుండగా, చైర్ కార్లో ప్రయాణీకులు ఈ సేవలకు రూ 344 చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. ఈ రైలుకు కాన్పూర్, ప్రయాగరాజ్ స్టేషన్లలో స్టాపులుంటాయి. -
ట్రావెల్ దందా!
రెక్కలు ముక్కలు చేసుకుని... సొంత ఊరికి, కన్నవారికి సుదూరంగా... రోజువారీ కూలి పనులు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలెన్నో జిల్లాలో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఏడాదికోసారి వచ్చే ముఖ్యమైన సంక్రాంతి పండగకోసం సొంత గ్రామాలకు తరలివస్తుంటారు. కానీ వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టానుసారం బస్‌చార్జీలు పెంచేసి... వారి రెక్కల కష్టాన్ని నిలువుగా దోచేస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం దాచుకున్న సొమ్ము మొత్తం బస్సు చార్జీలకోసమే వెచ్చించి..కన్నవారికి ఏమీ ఇవ్వలేకపోతున్నారు. వారి కష్టాన్ని మొత్తం బస్సులకు ధార పోస్తున్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీకి చెందిన కె.రామారావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన పండగ దగ్గర పడటంతో సొంత ఊరికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి విజయనగరం చేరుకునేందుకు అయిన చెల్లించిన మొత్తం చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మక మానదు. స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కిన భార్య భర్తలిద్దరి నుంచి రూ. 5550ల వరకు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో రూ. 1800లు ఉండే ధరను ఒక్క సారిగా రెట్టింపు చేయటం గమనార్హం. విజయనగరం మున్సిపాలిటీ:సంక్రాంతి వచ్చిందంటే సగటు మానవుడి ప్రయాణం గగనమైపోతోంది. సొంత ఊళ్లకు వెళ్లేవారు కొందరైతే, అత్తవారిళ్లకు, అమ్మల వద్దకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే రైళ్ల రిజర్వేషన్లు దొరకని వారు, జనరల్ బోగీల్లో కిక్కిరిసి కూర్చునే ప్రయాణికులను చూసి ఇదేమి ప్రయాణంరా బాబూ అంటూ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న సంబంధిత యజమానులు ఆమాంతం టికెట్ ధరను పెంచేసి ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీ కన్నా రెట్టింపు మొత్తాన్ని గుంజుతున్నారు. రాష్ట్రంలోనేకాకుండా పక్క రాష్ట్రానికి చెందినవారు ఎంతోమంది జిల్లాలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారు ఉన్నారు. వీరంతా సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వారంతా ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ఈ వారం రోజుల్లో రోజుకు 15 నుంచి 25 వరకు రద్దీని బట్టి ప్రైవేటు సర్వీసులు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల వివరాలు ఇలా.... పండగ నేపథ్యంలో ముందుగా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారిని టార్గెట్ చేసిన ప్రైవేటు సర్వీసు యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి వచ్చే వారి వద్ద నుంచి ఏసీ స్లీపర్ సర్వీసుకైతే ఒక్కో టిక్కెటు ధర రూ. 2500ల నుంచి రూ. 2700లవరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ సిట్టింగ్ సర్వీసుకైతే రూ. 2వేలు గుంజుతున్నారు. అదే నాన్ ఏసీ సర్వీసులకైతే రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే సాధారణ రోజుల్లో అయితే ఏసీ సిట్టింగ్ సర్వీసు ధర రూ 800 నుంచి రూ1000 మాత్రమే ఉండేది. అదే నాన్ఏసీ సర్వీసులకైతే రూ600 నుంచి రూ700 ఛార్జీ ఉండేది. విజయవాడ నుంచి విజయనగరం చేరుకోవాలంటే గతంలో ఉన్న ఏసీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ ధరను రూ. 700ల నుంచి రూ. 1800ల వరకు పెంచేశారు. అదే నాన్ఏసీ టిక్కెటు ధర ఐతే రూ. 400ల నుంచి రూ. 800ల వరకు ధర పలుకుతోంది. ఈ రెండు రోజుల్లో ఇటు నుంచి ప్రయాణానికి మాత్రం సాధారణ ధరలే అమలవుతుండగా.. పండగ అనంతరం రోజుల్లో రెట్టింపు చార్జీలు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి ఆయా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఆన్లైన్లో ధరల పట్టికను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచాయి. ఆర్టీసీలోనూ అదే బాదుడు సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకొని ఆర్టీసీ అడ్డగోలుగా ఛార్జీలు పెంచింది. దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల ద్వారా భారీగా వసూలు చేస్తోంది. దూరప్రాంతాలకు వేసిన సర్వీసుల్లో చార్జీని 50 శాతం పెంచారు. రెండురోజులుగా ఈ సర్వీసుల ద్వారా లక్షల రూపాయలు ఆదాయాన్ని పొందారు. విజయనగరం జిల్లా నుంచి ఒకేఒక బస్సు రెగ్యులర్‌గా ఉంది. కానీ సంక్రాంతి సీజన్‌గా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, విజయనగరం డిపోల నుంచి హైదరాబాద్‌కు 15, విజయవాడ 6 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నిర్వహిస్తున్నారు. వీటిలో సాధారణ సర్సీసుల కంటే 50 శాతం చార్జీలు పెంచారు. చేతి చమురు తప్పలేదు ఏడాదికోసారి వచ్చే పండగ. స్వగ్రామాలకు వెళ్లడం తప్పనిసరి. అందువల్ల వారెంత అడిగితే అంత సమర్పిం చుకుని ఈసురోమని స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే ఈ దందా పై కనీసం ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఈ అందాలు డబ్బున్న వారికే..
పై ఫొటోల్లో అందాలను చూశారా...కాకినాడ బీచ్‌లో కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ప్రభుత్వం నిర్మిస్తుంటే పరిసర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. అన్నీ పూర్తయిన తరువాత వెళ్లిన జనానికి నిరాశే మిగిలింది. లోపలికి వెళ్లడానికి టిక్కెట్...తీరా వెళ్లాక ప్రతి మలుపులోనూ టిక్కెట్ల మోతే. తెగించి వెళ్తే ఓ కుటుంబానికి కనీసం రూ.200 పైనే జేబుకు చిల్లుపడుతుంది. దీంతో వెళ్లినవారు తిరుగుముఖం పట్టక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కాకినాడ బీచ్ అందాలు ఉచితంగా చూసే యోగ్యత లేదు. డబ్బులిచ్చి బీచ్‌లో అడుగు పెట్టాలి. లేదంటే సముద్ర తీరానికి వెళ్లి సేద తీరి వచ్చేయాల్సిందే. ఎందుకంటే బీచ్ అందాలు ఆస్వాదించాలంటే జేబుకు చిల్లుపెట్టుకోవల్సిందే. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ధర నిర్ణయించారు. సాధారణంగా ఎక్కడైనా యూజర్ చార్జీల కింద ఐదో పరి రూపాయలు టిక్కెట్ పెడతారు. ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో రేటు పెట్టి వినియోగదారుడి మొహంలో నిరాశను మిగుల్చుతున్నారు. బీచ్‌లో అడుగు పెడితే ప్రతి ఒక్కరూ రూ.90 ముట్ట జెప్పాల్సిందే. ఈసారి బీచ్ ఫెస్టివల్‌కు గుడ్‌బై చెప్పి ఆ స్థానంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు రత్నసిరి ఫుడ్ కోర్టు రిసార్ట్‌కు అనుమతిచ్చారు. ఒకరోజుపాటు ఉత్సవాలు జరిపేందుకు సదరు యాజమాన్యం భారీగా వసూలు చేయడానికి సమాయత్తమవుతోంది. రూ.500 నుంచి రూ.1000 వరకు రేటు పెట్టింది. ఆ ధర భరించేవారికే సంక్రాంతి సంబరాల ప్రవేశం ఉంటుంది. కుటుంబ సభ్యులూ...పారా హుషార్...! పిల్లలతో కలిసి బీచ్‌లో అడుగు పెడదామనుకుంటున్నారా? అయితే ఒక్కొక్కరు రూ.70 సిద్ధం చేసుకోవాలి. నలుగురున్న ఫ్యామిలీ వెళితే రూ.280 చెల్లిస్తే గానీ బీచ్‌ను ఆస్వాదించలేదు. ఇక, చిన్న పిల్లలే తోడైతే ఒక్కొక్కరికీ రూ. 30 అదనం కానుంది. దానికి తోడు నాలుగు చక్రాల వాహనంపై వెళితే అదనంగా రూ.20 చెల్లించాలి...అంటే ప్రవేశానికి ఒక ఫ్యామిలీ దాదాపు రూ.300 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బీచ్ ప్రవేశం ద్వారం దాటాలంటే అడుగు పెట్టాలంటే పెద్దలకు రూ.30, చిన్న పిల్లలకైతే రూ.10, గ్యాస్ బ్రిడ్జిని సందర్శించాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10, లేజర్ షో వద్దకు వెళ్లాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10 చెల్లించాలి. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నాలుగు చక్రాల వాహనానికైతే రూ. 20, ద్విచక్ర వాహనానికైతే రూ.10 చెల్లించాలి. బీచ్‌లో ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. దీంతో సెలవు రోజున సరదాగా వెళ్దామంటే ఒక కుటుంబానికి రూ.300పైబడి కేవలం టిక్కెట్ల కోసం వెచ్చించాలి. ఇక ఇతర తినుబండారాలకైతే చెప్పనక్కర్లేదు. బీచ్ ఫెస్టివల్ కొండెక్కినట్టే... డిసెంబరు లేదా జనవరిలో ప్రతి ఏడాదీ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగా బీచ్‌లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు బీచ్ ఫెస్టివల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి నెలకుంది. కానీ, అనూహ్యంగా సంక్రాంతికి ముందు, ఈ నెల 12వ తేదీన బీచ్‌లో సంక్రాంతి సంబరాలు పేరుతో ఉత్సవాలు జరిపేందుకు రత్నసిరి ఫుడ్‌కోర్టు రిసార్ట్‌కు అనుమతి ఇచ్చారు. అవకాశం రావడమే తరువాయి సదరు యాజమాన్యం భారీ రేట్లు పెట్టింది. ఒక్కొక్కరికీ రూ.1000, 600, 500 మేర టిక్కెట్ రేట్లు పెట్టారు. ముందుగా బుక్ చేసుకోవాలని విస్తృత ప్రచారం కూడా చేసేస్తున్నారు. -
అక్రమాల రూటు వదలని ప్రైవేటు ట్రావెల్స్
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. అడ్డుకోండి.. చూద్దాం అనే రీతిలో ట్రావెల్స్ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారాంతాల్లోనూ, పండుగల సీజన్లలో టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేసి ప్రయాణికుల నుంచి భారీగా దోచుకుంటున్నారు. పండుగలప్పుడు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. అదనపు బెర్తులు, సీట్లు ఏర్పాటు చేసి మరీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సుల్ని తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ఆర్టీసీకి ఏటా రూ.2400 కోట్లు నష్టం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రవాణా అధికారులు షరా‘మామూలు’గానే మిన్నకుండిపోతున్నారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అదనపు సీట్లు/బెర్తుల ఏర్పాటుతో బస్సుల పొడవు పెంచి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో రూల్ 351ఎ ప్రకారం.. స్లీపర్ బస్సుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. బస్సులో 36 సీట్లు, 32 బెర్తులు ఉండాలి. కానీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు, బెర్తులతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగాయి. దీంతో ఆ రాష్ట్రాలు 2017 జూన్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశాయి. ఆ తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఆ బస్సుల్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఏపీలో మళ్లీ బస్సుల్ని రవాణా శాఖ అనుమతించింది. సీట్లు, బెర్తులు తగ్గించి మోటారు వాహనాల చట్టంలో ఏఐఎస్–119 నిబంధనను అనుసరించి తిప్పాలని ట్రావెల్స్ నిర్వాహకులకు అధికారులు సూచించారు. అప్పట్లో అధికారుల ఆదేశాల మేరకు సీట్లు, బెర్తులు తగ్గించిన ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పుడు సంక్రాంతి సీజన్ డిమాండ్ దృష్ట్యా అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప తర్వాత షరా‘మామూలు’గానే వదిలేస్తున్నారు. అదనపు బెర్తులతో దందా.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల బస్సులను తిరగనిచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే రవాణా శాఖ ఎన్వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) కలిగి ఉండటంతోపాటు ఏఐఎస్ –119 ప్రకారం.. బెర్తుల సంఖ్య తగ్గించాలని స్పష్టం చేసింది. ఆలిండియా పర్మిట్లు పొంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బస్సుల్లో స్లీపర్ బెర్తులు 36 వరకు ఉన్నాయి. ఇలా ఉండటం మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధం. ఈ బస్సులు ఏపీలో తిరగాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారం.. బెర్తులను 30కి తగ్గించి తిప్పాల్సిందే. తనిఖీలకు మంగళం! కేంద్ర మోటారు వాహనాల చట్టం 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రవాణా సంస్థలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు ట్రావెల్స్ మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో ఏఐఎస్–119 నిబంధనలున్న బెర్తుల బస్సులు కేవలం రెండు మాత్రమే ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు బెర్తులను 36 నుంచి 30కి తగ్గిస్తేనే వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లతో రవాణా శాఖ తనిఖీలకు మంగళం పాడింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యథేచ్ఛగా ఆన్లైన్లో రిజర్వేషన్లు చేస్తూ ఆక్యుపెన్సీ పెంచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బెర్తుల బస్సులు రాష్ట్రంలో 655 ఉన్నాయి. రవాణా అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ బస్సులు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా అనే అంశంలో లేకపోవడం గమనార్హం. హైదరాబాద్ రూటే టార్గెట్ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రధానంగా హైదరాబాద్ రూట్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఈ రూట్లోనే అధికంగా బస్సులు నడిపి.. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది.. స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ రోజూ 70 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తున్నారు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ సర్వీసుకు రూ.550గా ఉన్న టిక్కెట్టు ధరను పండుగలు, రద్దీ సమయాల్లో రూ.990కు పెంచి వసూలు చేస్తున్నారు. స్లీపర్ సర్వీసుల్లో సాధారణ రోజుల్లో రూ.850–రూ.1000గా ఉన్న టిక్కెట్టు ధరను ఈ సీజన్లో రూ.1,200 – రూ.1,850కు పెంచి వసూలు చేయడం గమనార్హం. హైదరాబాద్ – విశాఖపట్నం రూట్లోనూ సాధారణ రోజుల్లో స్లీపర్ సర్వీసుల్లో రూ.1,500– రూ.1,700 ఉండే టిక్కెట్ ధరను పండుగల సీజన్లో ఏకంగా రూ.2,500 – రూ.2,700కు వరకు పెంచి వసూలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ల గుర్తింపునకు, వారి సంక్షేమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే డ్రైవర్ల రిజిస్ట్రేషన్ విషయంలో కార్మిక శాఖ, రవాణా శాఖలు తమ బాధ్యత కాదంటే తమది కాదని కొన్నాళ్లపాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ విషయం మీద హైకోర్టు సీరియస్‌గా స్పందించడంతో రవాణా శాఖ డ్రైవర్ల సంక్షేమ చట్టం అమలు బాధ్యత తీసుకుంది. సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల మాటున యథేచ్ఛగా సరుకు తరలిస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల నుంచి జోరుగా జీరో వ్యాపారం నిర్వహించేవారికి ఊతమిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.2,400 కోట్లు నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఆర్టీసీ ఆక్యుపెన్సీని దెబ్బకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ కార్గో వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రైవేటు బస్సుల్లో వెండి, ఫర్నీచర్ సామగ్రి పెద్ద ఎత్తున మళ్లిపోతోంది. బిల్లులు లేకుండా సామగ్రిని తరలిస్తున్నా రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్నిప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా పెడచెవిన పెట్టి ఆయా నగరాల్లో సరుకులను తరలించేందుకు ఏకంగా బుకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలు పెంపు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలను పెంచి ప్రయాణికుల అవసరాలను భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీ చేస్తే అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులు పడతారని రవాణా అధికారులు చెబుతున్నారంటే.. వీరి దోపిడీకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. టిక్కెట్ల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని రవాణా అధికారులు చేతులెత్తేయడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తమకు అడ్డే లేదన్న రీతిలో ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు. ఏటా ఈ దందా సాగుతూనే ఉందే తప్ప ట్రావెల్స్ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సాధారణంగా పండుగ సీజన్ల ముందు ఆయా జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు ముందుగా ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని వారి వారి ప్రాంతాలకు చేరవేయడంలో సహకరించాలని, టిక్కెట్ల ధరలు పెంచి ప్రయాణికుల్ని దోచుకోవద్దని హెచ్చరికలు చేయాలి. అంతేకాకుండా టిక్కెట్ల ధరల నియంత్రణపై ట్రావెల్స్ నిర్వాహకుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి ఏ జిల్లాలోనూ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు: 750 వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు: 600 రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య: 491 ఈ బస్సుల్లో రోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య: 70 వేలు రాష్ట్ర పరిధిలో స్లీపర్ బస్సుల సంఖ్య: 50 ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఆగడాలకు అద్దంపట్టే కొన్ని సంఘటనలు తిరుపతికి చెందిన ఎస్.లక్ష్మీపవన్ సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. బస్సు టికెట్ బుక్ చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా సెమీ స్లీపర్ ఏసీ బస్సుకు రూ.1900 చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. అంతకుముందు పలుమార్లు రూ.1000తోనే హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన ఆయనకు ఈసారి ట్రావెల్స్ నిర్వాహకులు రూ.900 ఎక్కువ చెప్పడంతో చేసేదేమీ లేక వారు అడిగినంతా చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి.ప్రమోద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఊరికి రావడానికి టికెట్ కోసం ప్రయత్నించగా ఆర్టీసీ, రైల్వే టికెట్లు అప్పటికే అయిపోయాయి. దీంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ సూపర్ లగర్జీ బస్సుకు రూ.1000 ఇమ్మనడంతో కంగుతిన్నాడు. విడిరోజుల్లో హైదరాబాద్ నుంచి తెనాలికి రూ.450 తీసుకునేవారని, ఇప్పుడు రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రమోద్ వాపోతున్నాడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బి.సురేశ్ హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. సంక్రాంతి పండుగకు తన ఊరికి రావడం కోసం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ లగ్జరీ బస్సుకు రూ.1700 చెల్లించాలని చెప్పడంతో విస్తుపోయాడు. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఛార్జీ అని చెప్పగా ‘ఇష్టముంటే ఎక్కు.. లేదంటే మానుకో’ అని ట్రావెల్స్ నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. -
పల్లె వెలుగులే నాన్‌స్టాప్‌లు
రాజమహేంద్రవరం సిటీ: పల్లె వెలుగు బస్సు ఏర్పాటు చేసి ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీ వసూలు చేస్తూ ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం డిపో నుంచి కాకినాడకు నిత్యం తెల్లవారు జాము నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు చొప్పున నాన్ స్టాప్ సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను నడపాల్సింది, రోజూకు రెండు నగరాల మధ్య 60 సర్వీసులను నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ రూ.65, ఆల్ట్రా డీలక్స్ రూ.80 సూపర్ డీలక్స్ రూ.85లు టిక్కెట్‌గా వసూలు చేస్తోంది. రాజమహేంద్రవరం– కాకినాడల మధ్య ఎక్స్‌ప్రెస్ బస్సు గంటన్నర సేపు ప్రయాణి స్తుంది. రూ.65లు వసూలు చేస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో ‘పల్లె వెలుగు’లను నడుపుతూ ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. రోజూ తిరిగే 60 సర్వీస్సుల్లో 40 సర్వీసులు పల్లె వెలుగు బస్సులను నడుపుతూ ఆర్టీసీ మోసాలకు పాల్పడుతోంది.ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో గంటన్నర సేపు జరగాల్సిన ప్రయాణం పల్లెవెలుగు బస్సుల్లో రెండున్నర గంటల సేపు ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయమై స్టేషన్ మేనేజర్ కొండలరావును వివరణ కోరగా బస్సులు కొరతవల్ల ‘పల్లె వెలుగు’లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రైవేట్ బస్సుల దోపిడీ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విజయవాడకు టిక్కెట్టు రూ.2,500లు. ఆశ్చర్యపోకండి... ఇది విమాన చార్జీ కాదు.. బస్సు టిక్కెట్టే. ఇంకా సంక్రాంతి సందడి మొదలు కాకముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో టిక్కెట్టు చార్జీలు అధికంగా పెంచేవారు. ఇప్పుడలా కాదు.. పండగ, పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వీటి రేట్లు పెంచేస్తున్నారు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. సెలవులకు విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించాలంటే అప్పటికప్పుడు బెర్తులు దొరికే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వీరి దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. డిమాండ్‌ను బట్టి దోపిడీ ప్రస్తుతం విశాఖ – విజయవాడ (349 కి.మీల దూరం) ప్రైవేటు ఏసీ బస్సు టిక్కెట్ ధర రూ.2,500కు పైగానే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సీజను ప్రారంభం కావడానికి కనీసం రెండు వారాల సమయం ఉంది. పండగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటికే చుక్కలనంటే చార్జీలను ఫిక్స్ చేసేశారు. కానీ ప్రస్తుతం అంతగా డిమాండ్ లేని ఈ రోజుల్లోనూ అదే బాదుడు కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాలుగో శనివారం, ఆదివారం సెలవులు రావడం, మధ్యలో సోమవారం పనిదినం ఉన్నా మంగళవారం క్రిస్మస్ కావడంతో వరుస సెలవులు వచ్చినట్టయింది. దీన్ని ఆసరాగా చేసుకుని అసలు చార్జీకి రెట్టింపుకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు మంగళవారం ప్రైవేటు ట్రావెల్స్ విశాఖ – విజయవాడల మధ్య చార్జీలను పరిశీలిస్తే... కృష్ణా ట్రావెల్స్ సెమీ స్లీపర్ రూ.1,330, ఏసీ స్లీపర్ రూ.1,790, ఆరంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్లీపర్ రూ.2,400, ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నాన్ ఏసీ సెమీ స్లీపర్ రూ.890 చొప్పున నిర్ణయించారు. అంతేకాదు.. బస్సులు బయలుదేరే సమయానికి వీటి ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఒకవేళ ముగ్గురు ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకుని ఆఖరి క్షణంలో ఒకరి టిక్కెట్టు రద్దు చేయమని కోరితే మిగిలిన ఇద్దరివీ కేన్సిల్ చేస్తున్నారు. ఇలా రద్దయిన టిక్కెట్లను డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్టు కావాలంటే అప్పటికి పెంచిన చార్జిని ఇవ్వాలని లేదంటే టిక్కెట్టు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో ఉన్న వారు మరో గత్యంతరం లేక ఆఖరి నిమిషంలో అధిక చార్జీలు చెల్లించి గమ్యానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రైవేటు ఆపరేటర్ల మోసాలపై రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఆర్టీసీది మరో తీరు ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ వేగం ఒకింత తక్కువ. దానికితోడు అంతగా కండిషన్ లేని బస్సులు, నిర్లక్ష్యంగా నడిపే కొంతమంది డ్రైవర్ల వల్ల ఆర్టీసీ బస్సులు సకాలంలో గమ్యాన్ని చేరడం లేదు. ఇది దూరప్రాంత సర్వీసుల్లో ప్రయాణించి విధులకు హాజరయ్యే వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో అయిష్టంగానైనా ప్రైవేటు సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 23న విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ సర్వీసులో తండ్రీ కొడుకులు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో ఎక్కిన వీరు రాత్రి 11 గంటలకల్లా విశాఖ చేరుకోవాలి. కానీ మార్గమధ్యలో టీలు, టిఫిన్లు, భోజనాలు పేరిట ఆపుకుంటూ నిర్ణీత సమయానికి మూడు గంటలు ఆలస్యంగా... అంటే రాత్రి 2 గంటలకు విశాఖ చేర్చారు. వాస్తవానికి ఆ రోజు దారిలో ట్రాఫిక్ జామ్‌లు కానీ, టోల్గేట్ల వద్ద రద్దీ కానీ లేదు. దీనిపై డ్రైవర్‌ను నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ ప్రయాణికుడు సంబంధిత డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆర్టీసీ కూడా పండగ వేళల్లో ఫ్లెక్సీ ఫేర్ల పేరిట టిక్కెట్టుపై 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇలా ఇటు ప్రైవేటు, అటు ఆర్టీసీ యాజమాన్యాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. అధికంగా వసూలు చేస్తే కేసులు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికంగా బస్సు చార్జీలు వసూలు చేయడం నేరం. అలా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు మాకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం రావాలి.– వెంకటేశ్వరరావు,డిప్యూటీ ట్రాన్స్పోర్టుకమిషనర్ ఆలస్యంగాచేరిస్తే చర్యలు ప్రయాణికులను గమ్యానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేరిస్తే సంబంధిత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటాం. భోజనం, అల్పాహారాల కోసం నిర్ణీత ప్రదేశాల్లోనే ఆపాలి. బస్సు కదలికలను ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గమనిస్తుంటాం. బస్సు గమ్యానికి చేర్చడం ఆలస్యమైతే వివరణ కోరతాం. పొరపాటు ఉంటే రూ.4 వేల వరకు జరిమానా విధిస్తాం. అసౌకర్యం కలిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. – వెంకట్రావు,డిప్యూటీ సీటీఎం, అర్బన్ -
భక్తులపై క్షురకత్తి!
పశ్చిమ గోదావరి, ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు టిక్కెట్టుపై రూ.25 ఆయా దేవస్థానాలు చెల్లించాలంటూ ప్రభుత్వం బుధవారం ఒక మెమో జారీ చేసింది. దీంతో కొన్ని దేవాలయాల్లో పనిచేసే క్షురకులు లాభ పడుతుండగా, మరికొన్ని దేవాలయాల్లో పనిచేసే వారికి నష్టమే మిగలనుంది. దీంతో క్షురకుల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి దేవస్థానం ఒక్కో టిక్కెట్టుపై చెల్లించనున్న రూ. 25 పారితోషికాన్ని క్షేత్రాలకు వచ్చే భక్తుల నుంచే వసూలు చేయాలనేది మోమో సారాంశం. దీంతో భక్తులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెద్ద తిరుపతి తరువాత చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమలలో ఎక్కువగా భక్తులు తలనీలాలను సమర్పిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రంపైనే అధికంగా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ద్వారకాతిరుమలలో తలనీలాలు సమర్పించుకునే టికెట్టు విలువ రూ.15 కాగా, ఇందులో రూ.10ని దేవస్థానం క్షురకులకు ఇస్తోంది. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టికెట్టు ధరను రూ. 25కు పెంచి, ఆ మొత్తాన్ని క్షురకులకు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో 11.28 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ టికెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ. 1,69,20,000 రాగా, ఇందులో క్షురకులకు రూ. 1,12,80,000లను చెల్లించారు. మిగిలిన రూ. 56,40,000ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. అయితే రేపోమాపో పెరగనున్న రూ.25 టికెట్ ధరను క్షురకులకే పూర్తిగా ఇవ్వడం వల్ల ఇకపై టికెట్ ఆదాయాన్ని దేవస్థానం కోల్పోనుంది. అయోమయంలో క్షురక సంఘ నేతలు దేవాలయాల్లో పనిచేసే క్షురకులు జేఏసీగా ఏర్పడి, తమకు నెలకు రూ.15 వేలు జీతం ఇవ్వడంతో పాటు, ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలూ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కత్తి డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు వీరికి టికెట్‌పై రూ. 25 చెల్లించాలని దేవాలయాలను ఆదేశించారు. అయితే దీనివల్ల భక్తులు అధికంగా మొక్కులు చెల్లించే ద్వారకాతిరుమల, విజయవాడ ఆలయాల్లో పనిచేసే క్షురకులే ఎక్కువగా లబ్ధిపొందనున్నారు. ఆ తరువాత సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేసే క్షురకులు మధ్యస్థంగా లబ్దిపొందుతారు. ఇక అన్నవరం, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేసే క్షురకులు మాత్రం తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ కారణంగా జేఏసీ నాయకులు టికెట్‌కు రూ.25 చెల్లింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల ఓట్ల కోసం చంద్రబాబు పెంచిన ఈ ధర వల్ల, ఆలయాల ఆదాయానికి గండి పడటమే కాకుండా, భక్తుల జేబులకు చిల్లు పడనుంది. -
దుర్గమ్మ భక్తులపై భారం
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై టీడీపీ పాలకమండలి వచ్చిన తరువాత భక్తులకు సౌకర్యాలకు కల్పించడం కంటే భారాలు మోపేందుకే ఆసక్తి చూపుతుంది. గతంలో లడ్డూ, ప్రసాదాలు, కార్లు పార్కింగ్, కొన్ని పూజల ధరలు పెంచిన పాలకమండలి తాజాగా శాంతి కల్యాణం టికెట్ ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మాడపాటి గెస్ట్‌హౌస్‌లో చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో ఎం.పద్మల ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్, ఈవో సమావేశ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈవో, చైర్మన్ మాట్లాడుతూ శాంతి కల్యాణం టికెట్ ధర రూ.500 నుంచి రూ.1000కు పెంచామని చెప్పారు. గతంలో శాంతి కల్యాణం చేయించుకున్న భక్తులకు రూ.100 టికెట్ లైన్లో దర్శనానికి అనుమించేవాళ్లమని ఇప్పు డు అంతరాలయ దర్శనానికి(రూ.300 టికెట్) అనుమతిస్తామన్నారు. రూ.13.70 కోట్లతో జీ+4 కాటేజ్‌లు గొల్లపూడిలో దేవస్థానానికి చెందిన స్థలంలో జీ+4 కాటేజ్‌లను రూ.13.70 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితేఈ నిధులు భక్తుల నుంచి సేకరిస్తారు. రూ.10 లక్షలు చెల్లించిన దాత పేరును ఒక గదికి, రూ.15 లక్షలు ఇచ్చిన దాత పేరు ఒక సూట్‌కు పెడతారు. దాతలకు ఏడాదికి 30 రోజులు ఈ రూమ్ లేదా కాటేజ్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, మిగిలిన రోజుల్లో భక్తులకు అద్దెలకు ఇస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలైన నటరాజస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి వార్ల దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా ఇక నుంచి ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తున్నారు. ఇక నుంచి ఉపాలయాలు వద్ద కూడా ఉచిత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ పాశుపతాస్త్రాలయం ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రాలయం పునః నిర్మించేందుకు ఎ.శివనాగిరెడి(స్థపతి) కన్సల్టెంట్‌గా నియమించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.58లక్షలతో గ్రీనరీ అంశం వాయిదా ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఇంద్రకీలాద్రిపై గ్రీనరీ అభివృద్ధికి రూ.58 అంచనాలతో తయారు చేసిన ప్రతిపాదనను వాయిదా వేశారు. గ్రీనరీని దేవస్థానం సిబ్బందే చేయాలని సూచించింది. క్షురకులకు మాస్క్‌లు దేవస్థానంలోని కేశఖండన శాలలో పనిచేసే క్షురకులు గ్లౌజ్‌లు, మాస్కులు ధరించాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది. క్షురకులు అనారోగ్యంతో చనిపోయినప్పడు, అతడి భార్యకు లేదా వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే కేశఖండన శాఖ వద్ద పనిచేయడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనను తమ పరిధిలోకి రాదని పాలక మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉపాలయాల్లో నగల అలంకరణ అమ్మవారికి భక్తులు సమర్పించే బం గారాన్ని భద్రపరిచి అమ్మవారికి ఏడువారాల నగలు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వెండి, బంగారు ఆభరణాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వెండి విక్రయించగా వచ్చిన సొమ్ము బంగారం, బాండ్లుగా మార్చాలని నిర్ణయించారు. 140 ఎకరాలభూములు వేలం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, దాని దత్తత దేవాలయాలకు సుమారు 140 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి లీజు పరిమితి ముగియడంతో తిరిగి వేలం నిర్వహించి మూడేళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు ఒకొక్క రోజు ఒక్కో దేవాలయానికి చెందిన భూముల లీజు హక్కు కోసం వేలం నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని ఈవో ఎం.పద్మ తెలిపారు. దేవస్థానం ఆస్తులను జాగ్రత్తగా కాపాడి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరం సమీపంలో దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల భూమిలో చైతన్య విద్యాసంస్థల మురుగు వదులుతున్న విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని, ఒకటి రెండు రోజుల్లో మురుగు రాకుండా పకడ్బందీగా ఏర్పాటుచేసి ఆ భూమిని కాపాడతామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమికి వేలం నిర్వహించడం లేదని ఈవో తెలిపారు. -
లాహిరి లాహిరి లాహిరిలో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం సరికొత్త స్పీడు బోటు సిద్ధమైంది. సాగరంలోకి రయ్‌ను దూసుకుపోయే ఈ బోటు నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ చాన్నాళ్లుగా 40 మంది కూర్చునే వీలున్న ‘స్వర్ణవిహారి’ పాత బోటును నడిపేది. గత నవంబర్ 12న విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పర్యాటకశాఖ బోటు బోల్తాపడిన ప్రమాదంలో 25 మందికి పైగా మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందిన పర్యాటకశాఖ అధికారులు అప్పటికే అంతగా ఫిట్నెస్ లేని స్వర్ణ విహారిని నిలిపివేశారు. దీంతో విశాఖ ఆర్కే బీచ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు బోటు షికారు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుషికొండలో పర్యాటకశాఖ నడుపుతున్న నాలుగు సీట్ల స్పీడ్ బోటు మాత్రమే పర్యాటకులకు అరకొరగా సరదా తీరుస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ విహారికి మళ్లీ మెరుగులు దిద్ది పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో పర్యాటకశాఖ అధికారులు 10 సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త స్పీడు బోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బోటును ఫిషింగ్ హార్బర్లోని 11వ నంబరు జెట్టీ నుంచి నడపనున్నారు. ఇందులో ఇద్దరు డైవర్లు (గజ ఈతగాళ్లు–వీరే బోటును కూడా నడుపుతారు) కాగా మిగిలిన వారు పర్యాటకులుంటారు. ఈ బోటు 11వ నంబరు జెట్టీ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలోకి తీసుకెళ్లి తీసుకొస్తారు. టిక్కెట్టు ధర రూ.250.. ఒక్కొక్కరికి రూ.250 టిక్కెట్టు ధర నిర్ణయించారు. రుషికొండలో నడుస్తున్న స్పీడ్ బోటులో షికారు చేసే వారికి ఒక్కొక్కరికి రూ.300 టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. ఎక్కువ సామర్థ్యం ఉండడం, డీజిల్ నడవడం వల్ల స్వర్ణ విహారి బోటులో టిక్కెట్టు ధర రూ.60లే ఉండేది. కానీ ఈ స్పీడు బోటు పెట్రోల్‌తో నడిచేది కావడం, తక్కువ మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో ఈ బోటు షికారుకు రూ.250 టిక్కెట్టుగా నిర్ణయించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్పీడు బోటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపనున్నారు. ఈ బోటు సర్వీసును ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
‘చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట’
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలను రూ.5, 10, 15, 20, 25, 30కు మారుస్తూ హేతుబద్ధీకరించటంతో చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట లభిస్తుందని ఆర్టీసీ ఎన్ఎంయూ వెల్లడించింది. సోమవారం నుంచి దీన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి పేర్కొన్నారు. డిస్కంలకు ఉన్న రూ.12 వేల కోట్ల రుణాన్ని భరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీకి ఉన్న రూ.2,500 కోట్ల రుణాన్ని కూడా భరించాలని కోరారు. -
న్యూ ఇయర్‌కు మెట్రో వాత
జనం ఉత్సాహంతో జేబు నింపుకోవడానికి మెట్రో రైల్ సంస్థ పథకం వేసింది. 31న రాత్రి వేడుకల కోసం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్‌కు భారీగా తరలివచ్చే ఔత్సాహికులు మెట్రో రైలు ఎక్కాలంటే రెట్టింపు చార్జీలు చెల్లించాలి. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 2 వరకు ఇదే తంతు. సాక్షి, బెంగళూరు: న్యూ ఇయర్ వేడుకలను సొమ్ము చేసుకోవడానికి బెంగళూరు నమ్మ మెట్రో రైల్ సంస్థ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. చిల్లర సమస్య వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులో న్యూ ఇయర్ వేడుకలు భారీగా జరుగుతాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎం.జీ రోడ్డుకు మెట్రో కనెక్టివిటీ ఉంది. దీంతో క్యాబ్‌లు, సొంత వాహనాలు వదిలి ప్రజలు మెట్రోలోనే వేడుకలకు వచ్చే అవకాశముంది. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య ట్రినిటీ సర్కిల్, ఎం.జీరోడ్, కబ్బన్ పార్క్ నుంచి నగరంలోని ఏ ప్రాంతంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లే వారు రూ.50 చెల్లించి టికెట్‌ను కొనాల్సిందే. ఇతర ప్రాంతాల నుంచి ఈ మూడు మెట్రో స్టేషన్లకు వచ్చేవారు కూడా ఇంతే మొత్తం ఇచ్చుకోవాలి. స్మార్ట్ కార్డ్ కలిగిన వారు మాత్రం పాత ధరల్లోనే ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఎప్పటిలాగా 15 శాతం రాయితీ కూడా లభించనుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇందిరానగర్లోనూ వేడుకల జోరు సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు నగరంలోని బ్రిగెడ్, ఎంజీ రోడ్లలో నిర్వహించుకోవడానికి యువత ఎక్కువ ఆసక్తి చూపించేంది. ఈసారి ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్డు, కోరమంగళ, జాలహళ్లి ప్రాంతంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవడానికి యువత తహతహలాడుతోంది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బార్లు, పబ్‌లు రావడం ఒక కారణమైతే ఎంజీరోడ్, బ్రిగెడ్ రోడ్డుల్లో గత ఏడాది జరిగిన సంఘటనలూ మరో కారణం. అందులోనూ ఇందిరానగర్ రెస్టారెంట్ హబ్‌గా మారడం, మెట్రో కనెక్టివిటీ ఉండటం వల్ల యువత మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే ఇందిరానగర్‌కు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇందిరానగర్‌తో పాటు కోరమంగళ, జాళహళ్లి ప్రాంతాల్లో కూడా అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు సిబ్బంది మోహరింపు తదితర చర్యలను నగర పోలీసులు చేపడుతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో గస్తీ బృందంలో 500 హొయ్సల, 150 చీతా వాహనాలు గస్తీ కాస్తాయి. వాహనాల పార్కింగ్‌ను ఎంజీరోడ్, బ్రిగెడ్‌రోడ్, చర్చ్ స్ట్రీట్లలో నిషేదించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్‌ను ఈనెల 31 అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు మొదలయ్యి సోమవారం 4 గంటల వరకూ కొనసాగనుంది. రవాణా శాఖ కూడా ఆదాయం పెంచుకోవడానికి రెడీ అవుతోంది. క్యాబ్‌లు, ఆటో వాలల పై నిఘా పెట్టి వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేయకుడా చర్యలు చేపడుతామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బీఎంటీసీ సేవలను సైతం విస్తరించారు. బెంగళూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు బీఎంటీసీ బస్సులు నగర వాసులకు అందుబాటులో ఉండనున్నాయి. -
టికెట్ల ధరలు టూమచ్ గురూ..!
కలల మెట్రోలో హాయిగా ప్రయాణించాలని ఆశిస్తున్న సిటీజనులకు చార్జీలు కొంత నిరాశ కలిగించాయి. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో కంటే మెట్రో రైళ్లలో జర్నీ కాస్త భారమే. కనీస చార్జీ రూ.10, గరిష్టంగా రూ.60 చార్జీలు ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆల్పాదాయ, మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు రైళ్ల వేళలు కూడా మార్చాలని కోరుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : మెట్రోరైలు చార్జీలు గ్రేటర్లో సగటుజీవికి భారంగానే పరిణమించనున్నాయి. గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోల్లోని 3850 ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరూ కలల మెట్రో జర్నీ చేయాలనుకుంటే వారి జేబుకు చిల్లు తథ్యం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు తొలిదశ మెట్రో మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ)వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణిస్తే రూ.17 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే మెట్రో రైలులో అయితే రూ.45 తథ్యం. ఇక మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)మార్గంలో ప్రయాణించేవారు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో బయలుదేరి వెళితే రూ.15 చార్జీ చెల్లించాలి. అదే మెట్రోరైలులో అయితే రూ.40 చెల్లించాలి. ఇక ఎంఎంటీఎస్ రైలు చార్జీలతో పోల్చినా మెట్రో చార్జీలు సామాన్యునికి గుదిబండలానే మారాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో కనీస చార్జీ రూ.5 ..గరిష్టం రూ.10 కావడం గమనార్హం. అదే మెట్రోలో కనీసం రూ.10..గరిష్టంగా రూ.60 చెల్లించాల్సి రావడం సామాన్యులపై భారం పడుతుందని అల్పాదాయ, మద్యాదాయ, వేతనజీవులు ఆందోళన చెందుతున్నారు. ఏసీ బస్సు కంటే తక్కువ.. ఆర్టీసీ ఏసీ బస్సు కంటే..మెట్రో జర్నీ చవకే కాదు..సమయం ఆదా కూడా. ఇదెలా అంటారా..మీరు నాగోల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న అమీర్‌పేట్‌కు ఆర్టీసీ ఏసీ బస్సులో ప్రయాణిస్తే రూ.64 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి సుమారు 50 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. అదే మెట్రోరైలులో అయితే రూ.45 ఛార్జీ చెల్లించి 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇక మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)మార్గంలో ఏసీ బస్సులో రూ.48 చెల్లించి 45 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు అదే...మెట్రోరైలులో కేవలం రూ.40 మాత్రమే చెల్లించి 20 నిమిషాల్లో గమ్యమస్థానం చేరుకునే అవకాశం ఉండడం విశేషం. భారీ వర్షం కురిసి ట్రాఫిక్ స్తంభిస్తే ఈ మార్గాల్లో బస్సు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. కాగా మెట్రో ప్రయాణ చార్జీలను ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రకటించిన నేపథ్యంలో నగరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం.. రోజువారీగా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారికి మెట్రో జర్నీ చవక ప్రయాణమే కాదు..సమయం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతానికి నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లోనే మెట్రో అందుబాటులో ఉన్న నేపథ్యంలో మిగతా రూట్లలో తిరిగే వారు యథావిధిగా ఆటోలు, క్యాబ్‌లు ఆశ్రయించాల్సిందే. కాలుష్యం, కుదుపులు లేనిప్రయాణం, ట్రాఫికర్ లేకపోవడం మెట్రో జర్నీ ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. రాయితీ పాస్‌లు లేనట్టే... ఇక ఆర్టీసీ బస్సుల్లో స్టూడెంట్స్, ఎన్జీఓ, వికలాంగులు, జర్నలిస్టులకు రాయితీ పాస్‌ల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే మెట్రో రైళ్లలో స్మార్ట్‌కార్డ్, టోకెన్, టిక్కెట్ మినహా ఎలాంటి రాయితీ పాస్‌లు అమలులో లేవు. దీనిపై ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. పనివేళలపై అసంతృప్తి... ఇక మెట్రో రైలు సర్వీసులు తొలి మూడునెలలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నడపనున్నారు. ఆతరవాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే నడపనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం అన్నది ఆసక్తికరంగా మారింది. విద్యార్థులు: ఆర్టీసీ జారీచేసే స్టూడెంట్ బస్‌పాస్‌లున్నవారు గ్రేటర్ పరిధిలో సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు. వీరు నెలకు రూ.130 చెల్లించి బస్‌పాస్ కొనుగోలు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మినహా వీరంతా మెట్రో రైలులో రోజువారీగా ప్రయాణించే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు: ప్రభుత్వం మంజూరు చేసే ఎన్జీఓ పాస్ ఉన్నవారు నగరంలో సుమారు 2 లక్షలమంది ఉన్నారు. వీరు నెలకు రూ.750 చెల్లించి పాస్ కొనుగోలు చేస్తారు. వీరు కూడా మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించే అవకాశం ఉండదు. ప్రైవేటు ఉద్యోగులు: గ్రేటర్ పరిధిలో సుమారు 35 లక్షల ద్విచక్రవాహనదారులున్నారు. వీరిలో చాలామంది ప్రైవేటు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. వీరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ ఉండేవారు చాలా తక్కువే. వీరిలో చాలామందికి అర్థరాత్రి, అపరాత్రి షిఫ్టులుంటాయి. దీంతో వీరిలో చాలామంది ద్విచక్రవాహనానికే మొగ్గుచూపుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారిదీ ఇదే రూటు. చిరు వ్యాపారులు: పాలు, కూరగాయలు, నిత్యావసరాలను విక్రయించే వ్యాపారులు భారీ లగేజితో తరలివస్తే మెట్రో జర్నీలో అనుమతించరు. దీంతో వేలాదిమంది వ్యాపారులు ఇతర పనుల నిమిత్తం బయటికి వెళితే తప్ప..వారి వ్యాపార నిమిత్తం మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండదు. -
రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంపు సాక్షి, హైదరాబాద్: దసరా సెలవులకు ఊరికి వెళుతున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు వీడ్కోలు పలికేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా? అయితే ఇది గమనించండి. గురువారం నుంచి ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు పెరుగుతున్నాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే బుధవారం తెలిపింది. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచుతున్నట్టు ప్రకటించింది. 13 రోజుల పాటు పెంచిన చార్జీలు అమలవుతాయని వెల్లడించింది. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అనవసరమైన వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంచామని వివరించింది. పండుగల రోజుల్లో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. తమ వారిని ఊళ్లకు సాగనంపేందుకు ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేషన్‌కు తరలివస్తుంటారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా స్టేషన్ నిర్వహణ చేపట్టడంతో పాటు, భద్రత కూడా నిర్వాహకులకు సవాల్‌గా మారుతుంది. దీంతో పండుగ సీజన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచుతూ వస్తున్నారు. -
బాదుడే బాదుడు
►తిరుపతిలో ప్రయివేటు ట్రావెల్స్ దోపిడీ ►శని, ఆదివారాల్లో రెట్టింపు చార్జీల వసూలు ►పొరుగు రాష్ట్రాల ప్రయాణాలపై భారీ బాదుడు ►పనిచేయని పుష్బ్యాక్ సీట్లు, ఏసీలతో అవస్థలు తిరుపతి: తిరుపతిలో ప్రయివేటు బస్సుల దోపిడీ ఎక్కువైంది. టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. వేసవి సెలవుల్లో సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో ఈ దోపిడీ ఎక్కువైంది. ప్రయివేటు బస్సుల్లో ప్రయాణాలకు అలవాటు పడ్డ ప్రయాణికులు గత్యంతరం లేక ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయివేటు బస్సుల దందాను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే తిరుపతిలో ప్రయివేటు దందా ఎక్కువైందని తెలుస్తోంది. రోజూ తిరుపతి నుంచి 80 వేల మందికి పైగా దూర ప్రయాణాలు చేస్తుంటారు. వీరంతా ఆర్టీసీ బస్సుల్లో, ప్రయివేటు ట్రావెల్ బస్సుల్లోనూ, మిగతా వాళ్లు రైళ్లల్లోనూ వెళ్తుంటారు. గడచిన నెల రోజుల నుంచి భక్తులతో తిరుమల కొండపై రద్దీ పెరిగింది. రోజూ తిరుమల వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్షకు చేరింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనూ, మరో 40 మంది దాకా రైళ్లల్లోనూ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇకపోతే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నల్గొండ, గుంటూరు, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మార్పులు జరిగిన సందర్భాల్లోనే ఎక్కువ మంది ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. దీనికితోడు వేసవి కాలం కావడంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా విధిగా ప్రయివేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు ట్రావెల్స్ చార్జీల రేట్లు పెంచేశాయి. ఉదాహరణకు రోజూ రాత్రి 9.30 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే మార్నింగ్‌స్టార్ సర్వీసుకు గతంలో రూ.440లు తీసుకునేవారు. శనివారం రాత్రి ఏకంగా «రూ.740లు తీసుకున్నారు. అవేవిధంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులపై రూ.400 అదనంగా బాదేశారు. ఒక్క మార్నింగ్‌స్టార్ మాత్రమే కాకుండా తిరుపతి నుంచి బయలుదేరే అన్ని బస్సులూ రేట్లు పెంచేశాయి. శ్రీనివాస, శ్రీకృష్ణ, వెంకట రమణ, కాళేశ్వరి బస్సులన్నీ వీకెండ్ బాదుడు మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి ప్రయివేటు బస్సులన్నీ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నుంచే బయలుదేరుతున్నాయి. రోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ బస్సులు అంబేడ్కర్ సర్కిల్, ఈస్ట్‌పోలీస్ స్టేషన్ల మధ్య ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నాయి. రోజూ 80 సర్వీసులు ఇక్కడి నుంచి బయలుదేరతాయి. సుమారు రూ.2 లక్షల ఆర్టీసీ ఆదాయాన్ని లాగేసుకుంటున్నాయి. పైగా చాలా బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రూట్ పర్మిట్లు లేనివి కొన్నయితే, దాదాపు సగానికి సగం స్టేజీ క్యారియర్లుగా నడుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, టికెట్ల జారీ పద్ధతిలో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ల నేతలు ప్రయివేటు బస్సుల విషయాన్ని లేవనెత్తారు. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా కాకుండా కిలోమీటరు దూరాన బస్సులను ఆపుకుని ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ కోరింది. ఎస్పీ జయలక్ష్మి జోక్యంతో కొన్ని రోజుల పాటు అలా జరిగినా తర్వాత మళ్లీ బస్టాండ్ దగ్గరే ఆపుతున్నారు. -
రూ.48కే అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టికెట్
కోల్‌కతా: భారత్‌లో జరిగే అండర్–17 ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల టికెట్ ధరలను ప్రకటించారు. ప్రేక్షకుల ఆదరణను పెంచేందుకు తొలి అంచె మ్యాచ్ టికెట్లను కనిష్టంగా కేవలం రూ.48కే అందించనున్నారు. మంగళవారం రాత్రి 7.11 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టోర్నీ డైరెక్టర్ జేవియర్ కెప్పి తెలిపారు. ఇతర స్టాండ్స్ టికెట్ ధరలు రూ.96, రూ.192గా ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్‌కు కోల్‌కతా వేదికగా నిలుస్తుంది. కోల్‌కతాలో జరిగే పది మ్యాచ్‌లకు కలిపి రూ.480తో ప్యాకేజీగా అందిస్తామని... ఇందులో ఫైనల్ మ్యాచ్ టికెట్ కూడా ఉంటుందని కెప్పి తెలిపారు. -
టికెట్ల ధర తగ్గించిన జెట్ ఎయిర్వేస్
ముంబై: విమానయాన సంస్థ ‘జెట్ ఎరుుర్‌వేస్’ తాజాగా తన ఎకానమీ టికెట్ల ధరలను సగటున 20 శాతం మేర తగ్గించింది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లకు మాత్రమే ఈ టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలియజేసింది. మూడు రోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ పరిమితకాల ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న దేశీ ప్రయాణికులు 2017 జనవరి 5 నుంచి ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. అదే అంతర్జాతీయ టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు తక్షణం ప్రయాణించే అవకాశముంటుందని పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.939 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రత్యేక ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు నవంబర్ 8 పైన ఎప్పుడైన ప్రయాణించొచ్చని తెలిపింది. కాగా ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకే వ ర్తిస్తుందని.. అలాగే సంస్థ డెరైక్ట్ ఫ్లైట్స్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొంది. -
స్పైస్‌జెట్ పండుగ ఆఫర్..
రూ. 888కే టికెట్.. న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా వచ్చే పండుగ సీజన్‌ను పురస్కరించుకొని టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్లో భాగంగా దేశీ విమాన టికెట్లను (ఒక వైపునకు) రూ.888 నుంచి అందిస్తోంది. ఇక విదేశీ విమాన టికెట్ ధర రూ.3,699గా ఉంది. అక్టోబర్ 7 వరకు కొనసాగనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని సంస్థ పేర్కొంది. ఇది పరిమితకాల ఆఫర్ అని, ముందుగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యముంటుందని తెలిపింది. -
పెరగనున్న భద్రాద్రి ‘ప్రత్యేక’ టికెట్ ధర !
