సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్ | PVR Cinemas Exclusive Offer For Movie Tickets Only at Rs 99 only | Sakshi
Sakshi News home page

మల్టీప్లెక్స్‌లో రూ.99 కే సినిమా.. కేవలం ఆరోజు మాత్రమే..!

Published Tue, Jan 17 2023 9:40 PM | Last Updated on Tue, Jan 17 2023 9:43 PM

PVR Cinemas Exclusive Offer For Movie Tickets Only at Rs 99 only - Sakshi

మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్‌ సినిమాస్‌ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్‌ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది.

అయితే పంజాబ్‌ రాష్ట్రంలోని చండీగఢ్‌, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్‌ సినిమాలో ఈ ఆఫర్‌ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్‌ ధర రూ.100+ జీఎస్‌టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్‌టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్‌ ఈ ఆఫర్‌ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement