యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు.
(ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్‌నెస్ ఏంట్రా బాబు!)
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్‌లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్‌డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
(ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్‌లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!)
Comments
Please login to add a commentAdd a comment