Sunil Lahri, Ramayan's Lakshman shares his reaction after watching Adipurush - Sakshi
Sakshi News home page

Sunil Lahri: ఎంతో ఆశతో సినిమా చూసేందుకు వచ్చా.. కానీ: రామాయణ నటుడు

Published Thu, Jun 22 2023 12:29 PM | Last Updated on Thu, Jun 22 2023 1:35 PM

Sunil Lahri Lakshman in Ramayan, has reacted on Adipurush after watching - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. 

(ఇది చదవండి:  ‘ఆదిపురుష్‌’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?)

తాజాగా రామాయణం టీవీ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్‌ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.

సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్‌ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు.  సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.'  తెలిపారు. 

(ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement