నాగచైతన్య హీరోగా వస్తోన్న తండేల్ చిత్ర టికెట్ ధరలపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదని అన్నారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగామని తెలిపారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవని.. అంత బెనిఫిట్ కూడా వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.295, రూ. 395 టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయని అల్లు అరవింద్ తెలిపారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. అంత బెనిఫిట్ కూడా మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామని అడిగారు. కానీ నేను సినిమా చూశాక మనమే విడుదల చేద్దామని చెప్పా' అని అన్నారు.
కాగా.. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment