రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది.
ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు.
ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్‌లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment