Cinema Day
-
దాదాపు 23 ఏళ్ల తర్వాత సినిమా ప్రదర్శన.. ఎక్కడంటే!
ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు గిరిజన తెగల మధ్య మొదలైన వివాదం హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే మణిపూర్ ఘర్షణల నుంచి మెల్లగా కోలుకుంటోంది. అయితే మణిపూర్‌లో 2000 సెప్టెంబర్‌లో హిందీ సినిమాలపై నిషేధం విధించారు. మైటీ తెగకు చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ అప్పట్లో బాలీవుడ్ సినిమాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. (ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) అయితే దాదాపు 23 ఏళ్ల తర్వాత హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు హిందీ సినిమాను ప్రదర్శించారు. విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రాన్ని చురచంద్‌పూర్‌లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించారు. మైటీ గ్రూపులు అవలంభిస్తున్న దేశ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని గిరిజన నాయకుల ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ ప్రకటనలో తెలిపారు. భారత్‌పై తమ ప్రేమను చాటేందుకు సినిమాను ప్రదర్శించామని అన్నారు. కాగా.. చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని అలపించారు. కాగా.. మణిపూర్‌లో చివరి హిందీ చిత్రం 1998లో కుచ్ కుచ్ హోతా హై ప్రదర్శించినట్లు హెచ్ఎస్ఏ వెల్లడించింది. (ఇది చదవండి: లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!) Uri: The Surgical Strike (2019) was screened in Churachandpur after more than 2 decades of Hindi movies ban in Manipur by VBIGs. pic.twitter.com/QpLvYTNiTT — Thongkholal Haokip (@th_robert) August 15, 2023 -
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్
మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్సైట్ చూడాలని సూచించింది. -
‘సినిమా డే’ ఉండాలి!
‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలా ‘సినిమా డే’ అని ఒక రోజుని కేటాయించాలి. ఆ రోజున చిత్రసీమలో ఉన్న 24 శాఖలకు సంబంధించినవాళ్లు ఒకే రకమైన దుస్తులు ధరించి, వేడుక చేసుకోవాలి’’ అని ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఈ ఇద్దరూ మాట్లాడుతూ - ‘‘ఫైటర్లుగా ఇండస్ట్రీకి వచ్చి, ఫైట్ మాస్టర్లుగా ఎదిగాం. ఎంతో ఇచ్చిన సినిమా పరిశ్రమకు ఏమిచ్చాం? అని ఆలోచించుకుంటే.. ఏమీ లేదనిపించింది. ఆ ఫీలింగ్లోంచి వచ్చిన ఆలోచనే ‘సినిమా డే’. కుల, మతాలకు అతీతంగా భాషా భేదం లేకుండా కళామతల్లి అందర్నీ ఆదరిస్తోంది. అలాంటి తల్లిని గౌరవించు కోవడం కోసం ప్రత్యేకంగా ఒక్క రోజు కూడా లేదు. అందుకే సినీ పెద్దలంద రూ ఆలోచించి ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.