పవన్‌ సినిమా రీమేక్‌లో ‘యూరీ’ స్టార్‌ | Vicky Kaushal To Remake Katamarayudu In Bollywood | Sakshi
Sakshi News home page

పవన్‌ సినిమా రీమేక్‌లో ‘యూరీ’ స్టార్‌

Published Sat, Jun 8 2019 3:42 PM | Last Updated on Sat, Jun 8 2019 3:43 PM

Vicky Kaushal To Remake Katamarayudu In Bollywood - Sakshi

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాటమరాయుడు’. కోలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా ‘వీరం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో ‘యూరీ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్‌ హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ సాజిద్‌ నదియావాలా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement