ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు! | Leo Movie Ticket Price 5 Thousand Rupees In Tamil Nadu Main Cities | Sakshi
Sakshi News home page

Leo Ticket Price: విజయ్ 'లియో'.. చూడాలంటే చాలా కాస్ట్‌లీ గురూ!

Published Sat, Oct 14 2023 5:00 PM | Last Updated on Sat, Oct 14 2023 6:04 PM

Leo Movie Ticket Price 5 Thousand Rupees In Tamil Nadu Main Cities - Sakshi

థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు అప్పటితో పోలిస్తే డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ స్టార్ హీరోల మూవీస్‌కి మాత్రం వేరే లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. అలా వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిలో తెలుగు-తమిళ ప్రేక్షకుల చాలా అంటే చాలా ఎదురుచూస్తున్న మూవీ 'లియో'. ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతోంది.

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!)

'లియో' సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడటానికి కారణం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 'విక్రమ్' సినిమాతో ఒక్కొక్కరిని అవాక్కయ్యేలా చేసిన ఇతడు.. ఈ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. అలానే 'LCU'తో దీనికి లింక్ ఉందని, ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని రూమర్స్ వల్ల ఎక్స్‪‌పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి.

ఇలా పలు కారణాల వల్ల 'లియో'పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు ఎంచుకున్నారు. అభిమానులు ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారని తెలిసి, ఏకంగా ఒక్కో టికెట్‌ని రూ.5 వేలకు అమ్ముతున్నారనట. తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన దగ్గర అంతంత టికెట్ ధరలు ఉండకపోవచ్చులే!

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement