
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.999కే టికె ట్ అందిస్తోంది. జూన్ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుండగా.. జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ‘గతనెల్లో ఇచ్చిన ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి అద్భుత సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 4–రోజుల ప్రత్యేక వేసవి ఆఫర్‌ను ప్రకటించాం’ అని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment