సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలను రూ.5, 10, 15, 20, 25, 30కు మారుస్తూ హేతుబద్ధీకరించటంతో చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట లభిస్తుందని ఆర్టీసీ ఎన్‌ఎంయూ వెల్లడించింది. సోమవారం నుంచి దీన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి పేర్కొన్నారు. డిస్కంలకు ఉన్న రూ.12 వేల కోట్ల రుణాన్ని భరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీకి ఉన్న రూ.2,500 కోట్ల రుణాన్ని కూడా భరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment