ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope Telugu 19-01-2025 To 25-01-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Jan 19 2025 6:54 AM | Last Updated on Sun, Jan 19 2025 10:14 AM

Weekly Horoscope Telugu 19-01-2025 To 25-01-2025

మేషం 
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో  ధనవ్యయం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృషభం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని  విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం
ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో అందదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు. కళారంగం వారికి పర్యటనలు వాయిదా. వారం ప్రార ంభంలో ఉద్యోగలాభం. ఎరుపు, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

సింహం
మిత్రులే  శత్రువులుగా మారతారు. మీ సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. ఒక వివాద పరిష్కారంపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాల వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది.  వారం మధ్యలో శుభవార్తలు. ఉద్యోగయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య
సరికొత్త  ఆలోచనలతో ముందుకు సాగుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

తుల
చేపట్టిన  పనులు  ముందుకు సాగక నిరాశ చెందుతారు. రుణయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యసమస్యలు. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పదు. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒత్తిళ్ళు. పారిశ్రామిక వర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో వాహనయోగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. భూములు, ఆభరణాలు కొంటారు. ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మకరం
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తుల విషయంలో సోదరులతో మనస్పర్థలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం. నేరేడు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.

మీనం
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement