Adipurush Director Om Raut Post Gets Viral Comments on Instagram - Sakshi
Sakshi News home page

Om Raut: 'ఇంకా బతికే ఉన్నావా బ్రో?'.. ఓం రౌత్‌పై నెటిజన్స్ ఫైర్!

Jul 24 2023 9:22 PM | Updated on Jul 24 2023 9:28 PM

Adipurush Director Om Raut Post Gets Viral Comments In Instagram - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు.

(ఇది చదవండి: ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్‌ అరుదైన రికార్డ్!)

ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ రచయిత మనోజ్ ముంతశిర్ డైలాగ్స్ రాశారు. పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఆదిపురుష్‌ను రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అయితే సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటి పోవడంతో ఓం రౌత్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 

ఓం రౌత్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా. ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా.' అని పోస్ట్ చేశారు. 

అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. కొంతమంది రూ.600 కోట్లను ఆగం చేశావు కదా కామెంట్స్ చేయగా.. మరికొందరేమో అన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొకరు రాస్తూ దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు. 

(ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement