Uri: The Surgical Strike
-
విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!
ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాలంటే కంటెంట్ తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాల్లో హీరో స్టార్ డమ్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం చూస్తుంటాం. మరికొన్ని సార్లు చిన్న సినిమా అయినా సరే కంటెంట్ వల్ల కాసుల వర్షం కురవాల్సిందే. కేవలం భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడమే కాదు.. కథ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. అలా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు చాలా తక్కువే ఉన్నాయి. వాటిలో దంగల్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, బాహుబలి-2, పఠాన్ అత్యధిక వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. (ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?) కానీ తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు కూడా చాలా తక్కువే. అందులో మొదట వినిపించే పేరు యూరి: ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన ఈ చిత్రం.. భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కథాంశంగా తెరకెక్కించారు. ఈ మూవీతో ఆదిత్య ధర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. విక్కీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్లో వార్, కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఇప్పుడు సౌత్‌పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !) విక్కీ మాట్లాడుతూ.. 'నేను మొదట ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత నటనలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో ఓ ప్రొడక్షన్ కంపెనీలో ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా మొదటి వేతనం నెలకు కేవలం రూ.1500 రూపాయలే. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది. బాంద్రా స్టేషన్లో కూర్చుని విక్కీ కౌశల్ అని ముద్రించిన రూ. 1,500 చెక్కును అలా చూస్తునే ఉన్నా.' అని చెప్పారు. ఇటీవలే జరా హాట్కే జరా బచ్కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్ జంటగా కనిపించింది. -
రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?
Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్‌తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్‌తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?) 2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్‌ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్‌ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిస్తే.. సారా అలీ ఖాన్‌తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. -
దాదాపు 23 ఏళ్ల తర్వాత సినిమా ప్రదర్శన.. ఎక్కడంటే!
ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు గిరిజన తెగల మధ్య మొదలైన వివాదం హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే మణిపూర్ ఘర్షణల నుంచి మెల్లగా కోలుకుంటోంది. అయితే మణిపూర్‌లో 2000 సెప్టెంబర్‌లో హిందీ సినిమాలపై నిషేధం విధించారు. మైటీ తెగకు చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ అప్పట్లో బాలీవుడ్ సినిమాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. (ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) అయితే దాదాపు 23 ఏళ్ల తర్వాత హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు హిందీ సినిమాను ప్రదర్శించారు. విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రాన్ని చురచంద్‌పూర్‌లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించారు. మైటీ గ్రూపులు అవలంభిస్తున్న దేశ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని గిరిజన నాయకుల ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ ప్రకటనలో తెలిపారు. భారత్‌పై తమ ప్రేమను చాటేందుకు సినిమాను ప్రదర్శించామని అన్నారు. కాగా.. చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని అలపించారు. కాగా.. మణిపూర్‌లో చివరి హిందీ చిత్రం 1998లో కుచ్ కుచ్ హోతా హై ప్రదర్శించినట్లు హెచ్ఎస్ఏ వెల్లడించింది. (ఇది చదవండి: లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!) Uri: The Surgical Strike (2019) was screened in Churachandpur after more than 2 decades of Hindi movies ban in Manipur by VBIGs. pic.twitter.com/QpLvYTNiTT — Thongkholal Haokip (@th_robert) August 15, 2023 -
'అశ్వథ్థామ'కు నో చెప్పిన అల్లు అర్జున్!
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న అల్లు అర్జున్ వైపు బాలీవుడ్ పరిశ్రమ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ సినిమాల ఎంపిక విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే షారుక్ ఖాన్ 'జవాన్'లో అవకాశం వచ్చినా బన్నీ తిరస్కరించాడు. తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా అల్లు అర్జున్ రిజక్ట్ చేశాడు. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' 2019లో బాలీవుడ్ నుంచి వచ్చిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమాతో ఆయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆయన సినిమాలో నటించేందుకు చాలా మంది హీరోలే క్యూ కట్టే రేంజ్‌కు చేరుకున్నాడు. దీంతో ఆయన నుంచి వస్తున్న ‘అమర్ అశ్వథ్థామ’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నటించమని విక్కీ కౌశల్‌కు ఆదిత్య ధర్ మొదటగా అడిగారట కానీ కొన్ని కారణాల వల్ల అతను నిరాకరించడంతో, ఈ ప్రతిపాదన రణ్వీర్ సింగ్‌కి వెళ్లింది. కానీ అతను కూడా వెనక్కి తగ్గాడంతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. 'అమర్ అశ్వథ్థామ'కు నో చెప్పిన బన్నీ ఈ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిన తర్వాత ఆయన ఆసక్తిగా ఉన్నా.. ఆ పాత్రలో నటించేందుకు బన్నీ సంకోచించాడట. అందుకోసం వారి ప్రతిపాదన గురించి ఆలోచించడానికి కొంత సమయం కూడా తీసుకున్నాడట. 'పుష్ప' సక్సెస్ తర్వాత 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉండటం ఒక కారణం అయితే.. ఈ సినిమాల్లో బన్నీ చేసిన క్యారెక్టర్ నుంచి ఒక్కసారిగా.. అశ్వథ్థామ అనే ఇతిహాసం కథలో తన పాత్రను తెరపై చూపించడం అంటే అది ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందోనని ఆయన ఆలోచించారట. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ ఆధారంగానే ఎక్కువగా సీన్లను తెరకెక్కించనున్నారని, ఇది ఒకరకంగా తన సినీ కెరీర్లో పెద్ద ఛాలెంజ్ అవుతుందని ఆయన భావించారట. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉన్న ఈ సినిమాలో నటించడం ఎందుకని చాలా ఆలోచించే 'అమర్ అశ్వథ్థామ' ప్రాజెక్ట్‌ను బన్నీ వదులుకున్నాడట. ఇదే విషయాన్ని ఆ సినిమా మేకర్స్‌కు అల్లు అర్జున్ తెలిపాడట. అట్లీ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ 'జవాన్'లో బన్నీకి ఒక పాత్ర ఆఫర్ వచ్చింది. పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైనది అయితే, 'పుష్ప 2' షూటింగ్ బిజీగా ఉన్నందున అట్లీ ఆఫర్‌ను బన్నీ తిరస్కరించాడు. పుష్ప 2 2024లో విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. -
రిపబ్లిక్ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!
రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.. వూట్ ► ఖడ్గం ► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం) అమెజాన్ ప్రైమ్ వీడియో ► భారతీయుడు ► సర్దార్ పాపారాయుడు ► రాజీ ► సర్దార్ ఉద్ధమ్ ► చక్‌దే ఇండియా ► మణికర్ణిక ► షేర్షా హాట్‌స్టార్ ► మంగళ్‌పాండే ► కంచె నెట్‌ఫ్లిక్స్ ► మేజర్ ► లగాన్ ► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ► స్వేడ్స్ ► రంగ్ దే బసంతి జీ5 ► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ► సుభాష్ చంద్రబోస్ ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. -
విడాకులపై స్పందించిన 'ఉరీ' నటుడు.. త్వరలోనే అది జరగనుంది..!
'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' నటుడు మోహిత్ రైనా దంపతులపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతని భార్య అదితి శర్మతో విడాకులపై గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు మోహిత్ రైనా స్పందించారు. ఆ రూమర్లను ఆయన కొట్టిపారేశారు. 'నా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నానని వెల్లడించారు. మోహిత్ రైనా, భార్య అదితి శర్మ విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1న అదితి శర్మతో తన పెళ్లిని ప్రకటించి మోహిత్ తన అభిమానులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఓ మీడియాకు వివరించారు. అయితే గతంలో మోహిత్ తన సోషల్ మీడియాలో అదితితో తన పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించిన తర్వాత రూమర్లు వచ్చాయి. అంతే కాకుండా మోహిత్, అదితి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడం విడాకులకు మరింత బలాన్ని చేకూర్చింది. మోహిత్ రైనా - అదితి శర్మల ప్రేమకథ: అదితి శర్మతో స్నేహం వల్లే మేమిద్దరం ఒక్కటైనట్లు మోహిత్ పేర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. కొవిడ్ (రెండో వేవ్)లో మోహిత్ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కాగా.. మోహిత్ టెలివిజన్ ధారావాహిక 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో లార్డ్ శివగా నటించారు. అతను 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్', 'షిద్దత్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలతో పాటు 'కాఫిర్', 'బౌకాల్', 'ముంబయి డైరీస్ 26/11' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రేమలో పడ్డా : హీరోయిన్
తన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ యామీ గౌతమ్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఉరి’ సినిమాతో ‘ఉత్తమ దర్శకుడి’గా జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య ధార్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. వీరిద్ద మధ్య ఉన్న లవ్ అఫైర్ గురించి మీడియాలో కథనాలు వచ్చిన స్పందిచకుండా, సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చారు. అప్పట్లో ఈ జంట పెళ్లి హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ, పెళ్లి గురించి మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా యామీ గౌతమ్ తన లవ్ స్టోరీని మీడియాతో పంచుకుంది. ‘ఉరి’సినిమా ప్రమోషన్స్ సమయంలోనే తాము ప్రేమలో పడిపోయినట్లు చెప్పింది. ఆదిత్య, నేను కలిసి ‘ఉరి’సినిమా చేశాం. ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సినిమా ప్రమోషన్ సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆదిత్యతో పరిచయం ఏర్పడకముందే అతనంటే నాకు గౌరవం ఉండేది. ఇతరుల పట్ల ఆయన మర్యాదగా వ్యవహరిస్తాడు. దర్శకుడిగా ఒత్తిడిలో ఉన్నాకూడా.. ఎదుటివారితో గౌరవంగా మాట్లాడుతాడు. ఆదిత్య చాలా మంచి వాడని అందరు చెబుతుంటే విన్నా.. అతనితో పరిచయం ఏర్పడ్డాక అది నిజమేనని భావించా. పని చేసే చోట అతని మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు. మా మధ్య పరస్పర గౌరవం ఉంది. ప్రేమపై ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో మంచి గుణం, అర్థం చేసుకునే హృదయం ఉండమే అసలైన ప్రేమ’అని యామీ గౌతమ్ తన లవ్‌స్టోరీ చెప్పుకొచ్చింది. అలాగే తమ ప్రేమ గురించి ఇండస్ట్రీలోని కొంతమంది స్నేహితులకు ముందే తెలుసని, కానీ వారు ఎక్కడా తమ గురించి చెప్పకుండా, ప్రైవసీ ఇచ్చారని చెప్పింది. ఇక గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘హంగులు, ఆర్భాటాలలో పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ఇష్టం లేదు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చాలా మంది స్నేహితులకు, సన్నిహితులకు పెళ్లి సమాచారం ఇవ్వలేకపోయాం. కానీ వారు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు తోడుగా నిలిచారు’అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. ఇక యామీ గౌతమ్ విషయానికొస్తే.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'విక్కీ డోనర్'తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో నటించింది. వీటితో పాటు తమిళ, పంజాబీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. దర్శకుడు ఆదిత్య ధార్ విషయానికి వస్తే.. కాబుల్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత హాల్ ఏ దిల్, వన్ టూ త్రీ, డాడీ కూల్, ఆక్రోష్, తేజ్ చిత్రాలకు లిరిక్ రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దర్శకుడిగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన ది ఇమ్మోరల్ ఆశ్వత్థామ చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
పవన్ సినిమా రీమేక్‌లో ‘యూరీ’ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాటమరాయుడు’. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వీరం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ బాలీవుడ్ రీమేక్‌లో ‘యూరీ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
‘యురి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఓ గుజరాతీ సినిమాలో నటిస్తున్న విక్కీ ఆ సినిమా షూటింగ్లో గాయాల పాలయ్యాడు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అనుకోకుండా ఓ భారీ డోర్ మీద పడటంతో విక్కీ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విక్కీ దవడ ఎముక విరిగింది. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తరువాత ఆయన్ను ముంబైకి తీసుకెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. విక్కీ కౌశల్‌కు పదమూడు కుట్లు పడినట్టుగా ఆయన తెలిపారు. భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుజరాతీ హారర్ మూవీ చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది. Vicky Kaushal gets injured while filming an action sequence... Shooting for director Bhanu Pratap Singh's horror film in #Gujarat... Vicky fractured his cheekbone and got 13 stitches on his cheek. — taran adarsh (@taran_adarsh) 20 April 2019 -
బాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
దశాబ్దకాలంగా బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీనియర్ నటుడు నవ్‌తేజ్ హుండల్ సోమవారం సాయంత్రం ముంబైలో మృతిచెందారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన వార్ డ్రామా ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో హోం మినిస్టర్ పాత్రలో నటించారు నవ్‌తేజ్. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. నవ్తేజ్కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కూతురు అవంతిక హుండల్ పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. నటించటం మాత్రమే కాదు నవ్‌తేజ్ నటనలో శిక్షణ కూడా ఇస్తుంటారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.