ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్‌గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్‌ఫ్లాప్‌గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.
ఆదిపురుష్‌పై ట్రోలింగ్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్‌ను ఏకిపడేశారు.
బానే ఆడింది
అయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.
నేను పట్టించుకోను
ఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్‌లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్‌లైన్‌లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్.
వారి ఇమేజ్ చెక్కుచెదరదు
వీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment