ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు గిరిజన తెగల మధ్య మొదలైన వివాదం హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే మణిపూర్ ఘర్షణల నుంచి మెల్లగా కోలుకుంటోంది. అయితే మణిపూర్‌లో 2000 సెప్టెంబర్‌లో హిందీ సినిమాలపై నిషేధం విధించారు. మైటీ తెగకు చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ అప్పట్లో బాలీవుడ్ సినిమాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.
(ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?)
అయితే దాదాపు 23 ఏళ్ల తర్వాత హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు హిందీ సినిమాను ప్రదర్శించారు. విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రాన్ని చురచంద్‌పూర్‌లోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శించారు. మైటీ గ్రూపులు అవలంభిస్తున్న దేశ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని గిరిజన నాయకుల ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ ప్రకటనలో తెలిపారు. భారత్‌పై తమ ప్రేమను చాటేందుకు సినిమాను ప్రదర్శించామని అన్నారు. కాగా.. చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని అలపించారు. కాగా.. మణిపూర్‌లో చివరి హిందీ చిత్రం 1998లో కుచ్ కుచ్ హోతా హై ప్రదర్శించినట్లు హెచ్‌ఎస్‌ఏ వెల్లడించింది.
(ఇది చదవండి: లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!)
Uri: The Surgical Strike (2019) was screened in Churachandpur after more than 2 decades of Hindi movies ban in Manipur by VBIGs. pic.twitter.com/QpLvYTNiTT
— Thongkholal Haokip (@th_robert) August 15, 2023
Comments
Please login to add a commentAdd a comment