పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు.
(ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్‌లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? )
సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్‌క్లెయిమర్‌లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి.
ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్‌తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు.
సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు.
(ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు)
Comments
Please login to add a commentAdd a comment