భద్రాచలం: ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 ఉన్న ప్రత్యేక దర్శనం టికెట్ ధరను రూ.50 వరకు పెంచేందుకు నిర్ణయించారు. దీనిపై భక్తులు తమ అభిప్రాయూలు తెలపాలంటూ దేవస్థానం అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రూ.20 టికెట్ తీసుకున్న వారు సుదర్శన ద్వారం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. రూ.150 అర్చన టికెట్ తీసుకున్న భక్తులను మాత్రం గర్భగుడిలోని స్వామి వారి మూలవరుల వరకూ పంపిస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ, అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరుతో రూ.20 కు బదులుగా రూ.100 టికెట్‌ను విక్రరుుస్తున్నారు. ఒక దర్శనం కోసం ఇలా వేర్వేరు టికెట్ల పేరుతో ఎక్కువ వసూలు చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక దర్శనం టికెట్‌ను ఇక నుంచి రూ.50కు పెంచి, రద్దీ రోజుల్లో కూడా దీనినే విక్రయించేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న జారీచేసిన ప్రకటనపై 15 రోజులలోపు భక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం అధికారులు తగిన రీతిలో ప్రచారం చేయకపోవడం సరైంది కాదని భక్తులు వాపోతున్నారు. -
పెరగనున్న భద్రాద్రి ప్రత్యేక దర్శనం టికెట్ ధర
భద్రాచలం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 ఉన్న ప్రత్యేక దర్శనం టికెట్ ధరను రూ.50 వరకు పెంచేందుకు నిర్ణయించారు. దీనిపై భక్తులు తమ అభిప్రాయూలు తెలపాలంటూ దేవస్థానం అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటి వరకూ రూ.20 టికెట్ తీసుకున్న వారు సుదర్శన ద్వారం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. రూ.150 అర్చన టికెట్ తీసుకున్న భక్తులను మాత్రం గర్భగుడిలోని స్వామి వారి మూలవరుల వరకూ పంపిస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ, అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరుతో రూ.20 కు బదులుగా రూ.100 టికెట్‌ను విక్రరుుస్తున్నారు. ఒక దర్శనం కోసం ఇలా వేర్వేరు టికెట్ల పేరుతో ఎక్కువ వసూలు చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక దర్శనం టికెట్‌ను ఇక నుంచి రూ.50కు పెంచి, రద్దీ రోజుల్లో కూడా దీనినే విక్రయించేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న జారీచేసిన ప్రకటనపై 15 రోజులలోపు భక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం అధికారులు తగిన రీతిలో ప్రచారం చేయకపోవడం సరైంది కాదని భక్తులు వాపోతున్నారు. -
రూ.826కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టికెట్ ధరల్లో డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక వైపునకు సంబంధించి దేశీ విమాన టికెట్లను రూ.826ల నుంచి ప్రయాణికులకు అందిస్తోంది. అలాగే అంతర్జాతీయ విమాన టికెట్లను రూ.3,026ల (పన్నులు అదనం) నుంచి ఆఫర్ చే స్తోంది. ఈ విమాన టికెట్ ధరలన్నీ కూడా ఎంపిక చేసిన దేశీ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ వినియోగదారులకు ఈ నెల 25-27 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆఫర్లో టిక్కెట్లును బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 1-ఏప్రిల్ 12 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిర్కోస్టా ‘555’ ఆఫర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిపబ్లిక్ డే నేపథ్యంలో ఎయిర్కోస్టా టికెట్లపై రూ. 555 ఆఫర్‌ను ప్రకటించింది. జనవరి 25 ఉదయం 10 నుంచి జనవరి 28 సాయంత్రం 6లోపు తీసుకున్న ప్రతీ టికెట్‌పై రూ. 555 తగ్గింపు లభిస్తుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 8-అక్టోబర్ 29 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది. -
సెస్ నిధుల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: మీ సౌకర్యాల కోసమే అంటూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న నిధులు దారిమళ్లుతున్నాయి. అదనంగా వసూలు చేస్తున్న మొత్తాన్ని ఆర్టీసీ పత్తాలేకుండా చేస్తోంది. ఏటా దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలవుతున్నా.. బస్టాండ్లలో విరిగిన బల్లలు, పని చేయని ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్యం పడకేసి కంపుకొడుతోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలకు వెళితే ముక్కు తెరవలేని పరిస్థితి. ఏ నిధులు ఎటు పోతున్నాయో, వేటిని దేని కోసం ఖర్చు చేస్తున్నారో ఆర్టీసీలో పరిస్థితి అంతు చిక్కకుండా ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కాకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టేందుకు స్వయంగా ప్రయాణికుల జేబు నుంచి వసూలు చేసే విధానానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. టికెట్ ధర కాకుండా అదనంగా ప్రతి ప్రయాణంపై ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. ప్యాసింజర్ సెస్ రూపంలో వీటిని వసూలు చేస్తున్నా చాలామందికి ఆ విషయమే తెలియదు. అది టికెట్ ధరగానే భావిస్తున్నారు. ప్రయాణికులకు అవగాహన లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఆర్టీసీ ఆ నిధులను దర్జాగా పక్కదారి పట్టిస్తోంది. ప్రతి బస్టాండ్‌లో నిత్యం రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫ్యాన్లు పాడయిపోవటం, మంచినీటి నల్లాలు పనిచేయకపోవటం, బల్లలు,కుర్చీలు విరిగిపోవడం, ఫ్లోరింగ్ దెబ్బతినటం, పారిశుధ్య పనుల నిర్వహణ... తదితరాలు ఈ కోవలోకి వస్తాయి. వీటి కోసం బడ్జెట్ నిధులపై ఆధారపడితే పనులన్నీ నెలల తరబడి పడకేస్తాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దేందుకు ఈ సెస్‌ను ప్రయోగిం చారు. ఆ అదనపు రుసుము వసూలు చేస్తున్నా పనులు మాత్రం జరగటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ వెలుపల నిత్యం దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువ మంది పల్లె వెలుగు బస్సులను ఆశ్రయిస్తారు. దాదాపు 18 లక్షల నుంచి 20 లక్షల మంది ఎక్స్‌ప్రెస్ ఆ పై కేటగిరీ బస్సుల్లో తిరుగుతారు. వీరంతా ఈ సెస్ చెల్లించాల్సిందే. ఈ రూపంలో సాలీనా రూ.50 కోట్లకు తక్కువ కాకుండా వసూలవుతున్నాయి. కానీ ఏ బస్టాండులో కూడా ఎప్పటికప్పుడు పనులు జరగటం లేదు. ఈ సెస్ వసూలు కాకముందు ఇంజినీరింగ్ బడ్జెట్ నిధుల నుంచి పనులు నిర్వహించినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మరి సెస్ నిధుల వసూలు ఉద్దేశం ఏమైనట్టో ఎవరికీ అంతుచిక్కటం లేదు. సాధారణ సివిల్ వర్క్స్‌తో కలిపి ఈ రెగ్యులర్ పనులు చేయొద్దన్న ఉద్దేశంతో ఈ సెస్ కోసం ప్రత్యేక ఖాతానే తెరవాలని అప్పట్లో నిర్ణయించారు. అలాగే వసూలు చేసి జమ చేస్తున్నారు. కానీ ఖర్చు వరకు వచ్చేవరకు మాత్రం వాటిని కేటాయించటం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే... డబ్బులేవైతే ఏంటి పనులు చేస్తున్నాం కదా అంటూ దాటేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా సెస్ వసూలు చేయటం ఎందుకంటే సమాధానం చెప్పటం లేదు. ప్రయాణికులు అవగాహన లేకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆర్టీసీ వాటిని పక్కదారిపట్టిస్తున్నారు. -
ఆర్టీసీ టికెట్ బాదుడు!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సంస్థపై పడే భారాన్ని పూడ్చుకునేందుకు బస్సు చార్జీల పెంపుపై యాజమాన్యం దృష్టిసారించింది. చార్జీల రూపంలో ప్రజలపై భారం స్వల్పంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో టికెట్ ధరల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న విషయం స్పష్టమైంది. అయితే చార్జీల పెంపుపై ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేనప్పటికీ శుక్రవారం డీజిల్ ధరలు భారీగా పెరగడంతో చార్జీల పెంపుపై అధికారులు దృష్టిసారించారు. లీటర్ డీజిల్‌పై రూ. 2.70 పైగా పెరగడంతో టీఎస్ఆర్టీసీపై ఏటా రూ.75 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా ఫిట్మెంట్ భారం ఉండడడం దానికి తోడు డీజిల్ ధరలు పెరగడంతో టికెట్ ధరల పెంపు అనివార్యం కానుంది. ఇప్పటికే 15 శాతం మేర చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. -
ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం
రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. - సాక్షి, ఒంగోలు ఆన్లైన్ విధానంలో ట్రైన్ పేరు, ట్రైన్ నంబరు కోసం... టీఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ పేరు లేక ట్రైన్ నంబరు ఎంటర్ చేయండి. ఉదా: TN <TRIAN NAME> OR TN <TRIAN NUMBER> ఆ పేరున ఉన్న అన్ని ట్రైన్ల నంబర్లు, ట్రైన్ల పేరు మీ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. టికెట్ ధర తెలుసుకోవాలంటే... ఫేర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ ప్రయాణం తేదీ, నెల, సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: FARE <TRIAN NUMBER> <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అన్ని తరగతులు ధరలు కనిపిస్తాయి. ట్రైన్ టైమ్ టేబుల్ కావాలంటే... టైమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు ఎంటర్ చేయాలి. ఉదా: TIME <TRIAN NUMBER> ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి బయలు దేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వారంలో ఎన్ని సార్లు అందుబాటులో ఉంటుంది, ఏ తరగతులు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలు మీకు తెలుస్తాయి. ట్రైన్లో సీట్ ఉందా లేదా, వెయిటింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే.. సీట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబర్ స్పేస్ ప్రయాణం తేదీ నెల సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: EAT <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు అన్ని తరగతులలో అందుబాటులో ఉన్న వివరాలు, వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ట్రైన్ రాకపోకల సమయం కోసం ఎడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ స్టేషన్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయాలి. ఉదా: AD <TRIAN NUMBER> <STATION STD CODE'> మీరు తెలుసుకోవాలనుకున్న ట్రైన్ టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ ఎంక్వైరీ కోసం.. పీఎన్ఆర్ స్పేస్ ఇచ్చి పది సంఖ్యల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఉదా: PNR <PNR TEN DIGIT NUMBER> మీరు రిజర్వ్ చేసుకున్న టికెట్ స్టేటస్ తెలుస్తుంది. -
కొత్త సినిమా వస్తే పండుగే
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులోని సినిమా థియేటర్లు అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. నిబంధనలకు వ్యతిరేకంగా టిక్కెట్ ధరలను పెంచి అమ్ముతున్నాయి. నిబంధనలు అమలు పరచాల్సిన రెవెన్యూ సిబ్బంది ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకుడిని నిలువునా దోచేస్తున్నాయి. ఏ సినిమా హాల్లో కూడా వీటి ధర ఎంత అనే కనీస సమాచారం కూడా బోర్డులపై ఉండదు. పెద్ద హీరోల సినిమాలు వస్తే రిజర్వుడు క్లాస్ ధర ఆకాశంలో ఉంటుంది. మొదటి రోజున బెనిఫిట్‌షో వేస్తే ఒక్కో టిక్కెట్ రెండు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగిలిన షోలకు వంద రూపాయలకు అమ్ముతున్నారు. సినిమా హిట్ అయ్యిందటే వారం రోజుల పాటు బ్లాక్‌లో కొనుక్కోవల్సిందే. బుకింగ్‌లో నామమాత్రంగా టిక్కెట్లు ఇచ్చి అయిపోయాయని చెబుతారు. థియేటర్ యాజమాన్యాలు తమ సిబ్బందితోనే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మల్టిప్లెక్స్ పేరుతో ఉన్న థియేటర్లకు మాత్రమే టిక్కెట్ వంద రూపాయలకు అమ్మడానికి అనుమతి ఉంది. మిగిలిన వాటిలో ఎయిర్ కండీషన్డ్ థియేటర్ అయితే రిజర్వుడ్ క్లాస్ ధర రూ.75, ఎయిర్ కూలింగ్ అయితే రూ. 70 రూపాయలు అమ్మాల్సి ఉంది. నాన్ ఏసీ థియేటర్లయితే రిజర్వుడు ధర రూ.40 లుగా ఉండాలి. అయితే ఈ నిబంధనలు అసలు అమలు కావు. ఏ టిక్కెటయినా వంద రూపాయలు చెల్లించాల్సిందే. కొన్ని థియేటర్లు టిక్కెట్లపై ధర రూ.70 ముద్రించినా వంద రూపాయలకే అమ్ముతారు. అడిగితే దౌర్జన్యమే. మరికొన్నింటిలో అసలు టిక్కెట్‌పై ధర ముద్రించకుండా కేవలం రిజర్వుడ్ క్లాస్ అని మాత్రమే ముద్రిస్తున్నారు. వంద రూపాయలు పెట్టి సినిమాలకు వెళ్లినా థియేటర్లలో ఏ మాత్రం సదుపాయాలుండవు. పరిశుభ్రత అన్నదే కనపడదు. సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించాల్సిన జాయింట్ కలెక్టర్‌గాని, లెసైన్స్ మంజూరు చేసే ఆర్డీవో గాని, ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తహసీల్దారులు అటువైపే దృష్టి సారించడం లేదు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరివాడే’ సినిమా విడుదలయింది. అన్ని థియేటర్లలో టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ పేరుతో బ్లాక్ దందా యథేచ్ఛగా కొనసాగించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌ను వివరణ కోరగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహిస్తే తాము సహకరిస్తామని అన్నారు. -
రాజన్న సేవలు మరింత ప్రియం?
►రెట్టింపు పెంపుదలకు ఆలయవర్గాల యోచన ►కమిషనర్ అనుమతులకోసం సిద్ధమైన ఫైలు ►నిధుల కోసమే భక్తులపై భారం పేదల దేవుడు ఎములాడ రాజన్న ఆర్జిత సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఈ మేరకు ఆలయ వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ప్రస్తుతమున్న పూజల టిక్కెట్ల ధరలు రెట్టింపు చేసే ప్రతిపాదన తయారు చేస్తున్నాయి. కమిషనర్ అనుమతులు కోరుతూ ఇప్పటికే సిద్ధం చేసిన ఫైలు కదిలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు స్థానిక నేతలతో ఆలయ ఈవో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భక్తులకు ఏదేని అభ్యంతరాలుంటే పక్షం రోజుల్లోగా వెల్లడించాలన్న షరతుతో కూడిన నోటీసులు సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -వేములవాడ భక్తులకు పెను భారం పేదల పెన్నిధిగా పేరున్న రాజన్న భక్తులకు నానాటికీ దూరమవుతున్నాడు. ఆర్జిత సేవలు తరచూ పెంచుతుండడంతో ఆర్థిక స్తోమత లేనివారికి ఆయన సేవలు ప్రియమవుతున్నాయి. గతంలో నిరుపేదలకు అందుబాటులో ఉన్న రాజన్న సేవలు 2011లో అప్పటి ఈవో అప్పారావు హయాంలో రెట్టింపయ్యాయి. భక్తులపై ఏ మేరకు భారం పడుతోందన్నది పక్కన పెట్టిన ఆయన ఆలయ ఆదాయం ఎలా చెందుతుందన్నది మాత్రమే దేవాదాయ శాఖకు నివేదించి అనుమతులు పొందారని సమాచారం. ఇంతలోనే ఈ సారి రెట్టింపును మించిన అంచనాలతో పెంపుదలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. రూ. 200 ఉన్న శ్రీఘ్ర కోడెమొక్కు చెల్లింపునకు ఏకంగా అతి శ్రీఘ్ర కోడెమొక్కుగా పేరు మార్చుతూ రూ. 1,000 కిపెంచేందుకు సిద్ధపడడం విడ్డూరంగా ఉంది. నిధులు సమకూర్చుకునేందుకే.. రాష్ట్ర విభజన అనంతరం తలె త్తిన నిధుల కొరత భక్తులపాలిట శాపంగా మారిందా అంటే నిజమనే చెబుతున్నాయి ప్రస్తుతల పరిణామాలు. ఎందుకంటే ప్రధాన దేవాలయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న కారణంగా తెలంగాణ దేవాలయాలకు కామన్‌గుడ్‌ఫండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో ఈ నిధులను నమ్ముకుని తెలంగాణ దేవాలయాల్లో ఇప్పటికే చేపట్టిన రూ. 50 కోట్ల పనులు ముందుకు సాగడం ప్రశ్నార్థకంగా మారింది. విభజనకు పూర్వం రూ. 150 కోట్లమేర కామన్ గుడ్‌ఫండ్ సమకూరేది. ఇందులో తెలంగాణ ఆలయాలకూ వాటా దక్కింది. ప్రస్తుతం తెలంగాణ దేవాలయాల ద్వారా కేవలం రూ. 7.50 కోట్లుమాత్రమే కామన్‌గుడ్‌ఫండ్ సమకూరనుంది. దీంతో రాజన్న ఆలయానికి సైతం అభివృద్ధి నిధులు అంతంతమాత్రంగానే కేటాయించే అవకాశముంది. ఈ దరిమిలా నిధులు భారీగా జమ గట్టేందుకే ఈ తరహా పెంపుదల భారం తప్పడం లేదన్నది తెలుస్తోంది. ఈ వాదనను బలపరుస్తూ పెంపుదల నోటీసుల్లో అభివృద్ధి పనులు అంతరాయం లేకుండా సాగించేందుకు టికెట్ల రేటు పెంపుదల చేస్తున్నట్లు పేర్కొనాలని చూస్తున్నట్లు సమాచారం. -
టిక్కెట్ల లెక్కలు... చక్రాల ట్రిక్కులు
ఫన్ ‘‘ఒరేయ్ చింటూ... అనులోమానుపాతానికి మంచి ఉదాహరణ చెప్పరా’’ అడిగారు టీచర్. ‘‘బస్సు పొడవు పెరిగిన కొద్దీ టికెట్ ధరా పెరుగుతుంది. అంటే మినీ బస్‌లో కంటే డీలక్స్లోనూ, దాని కంటే హైటెక్ బస్సులో టికెట్ ధర ఎక్కువ’’ అన్నాడు చింటూ. ‘‘ఇలాంటిదే మళ్లీ విలోమానుపాతానికి ఉదాహరణ చెప్పు’’ ‘‘వాహనానికి చక్రాలు తగ్గిన కొద్దీ రేటు పెరుగుతుంది. అంటే ఆరు చక్రాల బస్సు టికెట్ కంటే మూడు చక్రాల ఆటోకు ఫేర్ ఎక్కువ’’ చెప్పాడు చింటూ. ఇక ఆరుచక్రాల బస్సు టికెట్ ధర కంటే... అనేక చక్రాల రైలు టిక్కెట్టు ఇంకా చవక’’ చెప్పాడు చింటూ.