ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు.
అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు.
(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!)
తాజాగా రామాయణం సీరియల్‌లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్‌లో దీపిక సీత పాత్ర పోషించింది.
దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది.
ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..)
Comments
Please login to add a commentAdd a comment