Adipurush Box Office Crash Makers Drop Ticket Prices for 3D Version - Sakshi
Sakshi News home page

Adipurush Movie: భారీగా తగ్గిన ఆదిపురుష్ టికెట్ల ధరలు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం!

Published Wed, Jun 21 2023 9:11 PM | Last Updated on Wed, Jun 21 2023 9:24 PM

Adipurush box office crash makers drop ticket prices for 3D version - Sakshi

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్  చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ  ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు.

(ఇది చదవండి: ఆదిపురుష్‌ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్‌’ సీత)

ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.  తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు.  

(ఇది చదవండి: చరణ్‌ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement