Katamarayudu
-
శృతికి జాక్‌పాట్
నటి శృతీహాసన్ బ్రేక్‌ను బ్రేక్ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ వరుస పెట్టి చిత్రాలు చేసిన ఈ సంచలన హీరోయిన్ ఆ తరువాత సుమారు రెండేళ్లు తెరపై కనిపించలేదు. అంతే కాదు నటనకు బ్రేక్ ఇచ్చారు. తరచూ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారు. అయితే తాను సినిమాల్లో నటించకపోయినా ఖాళీగా లేనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తో కలిసి సంగీత ఆల్బమ్స్ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా మెరిశారు. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరిగా సింగం 3లో కనిపించారు. అదేవిధంగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటించారు. ఇక తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించిన శబాష్నాయుడులో నటించినా, ఆ చిత్రం మధ్యలోనూ ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిరాకరించారనే ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్ అయిన తరువాత ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు శృతి. కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ఒక చిత్రం, టాలీవుడ్లో రవితేజ్‌తో ఒక చిత్రం అంగీకరించారు. అవును ఈ అందాల భరిణి హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే జాక్‌పాట్‌ను కొట్టేసిందని తెలిసింది. ఒక హాలీవుడ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకె చెప్పారు శృతి. ప్రఖ్యాత లాసన్ బోర్మీ యూరనివర్స్ సంస్థ నిర్మించనున్న ట్రెడ్‌స్టోన్ సిరీస్‌లో శృతిహాసన్ నటించనున్నారు. ఈ సిరీస్‌లో ఢిల్లీలో ఒక హోటల్లో పని చేస్తూ ఇతర సమయాల్లో హత్యలు చేసే యువతిగా నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్ ప్రాంతంలో జరగనున్న ఈ సిరీస్ షూటింగ్లో త్వరలోనే శ్రుతిహాసన్ పాల్గొననున్నారు. మొత్తం మీద నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు ఆ బ్రేక్‌ను బ్రేక్ చేస్తున్నారన్న మాట. -
పవన్ సినిమా రీమేక్‌లో ‘యూరీ’ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాటమరాయుడు’. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వీరం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ బాలీవుడ్ రీమేక్‌లో ‘యూరీ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
‘కాటమరాయుడు’ ఎద్దు మృతి..
ఘంటసాలపాలెం(ఘంటసాల) : కాటమరాయుడు సినిమాలో నటించిన ఎద్దు గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాల గ్రామానికి చెందిన ఎన్నారై గొర్రెపాటి నవనీతకృష్ణ 2014లో రెండు ఎద్దులను కొని ఘంటసాలపాలేనికి చెందిన వేమూరి రాంబాబు ఆధ్వర్యంలో పెంచుతున్నారు. ఈ ఎద్దులు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎద్దుల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాయి. అంతేకాక కాటమరాయుడు సినిమాలో నటించడంతో వీటి ప్రాచుర్యం మరింత పెరిగింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఎద్దు గురువారం మరణించడంతో రైతులు తీవ్ర మనస్థాపం చెందారు. అంతే కాక ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ఎద్దు కాటమరాయుడు సినిమాతో పాటు సావిత్ర సీరియల్లో కూడా నటించింది. చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మూడు షెడ్యూల్ షూటింగ్లో కూడా పని చేసినట్లు రాంబాబు వివరించారు. -
కాటమరాయుడి కల్యాణం
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జరిగిన కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారికి పట్టువస్త్రాలు తెచ్చారు. కల్యాణ వేదిక ఎత్తులో ఉండటంతో సామాన్య భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని తనివితీరా తిలకించారు. పల్లకీపై విచ్చేసిన నారసింహుడు : యాగశాల నుంచి నవ వధువుల అలంకృతులై శ్రీదేవి, భూదేవిలతో పాటు వరుడు లక్ష్మీ నారసింహుడు పల్లకీలో రాత్రి 9 గంటల ప్రాంతంలో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ మం డపం చేరుకున్నారు. గోవింద నామస్మరణ మా ర్మోగింది. శ్రీవారి కల్యాణ విశిష్టతను టీటీడీ నుంచి వచ్చిన అర్చక పండితులు అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ముక్కోటి దేవతలు వీక్షించే ఈ కల్యాణోత్సవాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక పండితులు తెలియజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. దీంతో కాటమరాయుడి కళ్యాణం పూర్తయింది. అనంతరం భక్తులకు శ్రీవారి తలంబ్రాలు పంచారు. -
భారీ మార్కెట్ కోసం పవన్ ప్లాన్స్
సర్థార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో భారీ వసూళ్లు సాధించాలని భావిస్తోంది పవన్ టీం. అందుకే ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ త్రివిక్రమ్‌ల సినిమాను తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు భాషల్లో టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. టైటిల్స్ ఫైనల్ అయిన వెంటనే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇతర భాషల మీద దృష్టి పెడుతుండటంతో పవన్ కూడా అదే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాతో భారీ వసూళ్లు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. -
పవన్ మనసు మార్చుకున్నాడా..?
సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. కాటమరాయుడు రీమేక్ సినిమా కావటం, అది కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సినిమా కావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. దీంతో పవన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచనలో పడ్డాడు. కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో వేదలం రీమేక్‌ను మొదలు పెట్టాడు పవన్. ఆ తరువాత యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ పవన్ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయేది రీమేక్ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే ముందుగా సంతోష్ శ్రీనివాస్ సినిమానే మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు త్రివిక్రమ్ సినిమా తరువాత చేయాల్సిన వేదలం రీమేక్‌ను పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడట. కాటమరాయుడు రిజల్ట్‌తో పవన్ రీమేక్ సినిమాల జోలికి వెళ్లకపోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు. -
‘కాటమరాయుడు’పై దివ్యాంగుల ఆగ్రహం
- చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ బి.శైలజ హైదరాబాద్: దివ్యాంగుల మనోభావాలను కించపరిచినా, ప్రయత్నించినా.. అటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ హెచ్చరించారు. సోమవారం జోగులాంబ జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కలిసి ‘కాటమరాయుడు’ సినిమాలో వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. స్పందించిన డైరెక్టర్ శైలజ ‘కాటమరాయుడు’ సినిమా డైరెక్టర్‌ను విచారించి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు. కాటమరాయుడు సినిమా చూసి వివరాలు తనకు తెలియచేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటి మాట్లాడుతూ.. వెంటనే కాటమరాయుడు సినిమా నిలిపివేయాలని, దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల చిత్రీకరణను తొలగించాలని, సినిమా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో దివ్యాంగుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు కె.జయంతుడు, కార్యదర్శి నాగరాజు, పలువురు దివ్యాంగులు ఉన్నారు. -
పవన్ కళ్యాణ్‌కు సరైనోడు
కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమా లాంచనంగా ప్రారంభించగా.. ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా.., పవన్ సినీ కెరీర్‌తో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కథా కథనాలను సిద్ధం చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో పవన్‌కు ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆదిని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడైన ఆది, పలు స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ముఖ్యంగా సరైనోడు సినిమాలో ఆది చేసిన విలన్ పాత్ర హీరోతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పవన్‌కు విలన్‌గా ఆదినే సరైనోడని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే పవన్, త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించనున్నారు. -
నేను ఎప్పుడో చనిపోయా : వర్మ
కాటమరాయుడు సినిమా రిలీజ్ తరువాత మరోసారి ట్విట్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. కాటమరాయుడు సినిమా రిజల్ట్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని కూడా తనదైన స్టైల్ లో కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మపై పవన్ అభిమానలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. 'హటాత్తుగా మరణించిన రామ్ గోపాల్ వర్మ. సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు.. ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం' అనీ రాసున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం స్పందించిన వర్మ, మరోసారి తన మార్క్ ట్వీట్లతో పవన్ అభిమానులకు చురకలంటించాడు. 'లవ్ యు మై డియర్ స్వీట్ డార్లింగ్ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్. మీ అందరికీ నా బిగ్ హగ్' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్ ను గొర్రెలన్న వర్మ, 'నేను మూడు జన్మల ముందే చనిపోయాను. ప్రస్తుతం ఇక్కడ బతికున్న నేను దెయ్యాన్ని, దెయ్యాలు చనిపోవు, అవెప్పుడు చావులో బతికే ఉంటాయి అంటూ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ల పై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఇకపై రీమేక్స్‌చేయను!
‘‘హీరో ఇమేజ్ నుంచి అతణ్ణి మనం బయటకు తీయలేం. హీరోలను ఎంత కొత్తగా చూపించినా వాళ్ల ఇమేజ్ ఎక్కడో చోట పని చేస్తుంది. ‘దంగల్’లో ఆమిర్ ఖాన్, ‘సుల్తాన్’లో సల్మాన్ ఖాన్ ఇమేజ్ పని చేసింది కదా! పవన్ కల్యాణ్‌గారు అనే కాదు... ఏ కమర్షియల్ హీరో అయినా మాస్ డైలాగులు చెబుతూ, మీసం తిప్పాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కొత్త పాత్రలోకి హీరోని ఎంత బాగా మౌల్డ్ చేయగలిగారనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు కిశోర్ పార్ధసాని (డాలీ). పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ గత శుక్రవారం రిలీజైంది. సోమవారం మీడియా సమావేశంలో డాలీ చెప్పిన విశేషాలు ⇒ పవన్‌కల్యాణ్‌గారు గత సినిమాల్లో కంటే... ‘కాటమరాయుడు’లో కొత్తగా కనిపించారని, ఇప్పటివరకూ ఆయన్ని అలాంటి పాత్ర, సన్నివేశాల్లో చూడలేదనీ ప్రేక్షకులు అంటున్నారు. కల్యాణ్‌గారి ఇమేజ్‌కి సినిమా అంతా పంచెకట్టు అంటే భయం వేసింది. కానీ, ఫస్ట్ డే షూటింగ్లో ఆయన్ను చూడగానే తప్పకుండా వర్కౌట్ అవుతుందనుకున్నాం. అందుకే ఓ ఫైట్‌ను పంచెకట్టులో డిజైన్ చేశాం. ⇒ ‘గోపాల గోపాల’ తర్వాత కల్యాణ్‌గారు నాతో సినిమా చేస్తానన్నారు. ఓ కథ రాసి, చెప్పా. ఆ సినిమా డైలాగ్ వెర్షన్ కంప్లీట్ కావడానికి నాలుగైదు నెలలు పడుతుందనగా... ఆయనే పిలిచి ఈ ఛాన్స్ ఇచ్చారు. ‘వీరమ్’ పాయింట్, కమర్షియల్ అంశాలు నచ్చాయి. అమ్మాయిలను ద్వేషించే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ ఆసక్తిగా అనిపించింది. తెలుగులో ఆ ప్రేమకథను ఎక్కువ ఎలివేట్ చేశాం. ప్రేక్షకులూ కల్యాణ్‌గారిని అలానే చూడాలనుకుంటున్నారు. కథపై క్లారిటీతో ఉంటే ఏ హీరో అయినా... దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తారు. అమితాబ్ బచ్చన్, పవన్‌కల్యాణ్ ఎవరైనా! ‘గోపాల గోపాల’కు ముందు కల్యాణ్‌గారు మూడీ అనీ, దర్శకుడికి ఫ్రీడమ్ ఇవ్వరనీ నేనూ విన్నాను. కానీ, ఆయనతో పని చేయడం నాకు నచ్చింది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. హి ఈజ్ వెరీ కూల్. ⇒ ఫారిన్లో తీసిన పాటల్లో శ్రుతీహాసన్ కాస్ట్యూమ్స్, లుక్స్‌పై విమర్శలు వస్తున్నాయని ఆయన్ను అడగ్గా ‘‘ఆమె బాగా నటించారు. ముఖ్యంగా రెండు పాటల్లో శ్రుతి కాస్ట్యూమ్స్‌పై మా అభిప్రాయమూ అదే. ముంబయ్ డిజైనర్లు వాటిని డిజైన్ చేశారు. జాగ్రత్తపడే లోపే పరిస్థితి చేయి దాటింది’’ అన్నారు. ⇒ స్ట్రయిట్ సినిమా తీసినా... హాలీవుడ్ సినిమా లేదా ఎక్కడో చోటనుంచి కొందరు స్ఫూర్తి పొందుతారు. రీమేక్ సినిమా కూడా అంతే. మక్కీ టు మక్కీ రీమేక్ చేయడం నాకిష్టం లేదు. రీమేక్‌లో కథ తీసుకుని ఫ్రెష్ స్క్రిప్ట్ చేస్తా. ఈ సినిమాలో ఫస్టాఫ్ మాగ్జిమమ్ మార్చేశా. ఇప్పటికే మూడు రీమేక్స్ చేశా. ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు. ⇒ ఈ సినిమాకి జరిగినంత పైరసీ గతంలో ఏ సినిమాకీ జరగలేదనుకుంట! ఫేస్బుక్ చూస్తే దారుణంగా సినిమాలో అన్ని క్లిప్స్ పోస్ట్ చేశారు. మన దేశంలో మేజర్ ఎంటర్టైన్మెంట్ సినిమానే. అలాంటి ఎంటర్టైన్మెంట్ను దయచేసి చంపకండి. సోషల్ మీడియాలో సీన్స్ చూడడం వల్ల సినిమా చూసేటప్పుడు అందులోని బ్యూటీ మాయమవుతుంది. సైబర్ క్రైమ్‌లో పైరసీపై మేం కంప్లైంట్ చేశాం. పైరసీ చేసినోళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. -
పవన్ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, కాటమరాయుడు సినిమా నిర్మాత శరత్ మరార్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. పవన్ తాజా సినిమా కాటమరాయుడును చూసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ద్వారా చేనేత వస్త్రాలకు బాగా ప్రాచుర్యం కల్పించారని ప్రశంసించారు. పవన్‌తో కలిసున్న ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరూ ఎప్పుడు కలిశారన్న విషయం తెలియరాలేదు. కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ శరత్ మరార్ రిప్లై ఇచ్చారు. కాటమరాయుడు సినిమాలో పవన్ పంచెకట్టు, ఖద్దరు దుస్తులతో కనిపిస్తారు. అంతేగాక చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ఇటీవల పవన్ ప్రకటించారు. కేటీఆర్ కూడా తెలంగాణలో చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ నటి సమంతను చేనేత ప్రచారకర్తగా నియమించింది. Watched @PawanKalyan KatamaRayudu. You have a sure winner Kalyan & @sharrath_marar Appreciate the subtle but strong promotion of Handlooms -
శ్రుతి డబుల్ హ్యాట్రిక్
ఇవాళ ఒక్క హిట్టే గగనంగా మారుతుంటే, హిట్ తరువాత హిట్ సాధించడం అన్నది సాధారణ విషయం కాదు.అలా హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం విశేషం అవుతుంది. ఇక నటి శ్రుతీహాసన్ విషయానికొస్తే ఈ బ్యూటీ విజయపరంపర కొనసాగుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న శ్రుతి ఒక్క తెలుగు భాషలోనే వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్గా రికార్డు సాధించారు. ఇటీవల ప్రేమమ్, సింగం–3, ఇటీవల విడుదలైన కాటమరాయుడు చిత్రాలతో రెండవ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్ నటిగా పేరు తెచ్చుకుంటున్న శ్రుతీహాసన్‌కు తెలుగులో తొలి విజయాన్ని పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో అందుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మడికి కేరీర్ పరంగా వెనుక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రెండవ సారి పవన్‌కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు చిత్రం శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని శ్రుతీ వర్గాలు పేర్కొన్నారు. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని, శ్రుతీహసన్ 2017 సాధించిన రెండవ విజయం ఇదని పేర్కొన్నారు. శ్రుతీహాసన్ బహుభాషా నటి కావడంతో దక్షిణాదిలో నటించిన చిత్రాలు హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నాయని, అదే విధంగా హిందీ చిత్రాలు దక్షిణాదిలోనే సక్సెస్ అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే సౌత్ బాక్సాఫీస్ హీరోయిన్గా ఎదిగిన శ్రుతీ తదుపరి సంఘమిత్ర అనే భారీ త్రిభాషా చిత్రంలో నటించనున్నారని తెలిపారు. సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఈ చిత్రం తన కేరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. -
కూతురి బర్త్‌డే వేడుకలో పవన్
హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన చిన్న కూతురి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో నిరంతరం బిజీగా ఉండే పవన్.. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని, వారి చిన్ని చిన్ని సంతోషాలను తీరుస్తారని మరోసారి రుజువైంది. పవన్, అన్నా లెజ్నోవాల కూతురు పొలెనా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, తన స్నేహితుల మధ్య పొలెనా కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది. తల్లిదండ్రులు పవన్, అన్నా లెజ్నోవాలు చెబుతుండగా కేక్ కట్ చేసింది. చిన్నారి పొలెనాకు ఇది 5వ జన్మదిన వేడుక అని క్యాండిల్ పై ఉంది. ఈ సందర్భంగా చిన్నారి పొలెనా దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మెగా అభిమానులు ఈ ఈవెంట్ వివరాలను రీట్వీట్ చేస్తున్నారు. ఈ వేడుక మాత్రం ఇటీవలే జరిగనట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ నటించిన 'కాటమరాయుడు' నిన్న (శుక్రవారం) విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. -
పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..!
సాధారణంగా స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం రెండు వారాల పాటు, కాస్త హైప్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసించరు. అదే, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే మూడు వారాల పాటు మరో సినిమాకు ఛాన్స్ ఉండదు. కానీ కాటమరాయుడు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కాటమరాయుడు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాడు. అయినా సరే వచ్చే వారం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమాను ముందుగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కాటమరాయుడు రిలీజ్ తరువాత సినిమాను ప్రీపోన్ చేస్తూ మార్చి 31నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూరి దర్శకత్వంలో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. నయనతార లీడ్ రోల్లో నటించిన డోరతో పాటు చిన్న సినిమాలు కారులో షికారుకెల్తే, ఎంతవరకు ఈ ప్రేమ కూడా 31నే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.పవన్ సినిమా కాటమరాయుడు మంచి టాక్‌తో దూసుకుపోతున్నా వారం గ్యాప్‌లో ఇన్ని సినిమాలు రిలీజ్ రెడీ అవ్వటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
కూతురి పుట్టిన రోజుకి పవన్
సినిమా రాజకీయాలతో ఎప్పుడు బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అందుకే కాటమరాయుడు సినిమా రిలీజ్ బిజీలో ఉండి కూడా కూతురు ఆద్య బర్త్‌డే సందర్భంగా ఆమెతో సమయం గడిపి వచ్చాడు. గురువారం ఆద్య పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్‌తో కలిసి కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆద్య స్కూల్ ఓ జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించిన రేణు, ' పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి. వారి పుట్టిన రోజున కాస్త సమయమే' అంటూ ట్వీట్ చేసింది. రేణుతో విడాకులు తీసుకున్న తరువాత కూడా పవన్ పిల్లల కోసం రెగ్యులర్ గా వారిని కలుస్తూ, వారి బాగోగులు చూసుకుంటున్నాడు. True gift parents can give their kids is, their time, on their birthday ❤ pic.twitter.com/n6G6c5V7oR — renu (@renuudesai) 24 March 2017 -
'కాటమరాయుడు' మూవీ రివ్యూ
టైటిల్ : కాటమరాయుడు జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అలీ, తరుణ్ అరోరా, నాజర్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) నిర్మాత : శరత్ మరార్ సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరోసారి అభిమానుల్లో జోష్ నింపేందుకు కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్ హీరోగా తెలుగులోనూ రిలీజ్ అయిన వీరుడొక్కడే సినిమాను కేవలం పవన్ ఇమేజ్ ను నమ్ముకొని రీమేక్ చేశారు. ఫ్యాన్స్ తన నుంచి ఆశించే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు తన పొలిటికల్ మైలేజ్ కు కావాల్సిన అంశాలతో ఈ సినిమాలో ఉన్నాయన్న నమ్మకంతో పవన్ చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది. కథ : కాటమరాయుడు(పవన్ కళ్యాణ్) రాయలసీమ ప్రాంతంలోని ఓ ఊళ్లో తిరుగులేని నాయకుడు. తప్పు జరిగితే ఎంతటి వాడినైన ఎదిరించటం, మాట వినకపోతే తాట తీసేయటం రాయుడికి అలవాటు. చిన్నప్పుడే ప్రేమ విఫలమవ్వటంతో అమ్మాయిలంటే ద్వేశించే రాయుడు, తనతో పాటు తన నలుగురు తమ్ముళ్లకు పెళ్లి చేయకుండా అలాగే ఉంచేస్తాడు. అప్పటికే ప్రేమలో పడ్డ కాటమరాయుడి తమ్ముళ్లు.. అన్నయ్య ప్రేమలో పడితేగాని తమకు పెళ్లిల్లు కావని ఎలాగైన రాయుడ్ని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు. లాయర్ లింగ(అలీ)తో కలిసి అవంతిక(శృతిహాసన్)ను కాటమరాయుడికి దగ్గర చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో కాటమరాయుడికి గొడవలంటే అసలు పడదని, పక్షులు, జంతువులను కూడా ప్రేమించేంత గొప్ప మనసని చెప్పి అవంతికకు, రాయుడి మీద ప్రేమ పుట్టేలా చేస్తారు. అవంతికతో కలిసి వాళ్ల ఊరికి బయలుదేరిన రాయుడి మీద ట్రైన్ లో ఎటాక్ జరుగుతుంది. ఈ గొడవలో రాయుడు ఎలాంటి వాడో తెలుసుకున్న అవంతిక అతన్ని కాదని వెళ్లిపోతుంది. (కాటమరాయుడు ఎలా ఉందో తెలుసా..!) కానీ అవంతిక కోసం అన్ని వదులుకున్న రాయుడు ఎలాగైన అవంతిక ప్రేమను గెలుచుకోవాలని వాళ్ల ఊరికి వెళతాడు. తన మంచితనంతో వాళ్ల కుటుంబానికి దగ్గరవుతాడు. ఈ సమయంలోనే ట్రైన్ లో జరిగిన ఎటాక్ తన మీద కాదు అవంతిక కుటుంబం మీద అని తెలుసుకుంటాడు. అసలు అవంతిక కుటుంబం మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్ల బారినుంచి అవంతిక కుటుంబాన్ని రాయుడు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిమానులకు విందుభోజనం లాంటి సినిమాను అందించాడు. హీరోయిజం, యాక్షన్, తో పాటు తన మార్క్ రొమాంటిక్ కామెడీని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా అంతా వన్మన్ షోలా అంతా తానే అయి నడిపించి సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాడు. కేవలం పవన్ ఇమేజ్, నటన మూలంగానే సినిమాతో చూస్తున్నప్పుడు ఇది తెలిసిన కథే అన్న ఆలోచనే రాలేదేమో అనిపిస్తుంది. హీరోయిన్ గా శృతిహాసన్ పరవాలేదనిపించింది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాతో లుక్స్ పరంగా నిరాశపరిచింది. విలన్ గా తరుణ్ అరోరా చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. రావు రామేష్ చేసిన పాత్ర విలనిజంతో పాటు మంచి కామెడీనీ పండించింది. లుక్ తో పాటు డైలాగ్ డెలివరీలోనే కొత్త దనం చూపించిన రావూ రమేష్ మరోసారి తనమార్క్ చూపించాడు. లాయర్ పాత్రలో అలీ పండించిన కామెడీతో పాటు సెకండాఫ్ లో పృథ్వీ చేసిన సీన్స్ ఆకట్టుకుంటాయి. పవన్ తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, చైతన్య కృష్ణ, కమల్ కామరాజులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కథను మరోసారి పవన్ లాంటి స్టార్ తో రీమేక్ చేయటం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసం చేసిన దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ) మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా పవన్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ తన సంగీతంతో పర్వాలేనిపించాడు. పవన్ ఇమేజ్ ను చాలా బాగా ఎలివేట్ చేసిన అనూప్, ఇతర సన్నివేశాల్లో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.మిరా మిరా మీసం, లాగే లాగే తప్ప మిగతా పాటలు పవన్ గత సినిమాలో స్థాయిలో లేవు. ముఖ్యంగా ఫారిన్ లోకేషన్స్ లో తీసిన రెండు పాటలు విజువల్ గా కూడా నిరాశపరిచాయి. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్ రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : పవన్ కళ్యాణ్ రొమాంటిక్ సీన్స్ మైనస్ పాయింట్స్ : తెలిసిన కథ ఫారిన్ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్ కాటమరాయుడు.. పవర్ స్టార్ అభిమానులకు పండుగ లాంటి సినిమా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
కాటమరాయుడు ఎలా ఉందో తెలుసా..!
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' సందడి అప్పుడే మొదలైంది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు అభిమానులతో పాటు విదేశాలలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు ఈ మూవీ ఆశించినంత వినోదం పంచడం ఖాయమనిపిస్తోంది. పవన్ పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్సే ఇప్పుడు మూవీకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మెగా ఫ్యామిలీ అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు స్టార్ట్ చేయగా.. మరోవైపు కువైట్, మస్కట్లలో ఇప్పటికే షో పూర్తయింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్లో స్పందిస్తున్నారు. పవర్ స్టార్ వన్ మ్యాన్ షో చేశారని, అత్తారింటికి దారేది తర్వాత మరో మెగా హిట్ పవన్ సొంతమని టాక్ వినిపిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సర్దార్ గబ్బర్‌సింగ్‌తో నిరాశచెందిన ఫ్యాన్స్.. కాటమరాయుడుతో పవన్ ఆ లోటు భర్తీ చేశాడని అంటున్నారు. బాక్సాఫీసు బద్ధలవుతుందని, బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌కు కామెడీ ప్లస్ పాయింట్ అని, క్లైమాక్స్‌లో అన్నదమ్ముళ్ల మధ్య వచ్చే ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లను దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేశారని.. ఓవరాల్‌గా పవన్ ఖాతాలో మరో హిట్ చేరిందన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ శ్రుతిహాసన్‌తో గబ్బర్‌సింగ్ తరహాలో కాకున్నా.. ఓ మాదిరి లవ్ ట్రాక్ ను రన్ చూపించారు. తమిళ మూవీ వీరమ్‌ను తెలుగులో తీసినప్పటికీ పవన్‌కు అనుగుణంగా స్పెషల్‌గా క్యారెక్టర్ ను తీర్చిదిద్దాడని అంటున్నారు. కాటమరాయుడుహంగామా అనే హ్యాష్ ట్యాగ్‌తో మూవీ అప్డేట్స్ను ఫ్యాన్స్ ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారు. -
'లూటీ చేయడమే పవన్ సిద్ధాంతం'
వందకోట్ల కలెక్షన్ క్లబ్లో చేరేందుకు జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదలైన మొదటి రెండు వారాలకు టిక్కె ట్ రేట్లు పెంచి పేక్షకులను రూ. 300 కోట్లు దోపిడీ చేసేందుకు పథకం పన్నారని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం ఆరోపించింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జి.ఎల్. నర్సింహ్మారావు, సినీహీరోల సంఘాల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచందర్రావు, సుధాకర్ మాట్లాడుతూ ప్రాణాల కన్నా మిన్నగా అభిమానించే ప్రేక్షకులను రూ. 10 నేల టిక్కెట్టు రూ.50, రూ.50 బాల్కనీ టిక్కెట్టు రూ.200లకు పెంచి దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వాలు మద్దతు పలకడం దారుణమన్నారు. హీరోగా ప్రజలను దోచుకునే జనసేన అధ్యక్షుడు, ప్రజాసేవ పేరుతో ప్ర జల్లోకి ఎలా వస్తాడని వారు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులను వక్రీకరించి అదే హైకోర్టు ద్వారా అక్రమంగా నేల టిక్కెట్టు పెంచేసి అక్రమంగా కోర్టు ఉత్తర్వులు పొంది దోపిడికి రాజమార్గం వేసుకున్నారన్నారు. ప్రేక్షకులు కాటమరాయుడు సినిమాను మొదటి రెండువారాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ టిక్కెటు కొన్నా దానిని జాగ్రత్తగా పెట్టుకుంటే సంబంధిత చిత్ర యూనిట్‌పై కేసులు వేసి టిక్కెట్టు డబ్బులు వసూలు చేస్తామన్నారు. ప్రజలను దోపిడీ చేసే సినిమాలను బహిష్కరించాలని కోరారు. ఈ అక్రమ దోపిడిపై సినీపెద్దలు, ‘మా’సంఘం, హీరోలు స్పందించకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
పవన్.. ఆ సినిమా చేస్తాడా..?
ఈ శుక్రవారం కాటమరాయుడుగా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు మరో రీమేక్ చేసేందుకు పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాను కందరీగ, రభస సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అయితే తేరి సినిమా పోలీస్ పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమాను పవన్ రీమేక్ చేసే సాహసం చేస్తాడా..? అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం పవన్ చేసిన కాటమరాయుడు కూడా రీమేక్ సినిమానే. అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాకు రీమేక్ ఇది. వీరం కూడా తెలుగు వీరుడొక్కడే పేరుతో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాను రీమేక్ చేసిన పవన్, మరోసారి తేరి సినిమా రీమేక్ లోనూ నటిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తేరీ రీమేక్‌పై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
కాటమరాయుడు సినిమాపై కాంట్రవర్సీ
-
బాబాయ్ ట్రైలర్‌పై అబ్బాయ్ కామెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో శనివారం రిలీజ్ చేశారు. అభిమానుల మెచ్చే అన్ని అంశాలతో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌పై స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్‌లో కాటమరాయుడు ట్రైలర్ లింక్‌ను పోస్ట్ చేసిన చెర్రీ.. 'పవర్ ప్యాక్డ్ సెలబ్రేషన్‌లా ఉంది.. మన అందరి కాటమరాయుడు మార్చి 24 నుంచి థియేటర్లలో' అంటూ కామెంట్ చేశాడు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరినీ ఆహ్వానించని నేపథ్యంలో పవన్‌పై విమర్శలు వినిపించాయి. అయితే వేదిక మీద చిరును ఉద్దేశించి 'అన్నయ్యే అసలైన హీరో.. నేను కాదు' అంటూ మెగా అభిమానులలో జోష్ నింపాడు పవర్ స్టార్. ప్రస్తుతం రామ్ చరణ్ కాటమరాయుడు ట్రైలర్ పై స్పందించటం కూడా మెగా అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది. -
నా దృష్టిలో అన్నయ్యే హీరో... నేను కాదు! : పవన్ కల్యాణ్
‘‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. టెక్నీషియన్ అవుదామనుకున్నా. హీరో అవుతాననే నమ్మకం లేదు. తోట పని కావొచ్చు... వీధులు ఊడ్చే పని కావొచ్చు... ఏ పనైనా నిస్సిగ్గుగా, గర్వంగా, నిజాయితీగా చేస్తా. సినిమాలు భగవంతుడు ఇచ్చిన భిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, కష్టపడాలో ఇన్నేళ్లూ అంతే కష్టపడ్డాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజాయితీగా చేస్తా’’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన హీరోగా కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రీ–రిలీజ్ వేడుక శనివారం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ నచ్చింది. ప్రేక్షకుడిలా థియేటర్లో సినిమా చూస్తా. చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి... ఇటువైపు వెళ్లమని చెయ్యి చూపిస్తే... అక్కడ ఏముందని ఆలోచించకుండా జనం పరిగెత్తే ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి... ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తారు. అలాంటి ఒక్కడి పేరు (పవన్‌కల్యాణ్) మీకు తెలుసు. నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు. ఇది (పవన్) నిలువెత్తు మంచితనం’’ అన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘నా ఉద్దేశంలో చిరంజీవిగారే హీరో, నేను కాదు. ‘సుస్వాగతం’ పెద్ద హిటై్టన తర్వాత కర్నూల్లో ఫంక్షన్‌కి పిలిచారు. (కాటమరాయుడు ప్రీ–రిలీజ్ ఫోటోలు) వెళ్లకపోతే పొగరనుకుంటారని వెళ్లా. ఐదు కిలోమీటర్లు ర్యాలీగా తీసుకువెళతామన్నారు. ‘అన్నయ్యను చూడడానికి వస్తారు. నన్నెవరు చూస్తారు’ అన్నా. హోటల్ బయట రోడ్ల పై విపరీతమైన జనం. ప్రేమతో చేతులు ఊపుతున్నారు. నేను చేతులు జోడించి నమస్కరించా. నా జీవితంలో నేను నేర్చుకున్నవి లేదా అర్థం చేసుకున్నవి కావొచ్చు... నా సినిమాల్లో వచ్చాయి. అది యాదృచ్ఛికమో.. యాక్సిడెంటో.. నాకు తెలీదు. ‘సుస్వాగతం’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చాను. ఆ సీన్ 40 టేకులు చేశా. అది చేసిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయా. నిజంగా నా తండ్రి చనిపోతే నేనింక ఏడుస్తానా? అనిపించింది. ‘జల్సా’ చేసే టైమ్‌లో మా నాన్నగారు చనిపోతే... నాకు ఏడుపు రాలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు. నేను మొదట్నుంచీ ‘మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. అది మన యువతీ యువకుల్లో ఉన్న శక్తి. ‘నువ్వు ఇది చేయలేవు. నీవల్ల కాదు’ అనే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం ‘తమ్ముడు’ సినిమా. ‘ఖుషి’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు హైటెక్ సిటీ థియేటర్లో మా టీమ్‌తో కలసి సినిమా చూస్తున్నప్పుడు.. ‘రాబోయే కొన్ని సంవత్సరాలు నీకు గడ్డుకాలం ఉంటుంది. చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి’ అనే భావన కలిగింది. మనసు కీడు శంకించింది. నీరసం, బాధ వచ్చేశాయి. ఆ రోజు కోల్పోయిన శక్తి ‘గబ్బర్‌సింగ్’లో పోలీస్ స్టేషన్ సీన్ చేసేవరకూ పుంజుకోలేకపోయా. అప్పటివరకూ భగవంతుడిని యాచించా. నేనెప్పుడూ తమ్ముణ్ణే. నా జీవితంలో ఎవరికీ అన్నయ్యను కాదు. అలాంటిది మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యా. ప్రతి సినిమా కష్టపడి చేస్తా. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకుంటా’’ అన్నారు. శరత్ మరార్ మాట్లాడుతూ – ‘‘మా టీమ్ లీడర్ కాటమరాయుడే (పవన్). కల్యాణ్‌గారు హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లినప్పుడు సూట్లో హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇప్పుడీ పంచెకట్టులో డబుల్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారికి ఒక్క సినిమా అయినా చేస్తానో లేదో అనుకున్నా. కానీ, రెండో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు’’ అన్నారు అనూప్ రూబెన్స్. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్య ట్రైలర్ చూస్తుంటే నేనే తీశానా? అనిపిస్తోంది. ‘గోపాల గోపాల’ అప్పుడు కల్యాణ్‌గారితో ఫుల్ సినిమా చేయాలనిపించింది. ఇప్పుడీ సినిమా చేశా క ఐదారు సినిమాలు చేస్తే గానీ నా దాహం తీరేలా లేదు’’ అన్నారు. -
న్యాయం జరిగే వరకూ దీక్ష
‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులు కొని సుమారు రెండు కోట్ల రూపాయలు నష్టపోయా. అప్పుడు నాకు ‘కాటమరాయుడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తామని నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ హామీ ఇచ్చి, ఇప్పుడు ఇవ్వడం లేదు’’ అని ఆ సినిమా డిస్టిబ్య్రూటర్ సంపత్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ వద్ద శుక్రవారం ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిట్ అవుతుంది, నీకేం భయం లేదంటూ మాయ మాటలు చెప్పి అధిక ధరకు కృష్ణాజిల్లా పంపిణీ హక్కులు కొనిపించి, నన్ను రోడ్డున పడేశారు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ‘కాటమరాయుడు’ సినిమా పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు వేరే డిస్టిబ్య్రూటర్‌కు ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌గారి దృష్టికి తీసుకెళదామనుకుంటే, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయన జోక్యం చేసుకుని నాకు పంపిణీ హక్కులు ఇవ్వాలి. లేకుంటే, దీక్ష విరమించేది లేదు’’ అన్నారు. -
‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ మరోసారి దీక్షకు దిగాడు. అతడు శుక్రవారం ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తమకు నష్టం వచ్చిందని, దీనిపై నిర్మాత శరత్ మరార్... కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కాటమరాయుడు చిత్ర హక్కులను తక్కువ ధరకు ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చారని సంపత్ అన్నారు. అయితే వేరే డిస్ట్రిబ్యూటర్‌కు అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్ ఆరోపించారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకూ తన దీక్ష విరమించేది లేదని సంపత్ కుమార్ స్పష్టం చేశాడు. కాగా ఈ నెల 24 న కాటమరాయుడు విడుదల కానున్న నేపథ్యంలో సంపత్ కుమార్ నిరాహార దీక్ష టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను సంపత్ కుమార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, పవన్ కల్యాణ్ శ్రీనివాస్ తనను కలవనివ్వడం లేదని గతంలో సంపత్ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
కాటమరాయుడు నాలుగో సాంగ్ రిలీజ్
-
కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ బృందం బుధవారం ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు ఉండనుందట. ప్రస్తుతం టాలీవుడ్లో కాటమరాయుడు ఫీవర్ నడుస్తోంది. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వెలువడుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. కాటమరాయుడు చిత్రంలో పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ఆన్లైన్లో వ్యూస్ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే రోజున థియట్రికల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. -
సీమ టు సాఫ్ట్వేర్!
రాయలసీమ నుంచి రావడమే ఆలస్యం హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో పవన్‌కల్యాణ్ జాయిన్ కానున్నారట! పవన్‌కు సాఫ్ట్వేర్ జాబ్ అవసరం ఏముంది? అని ఆలోచిస్తున్నారా! ఆయనలోని హీరోకి అవసరమే మరి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. అందులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఐటీ ఎనలిస్ట్‌గా పవన్ కనిపిస్తారట! ఏప్రిల్ తొలి వారంలో త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ‘కాటమరాయుడు’లో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పంచెకట్టులో ఆయన లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ఈ లుక్‌కి పూర్తి భిన్నంగా త్రివిక్రమ్ సినిమాలో లుక్ ఉంటుందట. సై్టలిష్ అండ్ ట్రెండీగా కనిపిస్తారట. డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 18న నిర్వహించి, 24న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. -
దుమ్మురేపుతున్న కాటమరాయుడు బిజినెస్!
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ చిత్రం 'వీరం' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ఆన్లైన్లో వ్యూస్ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. కాటమరాయుడు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఈ సినిమా ప్రి-రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తిరేపుతున్నాయి. రికార్డుస్థాయిలో ఈ సినిమాకు ప్రి-రిలీజ్ బిజినెస్ చేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక లెక్కలు తెలియకపోయినా.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కాటమరాయుడు మొత్తంగా వందకోట్లకుపైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం ప్రాంతాలవారీగా కాటమరాయుడి ప్రిబిజినెస్ ఇలా ఉంది... నిజాం: రూ.18 కోట్లు సిడెడ్: రూ.11.70 కోట్లు యూఏ: రూ8.10 కోట్లు గుంటూరు: రూ.6 కోట్లు ఈస్ట్: రూ. 5.85 కోట్లు వెస్ట్: రూ. 4.60 కోట్లు కృష్ణ: రూ. 4.60 కోట్లు నెల్లూరు: రూ. 2.65 కోట్లు కర్ణాటక + తమిళనాడు+ ఆర్వోఐ: రూ .9 కోట్లు విదేశీ మార్కెట్: రూ 11.50 కోట్లు మొత్తంగా థియేట్రికల్ బిజినెస్: రూ. 82 కోట్లు కాగా.. శాటిలైట్ హక్కులు: రూ 12.50 కోట్లు ఆడియో+ హిందీ డబ్ శాటిలైట్ + డిజిటల్: సుమారుగా రూ .7.5 కోట్లు మొత్తంగా రూ. 102 కోట్లు -
కాటమరాయుడు మూడో సాంగ్ రిలీజ్
-
కాటమరాయుడు ఆల్ టైం రికార్డ్
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. మార్చి 24న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు సాధ్యం కానీ అరుదైన రికార్డ్లను సొంతం చేసుకుంటోంది కాటమరాయుడు. దాదాపు నెల రోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ రికార్డ్లను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు ఈ టీజర్‌కు కోటీకి పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో రెండున్నర లక్షలకు పైగా లైక్స్‌తో మరో రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది కాటమరాయుడు టీజర్. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. -
మరోసారి పండుగ బరిలో శర్వానంద్
వరుసగా తెలుగు పండుగలను టార్గెట్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధిస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇప్పటికే వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో టాప్ స్టార్ అనిపించుకున్న శర్వానంద్ మరోసారి పండుగ బరిలో సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 2016 సంక్రాంతికి ఎక్స్‌ప్రెస్ రాజాగా వచ్చిన శర్వ.. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్లు బరిలో ఉన్నా మంచి విజయం సాధించాడు. అదే ఫీట్ రిపీట్ చేస్తూ 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణలు పోటి పడుతున్న సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘనవిజయం సాధించాడు. అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధ సినిమాను ఈ ఉగాది బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఉగాది వారం రోజుల ముందు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ అవుతున్నా.. పోటికే సై అంటున్నాడు. మరి శర్వ నమ్మకం మరోసారి నిజమౌతుందేమో చూడాలి. -
కాటమరాయుడు సెకండ్ సాంగ్..
-
కాటమరాయుడు సెకండ్ సాంగ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా.. ఒక్కో పాటను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మూవీ టీం మాత్రం ఓ రొమాంటిక్ డ్యూయెట్ తో అభిమానులను అలరించింది. లాగే మనుసు లాగే నీ వైపే నను లాగే అంటూ సాగే ఈ పాటకు భాస్కరబట్ల సాహిత్యం అందించగా నకాష్ అజీజ్, ధనుంజయ్, నూతనలు ఆలపించారు. తొలి పాటతో మాస్ ఆడియన్స్ ను ఊర్రూతలూగించిన కాటమరాయుడు టీం రెండో పాటతో క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. మార్చి 18న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. -
‘కాటమరాయుడు’ వర్కింగ్ స్టిల్స్
-
పవన్, ఆగేలా లేడు..?
ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని భావిస్తున్న పవన్, ఇక నటనకు స్వస్తి పలికాలని భావిస్తున్నాడు. అందుకే ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసే ప్లాన్ ఉన్నాడు పవర్ స్టార్. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. పవన్, ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా మార్చి 24న రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకె చెప్పాడు పవన్, ఆ తరువాత ఏఎమ్ రత్నం బ్యానర్లో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఈ మూడు సినిమాల తరువాత పవన్ సినిమాలకు దూరమవుతాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ మరో సినిమాకు ఓకె చెప్పాడట. చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయిన తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి పవన్ అంగీకరించాడని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా ఎన్నికల లోపే పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాడు పవర్ స్టార్. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
పవన్ బ్యానర్లో మరో మెగా హీరో
ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే పవర్ స్టార్, గతంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇటీవల తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు. అదే బాటలో ఇప్పుడు మరిన్ని చిన్న చిత్రాలను లైన్లో పెట్టే ప్లాన్‌లో ఉన్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాలను నిర్మించనున్నాయి. ముందుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. విన్నర్ సినిమాతో నిరాశపరిచిన సాయి ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వేరే ఏ ప్రాజెక్ట్‌కు కమిట్ కాలేదు. దీంతో సరైన కథ, దర్శకుడు దొరికితే పవన్ బ్యానర్ లోనే సాయి ధరమ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హీరోగా, జనసేన అధినేతగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్, ఇప్పుడు నిర్మాతగానూ హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. -
దుమ్మురేపుతున్న పవన్ లేటెస్ట్ సాంగ్
-
దుమ్మురేపుతున్న పవన్ లేటెస్ట్ సాంగ్
హైదరాబాద్: మెగా హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' మూవీ ప్రమోషన్లో భాగంగా 'మిరా మిరా మీసం.. మెలి తిప్పాడు జనం కోసం' అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. పవన్ కల్యాణ్ ముందుగానే చెప్పినట్లుగానే శుక్రవారం సాయంత్రం సాంగ్ ఆడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. నేటి నుంచి మూడు రోజులకో పాట చొప్పున పాటలను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. పాటల షూటింగ్ కోసం కాటమరాయుడు టీమ్ యూరప్ వెళ్లనుంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక.. ఈ 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ మూవీని నిర్మిస్తున్నాడు. -
18న కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా ప్రమోషన్ విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. ఈ నెల 4 నుంచి పబ్లిసిటీ వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఆ రోజు నుంచి మూడు రోజులకో పాట చొప్పున ఆన్ లైన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మిగిలిన రెండు పాటల షూటింగ్ నిమిత్తం టీం 4న యూరప్ బయలుదేరి వెళ్లనుంది. తిరిగి వచ్చిన తరువాత.., మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున థియట్రికల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'కాటమరాయుడు' కి సర్ప్రైజ్ కానుక
-
లీకైన కాటమరాయుడు ఫైట్ సీన్
టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సీన్స్ కూడా ఆన్ లైన్లో రిలీజ్‌కు ముందే దర్శనమిచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పూర్తి సినిమాలు కూడా రిలీజ్‌కు ముందే ఆన్ లైన్లో ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా యాక్షన్ సీన్ ఒకటి ఆన్ లైన్లో దర్శనమిచ్చింది. ఈ సీన్ సినిమా ఇంటర్వేల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌కు సంబందించినదన్న ప్రచారం జరుగుతోంది. రైల్వే స్టేషన్లో షూటింగ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్లో పవన్ ఫైట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. అదే సమయంలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఎక్కువగా ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతుండగా పలు సందర్భాల్లో యూని సభ్యులే లీకులిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మార్చిలో రాయుడు వస్తాడు
అన్నయ్య ఇంటి పెద్ద. నలుగురు తమ్ముళ్లంటే ప్రాణం. తమిళ చిత్రం ‘వీరమ్’ కథ ఇది. అక్కడ అన్నయ్యగా అజిత్ నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో ఇక్కడ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ‘కాటమరాయుడు’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోని పవన్ గెటప్ ఇప్పటికే ఆకట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచెకట్టు, కోరమీసంలో పవన్ కల్యాణ్ లుక్ డిఫరెంట్‌గా ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌కు కూడా భారీ ఎత్తున స్పందన లభించింది. ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లో 10 లక్షల మంది వీక్షించడం విశేషం. ‘గోపాల గోపాల’ తర్వాత దర్శకుడు కిషోర్ పార్ధసాని (డాలీ), సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్‌తో, ‘గబ్బర్‌సింగ్’ తర్వాత శ్రుతీహాసన్‌తో, పవన్ కల్యాణ్ చేస్తున్న మరో చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన టాకీ దాదాపుగా పూర్తయింది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్ , రీ–రికార్డింగ్ చేస్తున్నారు. మార్చి 5న పాటల చిత్రీకరణ కోసం యూనిట్ యూరప్ వెళ్లనుంది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. శివబాలాజీ, కమల్కామరాజ్, చైతన్యకృష్ణ, అజయ్, అలీ, రావు రమేశ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. -
మెగా ఫార్ములాకే పవన్ ఓటు
ఈ మధ్య కాలంలో మెగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆడియో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. సరైనోడు సినిమా నుంచి మెగా హీరోలు నటించిన ఏ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించలేదు. రామ్ చరణ్ ధృవ, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించలేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నాడట. మిగిలిన మెగా హీరోల బాటలోనే పవన్ కూడా తన తాజా చిత్రం కాటమరాయుడు సినిమాకు ఆడియో వేడుక నిర్వహించవద్దని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ( కిశోర్ పార్థసాని) దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. -
న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు
‘‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను కొని, నష్టపోయా. పవన్ కల్యాణ్ తర్వాతి చిత్రం ‘కాటమరాయుడు’ పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ ఇప్పుడు స్పందించక పోగా, బెదిరిస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను పవన్ కల్యాణ్‌గారి అభిమాని. చిన్న సినిమాలు పంపిణీ చేసుకునే నేను ఆయన పై ఉన్న అభిమానంతో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కృష్ణాజిల్లా హక్కులు కొనేందుకు రాగా, శరత్ మరార్‌గారు, శ్రీనివాస్‌గారు నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్పారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకు కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, అందులో కొంచెం రికవరీ అమౌంట్ పెట్టమని చెప్పా. సినిమా బాగా వచ్చింది, హిట్ కొడతామనీ.. మన వద్ద రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్ చిత్రాలు కూడా ఉన్నాయని, ఏం భయం లేదనీ అన్నారు. ఆ మాటలు నమ్మి నాలుగు కోట్ల ముప్ఫైఎనిమిది లక్షలు (నాన్ రిటర్నింగ్ అమౌంట్) శరత్ మరార్‌కు ఇచ్చా. కృష్ణా జిల్లాలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టోటల్ షేర్ 2 కోట్ల 52 లక్షలు రాగా, కోటీ ఎనభై ఆరు లక్షల నష్టం వచ్చింది. సేమ్ బ్యానర్లో మరో చిత్రం చేసి, నష్టపోయిన బయ్యర్లకే పంపిణీ హక్కులిచ్చి న్యాయం చేస్తామని చెప్పి ‘కాటమరాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇవ్వం’ అని, వేరే వారికి పంపిణీ హక్కులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని పవన్‌గారి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, శ్రీనివాస్ నన్ను కలవనివ్వడం లేదు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించాడు. నాకే కాదు, నైజాం డిస్ట్రిబ్యూటర్‌కు కూడా 8 కోట్ల నష్టం వచ్చింది. ఆయనకూ సినిమా ఇవ్వం అంటున్నారు. కల్యాణ్‌గారికి ఇవేవీ తెలియవు. తెలిసుంటే న్యాయం చేసేవారు. మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళితే, నష్టపోయిన నాలాంటి వారికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
సెండాఫ్.. టేకాఫ్!
ఓ సినిమాకు సెండాఫ్ చెబుతూ... మరో సినిమాకు వెల్కమ్ చెప్పనున్నారు పవన్‌కల్యాణ్. కిశోర్ పార్ధసాని (డాలి) దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రీకరణ చివరి దశకు వచ్చేసిందట. వచ్చే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఓ వారం ముందే.. మార్చి 24న రిలీజ్ చేసే ఛాన్సుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించనున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లోనే త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నా... వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు, మార్చి 14న ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణకు ముహూర్తంగా నిర్ణయించారట. ఈసారి వాయిదా పడే ఛాన్స్ లేదని చిత్ర బృందం చెబుతోంది. ఆల్రెడీ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ రెండు మూడు ట్యూన్స్ రెడీ చేసిచ్చారట. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. బహుశా.. ఓ చేత్తో ఓ సినిమా యూనిట్‌కి వీడ్కోలు చెబుతూ, ఇంకో చేత్తో రెండో సినిమా యూనిట్‌కి వెల్కమ్ చెప్పడం పవన్ కెరీర్లో ఇదే మొదటిసారి అవుతుందేమో! -
వీరాభిమానికే కాటమరాయుడు రైట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైపోయింది. పవన్ స్టామినాకు తగ్గట్టుగా ప్రతీ ఏరియా నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలకు మంచి పట్టున్న నైజాం ఏరియాలో కాటమరాయుడు ఫైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. ఈ కాంపిటీషన్లో కూడా పవన్ తన అభిమానికే అవకాశం ఇచ్చాడు. యంగ్ హీరో నితిన్, పవన్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోనే కాదు. పబ్లిక్ ఫంక్షన్స్‌లోనూ పవన్ జపం చేసే నితిన్.., కాటమరాయుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏషియన్ మూవీస్‌తో కలిసి సొంతం చేసుకున్నాడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ కుమార్ పార్థసాని) దర్శకుడు. పవన్ మిత్రుడు శరత్ మరార్..నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కాటమరాయుడును ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కాటమరాయుడు టైటిల్ సాంగ్ ఇదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాటమరాయుడు సినిమాలో సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్ట్రన్ బీట్స్ తో రూపొందించిన ఈ సాంగ్ పవన్ అభిమానులు రూపొదించి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. పవన్ వ్యక్తిత్వం ప్రతిభింబించేలా రూపొందించిన ఈ పాట, పవర్ స్టార్ గత సినిమాల్లోని ఇంట్రడక్షన్ సాంగ్స్ తరహాలోనే ఉంది. దీంతో ఇదే.. కాటమరాయుడు సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అయి ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ రికార్డ్ ను సొంతం చేసుకున్న కాటమరాయుడు టీజర్, కేవలం 57 గంటల్లో 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. -
కాటమరాయుడు టైటిల్ సాంగ్ ఇదేనా..?
-
కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు
-
కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే రికార్డ్ వ్యూస్ సాధించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. శనివారం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ వ్యూస్‌లో రికార్డ్‌లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్‌ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ కాయం అన్న నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకుడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సిట్టింగ్ ప్రెట్టీ
‘సిట్టింగ్ ప్రెట్టీ’ అంటే జీవితంలో అన్ని అవకాశాలు మన దగ్గరకి వచ్చే పొజిషన్లో కూర్చుని ఉండడం... సక్సెస్ కొట్టి కంఫర్ట్‌లో కూర్చుని ఉండడం... కంఫర్టబుల్‌గా కూర్చున్నా కెరీర్ పరుగులు పెట్టడం... ప్రతి ‘సిట్టింగ్’లోనూ హీరోయిన్గా ఈవిడే కావాలని డైరెక్టర్ అనడం.. అన్ని సినిమాల్లోనూ అబ్బో.. ఎంత ‘ప్రెట్టీ’ అని ఆడియన్స్ ఆరాధించడం... దిస్ ఈజ్ శ్రుతీహాసన్... షి ఈజ్ ‘సిట్టింగ్ ప్రెట్టీ’ అమ్మానాన్నల నుంచి అవి నేర్చుకున్నా... నాన్నగారు చాలా క్రమశిక్షణ గల నటుడు. పాత్రలోకి చాలా డీప్‌గా వెళ్లిపోతారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడరు. అమ్మ కూడా చాలా స్ట్రాంగ్. తల్లవ్వాలనుకున్నప్పుడు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అమ్మానాన్న దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ⇔ న్యూ ఇయర్, సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.. త్వరలో వేలంటైన్స్ డే రాబోతోంది.. ఎలా? (మధ్యలో అందుకుంటూ) ఏం అడగబోతున్నారో అర్థమైంది. నాకు ఊహ తెలియకముందు వేలంటైన్స్ డే గురించి తెలియదు. తెలిశాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు. ⇔ ఫుల్ జోష్‌గా ఉన్నారు.. ఇంతకుముందు కనిపించిన శ్రుతీకీ, ఇప్పటి శ్రుతీకి కొంచెం మార్పు కనిపిస్తోంది? ఎప్పటిలానే ఉన్నాను. కాకపోతే ఆలోచనా విధానం మారింది. జీవితాన్ని చూసే తీరులో మార్పొచ్చింది. లైఫ్ పట్ల క్లారిటీ వచ్చింది. ⇔ అందుకేనేమో ‘మార్పు చాలా అందమైనది. నా లైఫ్‌లో ఆ మార్పు వచ్చింది. మార్పు అనేది సవాల్ లాంటిది’ అని ట్వీట్ చేశారు. మీకు సవాల్ అనిపించిన విషయం ఏంటి? సవాల్ అని అన్నది మనుషులను ‘డీల్’ చేసే విషయం గురించి. కొందరు అస్సలు అర్థం అవ్వరు. సినిమా ప్రపంచం పెద్దది. కొందరిని డీల్ చేయడం కష్టంగా ఉంటుంది. మార్పు గురించి చెప్పాలంటే.. నా ఆలోచనా విధానం మారింది. లైఫ్ సై్టల్ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. ఈ మార్పులు బాగున్నాయి. ⇔ ‘నా చుట్టూ ఉన్న గుడ్ పీపుల్‌కి థ్యాంక్స్’ అని కూడా ట్వీట్ చేశారు.. ఆ మంచి వ్యక్తులెవరో చెబుతారా? నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్‌ని ఉద్దేశించే అలా అన్నాను. ఎంత కాదనుకున్నా ఒక్కోసారి ‘లో’ అవుతాం. అలాంటి సమయాల్లో నా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతాను. నిజంగా ‘గాడ్ ఈజ్ వెరీ గ్రేట్’. ఎందుకంటే, నాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌నీ ఇచ్చాడు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా సంతోషాలనూ, బాధలనూ సమానంగా పంచుకునేవాళ్లే. ⇔ సెలబ్రిటీల లైఫ్ క్లిష్టమే. కాంప్లిమెంట్స్ తక్కువ.. కాంట్రవర్సీలు ఎక్కువ? కామెంట్స్ తీసుకోదగ్గవి అయితే తీసుకుంటాను. టైమ్‌పాస్ కోసం మాట్లాడుతున్నారనిపిస్తే... మనసుకి ఎక్కించుకోను. పట్టించుకుంటే నా పని మీద దృష్టి పెట్టలేను. ‘డౌన్’ అయిపోతాను. ఒకర్ని ‘డౌన్’ చేయడం ద్వారా తాము ‘అప్’ అవుతామనుకునేవాళ్లు ఏదేదో మాట్లాడతారు. ఆ మాటలను నెగటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకుంటే మనకు మంచిది. మన పని మనం బాగా చేయగలుగుతాం. ⇔ బాగా చెప్పారు... ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా హిట్టయితే హీరో గురించి ఎక్కువ.. హీరోయిన్ల గురించి తక్కువ మాట్లాడుతుంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఉన్నట్లుండి మార్పు ఆశించలేం. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే మాట్లాడనివ్వండి. నో ప్రాబ్లమ్. నా మటుకు నేను నాకు మంచి పాత్ర ఇచ్చారా? ఆ పాత్ర బాగా చేశానా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో ఉమెన్ డామినేషన్ కూడా ఉంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ అయ్యాయి. అవి హిట్టవుతున్నాయి. వాటి గురించి మాట్లాడేటప్పుడు హీరోయిన్ల గురించే మాట్లాడాలి కదా. ⇔ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహంగా ఉంటారు.. అది మీకెలా అనిపిస్తుంది? ఓ స్టార్ కూతురిగా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ పబ్లిక్‌లోనే ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడను. తెలుసుకోవాలనుకున్నవాళ్లు ఆసక్తి కనబరుస్తారు. నేనేం చేయలేను. ⇔ మీ నాన్నగారి నుంచి గౌతమిగారు విడిపోవడానికి కారణం మీరే అని కూడా ఆసక్తిరాయుళ్లు అంటున్నారు.. అది నాన్నగారి పర్సనల్ విషయం. దాని గురించి నేనేం మాట్లాడదల్చుకోలేదు. నిజానికి నాన్నగారనే కాదు.. నేను ఎవరి పర్సనల్ విషయాల గురించీ పబ్లిక్‌గా మాట్లాడను. ⇔ ఎంత కాదనుకున్నా.. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ప్రభావం ఉండకుండా ఉండదు.. ఆ ప్రభావం నుంచి మీరెలా బయటపడతారు? కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాదనడంలేదు. కాసేపు ఆలోచిస్తా. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశిస్తేనే ప్రాబ్లమ్. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. విమర్శలను కూడా లైట్ తీసుకోవడానికే ప్రయత్నిస్తా. ⇔ ఈ మధ్య మీ నాన్న (కమల్‌హాసన్) గారితో మీరెక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లనిపిస్తోంది. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల విలువ బాగా తెలుస్తుందంటారు. మీలో ఆ మార్పు... అఫ్కోర్స్ మనం ఎదిగే కొద్దీ పేరెంట్స్ విలువ స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లు బాగా అర్థం అవుతారు. అది కామన్. అయితే మా నాన్నగారితో నేను ఇప్పుడు కాదు.. ఎప్పుడూ క్లోజ్‌గానే ఉంటాను. ఆయన ఆలోచనలు నాకు నచ్చుతాయి. అవసరమైనప్పుడు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నన్నూ, అక్షరనీ మగపిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఆయన చెప్పే మాటలు ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ⇔ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శుత్రీ పెళ్లి చేసుకుంటే చూడాలనీ, తన పిల్లలను ఎత్తుకోవాలనీ మీ నాన్న అన్నారు. మరి.. ఎప్పుడు నెరవేరుస్తారు? (నవ్వుతూ). నాన్నగారు ఈ మాటలు చాలాసార్లు అన్నారు. కానీ, దేనికైనా టైమ్ రావాలి. అది వచ్చినప్పుడు ఏదీ ఆగదు. ⇔ కొంతమంది ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత ఉద్యోగానికి ఫుల్స్టాప్ పెట్టేస్తుంటారు.. మీరు? ఇంకా పెళ్లి గురించే ఆలోచించలేదు. ఆ తర్వాత విషయం గురించి అడుగుతున్నారు. కెరీర్‌కి పెళ్లి ఆటంకం కాదని నా ఫీలింగ్. ఇష్టపడి ఫుల్స్టాప్ పెడితే ఓకే. కానీ, అత్తమామలు వద్దన్నారనో, భర్త వద్దన్నాడనో కెరీర్‌ని త్యాగం చేయకూడదు. నేను నా ఇష్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను. నాకు సినిమాలంటే ఇష్టం. భార్య అయ్యాక, తల్లయ్యాక కూడా వదలనేమో. ⇔ మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లు శారీరకంగా వీక్... మానసికంగా కూడా చాలామంది అలానే ఉంటారు.. వాళ్లకు మీరిచ్చే సలహా? సలహాలిచ్చేంతగా ఎదిగానో లేదో తెలియదు. కానీ, ఒకటి మాత్రం చెబుతాను. ప్రపంచాన్ని చూడండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. భారతదేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఆడవాళ్ల గురించి ఎలా మాట్లాడుతున్నారో వినండి. శారీరక బలంకన్నా మానసికం బలం గొప్పది. అందుకే అంటున్నా... ‘బీ స్ట్రాంగ్’. అలాగని ఎగబడి ఎవర్నీ తిట్టమనడంలేదు.. కొట్టమనడంలేదు. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం బలంగా ఉండాలి. ⇔ ఆడవాళ్ల సక్సెస్‌ని అంగీకరించడానికి పురుషాధ్యిక ప్రపంచం దాదాపు ఒప్పుకోదు. ప్రతిభ గురించి మాట్లాడకుండా అందంగా ఉందని సక్సెస్ అయిందనో, మాటలు చెప్పగలదనో.. ఇలా ఏవేవో అంటారు. మీ ఫీల్డ్ నుంచి మా ఫీల్డ్ వరకూ ఇలానే ఉంది.. సరిగ్గా చెప్పారు. ఇది మేల్ డామినేటెడ్ వరల్డ్. ఫిమేల్ సక్సెస్‌ని మనస్ఫూర్తిగా అంగీకరించేవాళ్లు తక్కువమంది ఉంటారు. కానీ, మా నాన్నగారిలాంటి మగవాళ్లు కూడా ఉంటారు. తన కూతుళ్ల సక్సెస్‌నే కాదు.. బయటి ఆడవాళ్ల సక్సెస్‌ని కూడా ఆయన అభినందిస్తారు. ఇక, విమర్శించే వాళ్ల గురించి అంటారా? పట్టించుకోవడం అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ⇔ రీసెంట్గా బర్త్‌డే జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్స్? నా బర్త్‌డే పార్టీ చాలా చిన్నగా ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్.. అంతే. చెన్నైలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్నగారితో కలసి సెలబ్రేట్ చేసుకుంటాను. ఈసారి అక్కడే ఉన్నాను. నాన్నగారు, నా ఫ్రెండ్స్‌తో ఇంట్లోనే ఎంజాయ్ చేశా. ⇔ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వ్యక్తిగా ఎదుగుతాం.. మారతాం. మీలో వచ్చిన మార్పు గురించి? మీరన్నది కరెక్టే. ఐదేళ్ల క్రితం ఉన్నట్లు ఇప్పుడు ఉండం. ఇప్పుడున్నట్లు ఐదేళ్ల తర్వాత ఉండం. ఈ మధ్య నాలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే... ఏ విషయం గురించైనా క్లియర్‌గా ఆలోచించిస్తున్నాను. నాకేం కావాలో, ఏం అక్కర్లేదో స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నా. ‘మనం ఈ మాట మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారేమో’ అనే ఫీలింగ్‌తో నా మనసులోని మాటలను చెప్పేదాన్ని కాదు. కానీ, ఇప్పుడు మనం అబద్ధం ఆడనంతవరకూ, నిజాయితీగా ఉన్నంతవరకూ మన మనసుకి అనిపించిన మాటలు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అయితే నా మాటలు ఎవర్నీ బాధపెట్టకుండా జాగ్రత్తపడుతున్నా. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘ఇల్యూజన్’ అనే పుస్తకం చదివాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ తిరగేస్తుంటాను. ఆ పుస్తకం చదువుతుంటే నా జీవితానికి అర్థం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. రిచర్డ్ బక్ అద్భుతంగా రాశారు. ⇔ సినిమాల ఎంపిక విషయంలో కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు కూడా వచ్చింది. ప్రొఫెషనల్‌గా అంతకుముందు ‘యస్’ అన్నవాటికి ఇప్పుడు ‘నో’ అంటున్నా. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు. ఇప్పుడు నా ఆలోచనా విధానం అలానే ఉంది. ⇔ మామూలుగానే మీరు స్ట్రాంగ్ గర్ల్.. ఇప్పుడు మరీ స్ట్రాంగ్ అయినట్లున్నారు? అవును. చైల్డ్‌హుడ్ నుంచీ నేను కొంచెం స్ట్రాంగే. నా బాడీ లాంగ్వేజ్, నా మాట తీరు ఆ విషయాన్ని బయటపెట్టేస్తాయి. నేను బోల్డ్‌గా ఉండటానికి ఓ కారణం పెంపకం. నాన్నగారు ‘నువ్వు ఆడపిల్లవి’ అని గుర్తు చేస్తూ నన్ను, అక్షరను పెంచలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉంటున్నారు. ఏదైనా చెప్పుకునేంత స్వేచ్ఛ నాన్న దగ్గర ఉంది. ⇔ ఈ మధ్య ఏడాదికో తీపి గుర్తు అన్నట్లు.. 2015లో ‘శ్రీమంతుడు’, 2016లో ‘ప్రేమమ్’.. ఈ రెండూ మిగిల్చిన అనుభూతి గురంచి? నిజంగా ‘శ్రీమంతుడు’ నా సినిమా కెరీర్లో ఎప్పటికీ ఓ స్వీట్ మెమరీ. ఒక కమర్షియల్ సినిమాలో మంచి వేల్యూస్ చెప్పడం అనేది వందకు వంద శాతం కుదరకపోవచ్చు. ‘శ్రీమంతుడు’కి కుదిరింది. నా క్యారెక్టర్ సూపర్బ్. ఆర్టిస్ట్‌గా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇక, ‘ప్రేమమ్’ డిఫరెంట్. ‘శ్రీమంతుడు’లో స్టూడెంట్‌గా చేస్తే.. ‘ప్రేమమ్’లో లెక్చరర్‌గా చేశా. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ⇔ 2017 ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఎప్పటిలానే పాజిటివ్‌గానే ఉన్నాను. నాన్నగారికి కూతురిగా నా రియల్ లైఫ్ క్యారెక్టర్ని ‘శభాష్ నాయుడు’లో చేయడం ఓ మంచి అనుభూతి. నాన్నగారి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్‌తో సినిమా చేయడం మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లాంటిది. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. ఓ దర్శకుడిగా నాన్నగారికి నా నటన నచ్చింది. అది చాలు. తెలుగులో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌గారితో ‘కాటమరాయుడు’ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి సినిమా. త్వరలో విడుదల కానున్న ‘సింగమ్ 3’ కూడా బాగుంటుంది. ⇔ అవకాశాలు తెచ్చుకోవడం కష్టం. స్టార్ కావడం ఇంకా కష్టం. ఆ స్టేటస్‌ని నిలబెట్టుకోవడం మరీ మరీ కష్టం. ఓ స్టార్‌గా మీకిది ఒత్తిడిగా ఉంటుందా? అస్సలు లేదు. ఇప్పుడు మనం స్టార్.. రెండేళ్ల తర్వాత ఇలానే ఉంటామా? అని ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రెజర్ మొదలవుతుంది. అందుకే నా ఆలోచనలను అంత దూరం వెళ్లనివ్వను. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నానా? లేదా అని మాత్రమే పట్టించుకుంటాను. మంచి రోల్స్ చేయాలని తాపత్రయపడతాను. ⇔ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేçస్తున్నారు.. ఎక్కువ వర్క్ చేస్తే బోర్..? సక్సెస్ అనేది నాకు ఈజీగా రాలేదు. చాలా స్లోగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీని చేసింది. చేతినిండా పని ఉంది. చేసే పనిని కష్టంగా ఫీలైతే బోర్ ఏంటి.. అలసట కూడా అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం నేను ఏడు సినిమాలు చేశాను. పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకునే తీరికే లేకుండాపోయింది. అయినా బాగానే అనిపించింది. ఎందుకంటే, టాలెంట్ ఉండి కూడా సరైన ఛాన్స్ దక్కనివాళ్లు ఉన్నారు. ⇔ ఫైనల్లీ హీరోయిన్గా సెవన్ ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తోంది? ఏడేళ్లు త్వరగా గడచిపోయాయి. ఇంకా చాలా సినిమాలు చేయడానికి ఎగై్జటెడ్‌గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాన్న కెరీర్ చూస్తున్నాను. అందుకే ఫ్లాప్స్.. సక్సెస్‌లను సమానంగా తీసుకోవడం అలవాటైంది. – డి.జి. భవాని -
ఎవడున్నాడన్నదే ముఖ్యం :కాటమరాయుడు
-
'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు
పవర్ స్టార్ అభిమానులు చాలా రోజులు ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయ్యింది. న్యూ ఇయర్ కి, సంక్రాంతికి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన చిత్రయూనిట్ ఫైనల్ పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పవన్ లుక్స్ క్యారెక్టరైజేషన్ తెలిసేలా రూపొందించిన టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నదే ముఖ్యం అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని కన్ఫామ్ చేసేస్తుంది. టీజర్ ఎక్కువగా భాగం పవన్ ను సీరియస్ గానే చూపించిన యూనిట్ ఒక్క షాట్ లో పవన్ డ్యాన్స్ మూమెంట్ ను చూపించారు. తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ లో ఎక్కడా ఆ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. -
ఊరికి పెద్ద... నలుగురు తమ్ముళ్లకు అన్నయ్య
పంచెకట్టు.. కోరమీసం... ఇప్పటికే విడుదలైన ‘కాటమరాయుడు’ సినిమాలో స్టిల్స్ చూస్తే పవన్ కల్యాణ్ కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. గత సినిమాల్లో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఈ వేషధారణలో కనిపించలేదు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో ఆయన ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ ఆహార్యంతో పాటు మాట తీరు కూడా కొత్తగా ఉంటుందట! ‘‘నలుగురు తమ్ముళ్లకు అన్నగా, ఊరి పెద్ద ‘కాటమరాయుడు’గా పవన్ నటిస్తున్నారు. రాయలసీమ నేటివిటీకి తగ్గట్టు సీమ యాసలో పవన్‌కల్యాణ్ డైలాగులు చెప్పనున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ చివరికి వచ్చిందట. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఉగాదికి... అంటే మార్చి నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. -
కాటమరాయుడు ముందే వస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకుడు. గబ్బర్‌సింగ్ సినిమాతో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్, శృతి హాసన్‌లు ఈ సినిమాలో మరోసారి జోడి కడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చని ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు సినిమాను మరోవారం ముందుగా అంటే మార్చి 24నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మార్చి 15 వరకు చాలా మంది పిల్లలకు పరీక్షలు అయిపోతాయన్న ఆలోచనతో సినిమాను ప్రీపోన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. కాటమరాయుడు ముందే వస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
కాటమరాయుడు మొదలెట్టేశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా వీరం కు రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే బిజినెస్ మొదలెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ తరువాత పవన్ హీరోగా తెరకెక్కిన సినిమా అయినా కాటమరాయుడు బిజినెస్ పరంగా దూసుకుపోతోంది. సీడెడ్ బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్ అమ్ముడవ్వడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
పవన్‌కు నాలుగు నెలలు సరిపోతుందా..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాను కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఇంత వరకు షూటింగ్ కూడా మొదలు కాని ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను కూడా ఫైనల్ చేశారాన్న టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్, త్రివిక్రమ్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కాటమరాయుడు మార్చి నెలాఖరున రిలీజ్ అవుతోంది. అంటే త్రివిక్రమ్ సినిమాను ఏప్రిల్‌లో ప్రారంభిస్తారు. ఏప్రిల్‌లో మొదలైన సినిమాను, నాలుగు నెలల కాలంలో షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి, ఆగస్టు 11న రిలీజ్ చేయాలి. ప్రతీ సినిమాను సంవత్సరం పాటు తెరకెక్కించే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు ఈ సమయం సరిపోతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరి అనుకున్నట్టుగా పవన్, త్రివిక్రమ్‌లు నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాలి. -
కాటమరాయుడు టీజర్ రిలీజ్ మళ్లీ వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా ఇంత వరకు సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగినా.. కేవలం మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు చిత్రయూనిట్. ఆ తరువాత సంక్రాంతి కానుకగా తొలి టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి టీజర్ లాంచ్ వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. అభిమానులు నిరాశపడకుండా సంక్రాంతి రోజు మరో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతికి పవన్ కూడా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. న్యూ ఇయర్‌కే టీజర్‌ను రిలీజ్ చేస్తారని భావించినా.. అప్పుడు మోషన్ పోస్టర్‌తో మాత్రమే సరిపెట్టేశారు. జనవరి 14 సంక్రాంతి రోజు సాయంత్రం 7 గంటలకు కాటమరాయుడు టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆ నటుడు దేశానికి గర్వకారణం
ప్రేక్షకులను పవన్‌కల్యాణ్ సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ కాకుంటే మరేంటి? ఎప్పుడూ సోషల్ మీడియాలో రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే పవన్‌కల్యాణ్ తొలిసారి ఓ సినిమా గురించి మాట్లాడారు. అదీ కొత్త ఏడాది కానుకగా ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఆయన కొత్త సినిమా ‘కాటమరాయుడు’ గురించి కాదు. ఓ హిందీ సినిమా చూసి ట్విట్టర్లో స్పందించారాయన. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘శనివారం (డిసెంబర్ 31న) ‘దంగల్ సినిమా చూశా. నా అభిప్రాయం ఏమిటో అందరికీ చెప్పకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. మన తరంలో ఆమిర్‌ఖాన్ లాంటి నటుడు ఉన్నందుకు దేశమంతా గర్వపడాలి. ‘దంగల్’లోని ఆయన నటన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మనసుల్ని దోచుకుంది. దర్శకుడు నితీశ్ తివారీ, మిగతా ప్రధాన పాత్రధారులకు నా శుభాకాంక్షలు. మన దేశంలో కొరవడిన మహిళల సాధికారిత దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ చిత్రం మనందరికీ గుర్తు చేసింది’’ అన్నారు పవన్. అన్నట్టు... ‘దంగల్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చి నప్పుడు ‘‘తెలుగులో మల్టీస్టారర్ చేయవలసి వస్తే.. చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌లతో చేస్తా’’ అన్న సంగతి తెలిసిందే. -
కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్
-
కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్
పవర్ స్టార్ అభిమానుల కోసం కాటమరాయుడు యూనిట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసిన కాటమరాయుడు టీం తొలి మేకింగ్ వీడియోనే రిలీజ్ చేసింది. అంతేకాదు యూనిట్ సభ్యులంతా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని మేకింగ్ షాట్స్‌తో పాటు రిలీజ్ చేసిన ఈ వీడియో పవన్ విషెస్ చెప్పకపోవడం అభిమానులను నిరాశపరిచింది. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
న్యూ లుక్ కిక్కే వేరప్పా!
కోర మీసం.. ఖద్దరు చొక్కా.. వేలికి బంగారపు ఉంగరం.. చూపుల్లో పౌరుషం... ‘కాటమరాయుడు’లో పవన్‌కల్యాణ్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వాళ్లను ఈ నెల 28 నుంచి సగం... సగం స్టిల్స్‌తో ఊరిస్తూ వచ్చిన చిత్ర బృందం శుక్రవారం రాత్రి ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఉగాది కానుకగా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు శరత్ మరార్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఫుల్ స్టిల్ ఆ రోజే!
తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులకు డిసెంబర్ 31న కొత్త ఏడాది కానుక ఇవ్వడానికి పవన్‌కల్యాణ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదల చేయనున్నారు. తమిళ హిట్ ‘వీరమ్’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ ప్రీ–లుక్ పోస్టర్‌గా మీరు చూస్తున్న స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పంచెకట్టులో ఉన్న పవన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి, ఫుల్ ఫొటో ఎక్కడనుకుంటున్నారా? ఈ 31న ఫుల్ స్టిల్ రిలీజ్ చేస్తారట! శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
పొల్లాచ్చి టు హైదరాబాద్
అందంలో ఆకాశం లాంటి అమ్మాయికి.. ఆనందంతో అల్లరి చేసే యువకుడు జత కలిస్తే... ‘గబ్బర్ సింగ్’లో పవన్‌కల్యాణ్, శ్రుతీహాసన్‌ల జంటలా ఉంటుంది. అందులో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. ‘గబ్బర్ సింగ్’తో హిట్ జోడీ అనిపించుకున్న ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ ముగించుకుని ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ‘‘పొల్లాచ్చిలో పవన్, శ్రుతిలపై చిత్రీకరించిన సన్నివేశాలు, పాట అద్భుతంగా వచ్చాయి. చిత్రీకరణ చివరి ఘట్టానికి వచ్చింది’’ అన్నారు శరత్ మరార్. ‘‘వచ్చే ఫిబ్రవరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసి, ఉగాది కానుకగా మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కిశోర్ పార్థసాని. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఖైదీకే కాదు కాటమరాయుడుకీ అతనే విలన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు విలన్‌గా నటించనున్నాడు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 లో విలన్‌గా నటిస్తున్న తరుణ్ అరోరానే కాటమరాయుడులోనూ విలన్‌గా నటిస్తున్నాడట. వీరమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న కాటమరాయుడులో ఓ పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నాడు తరుణ్. ముఖ్యంగా పవన్, తరుణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో తరుణ్ అరోరాతో పాటు రావు రమేష్ కూడా విలన్‌గా కనిపించనున్నాడు. -
పవన్ కళ్యాణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో
ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. పవన్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్లను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించిన ఉపేంద్ర మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
దేవుడే దిక్కంటే ఎలా?
నాకు దైవభక్తి ఎక్కువ అంటున్నారు నటి శ్రుతిహాసన్. పక్కా మోడ్రన్ అమ్మారుుగా పెరిగిన శ్రుతిహాసన్ ఇలా మాట్లాడడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందులోనూ ఈ బ్యూటీ తండ్రి కమలహాసన్ పూర్తిగా నాస్తికుడన్న విషయం తెలిసిందే.అలాంటిది మీరెలా ఆస్తికులయ్యారన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ ఇలా చెప్పుకొచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం అన్నది నాకే కలిగింది.ఇది ఎవరో చెప్పడంతో కలిగింది కాదు.దైవభక్తి అన్నదిసాధారణ పరిస్థితికి మించింది. ఒక్క దేవుడినని కాదు అన్ని దేవుళ్లను పూజిస్తాను. అలాగని నా ఇంటిలో దేవుని గది అంటూ ప్రత్యేకంగా ఉండదు. అరుునా ఎలా దేవునిపై నమ్మకం కలిగిందో నాకే తెలియదు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ల దైవార్చనలు చేసుకుంటాను. పుణ్యస్థలాలను దర్శిస్తుంటాను. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. అరుుతే ఆ ఆలయాల్లో ఏ దేవుడున్నారన్న విషయం గురించి ఆలోచించను. గుడిలో దేవున్ని చూడగానే దండం పెట్టుకుంటాను.అలాగని నేనేమీ కోరుకోను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. చిన్న చిన్న కోరికలు కోరుకుంటాను. అరుుతే మన బాధ్యతలను విస్మరించకూడదు. ఏమీ చేయకుండా భగవంతుడా అంతా నీదే భారం అని కూర్చోవడం సరికాదు. మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్ తాజాగా తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తన తండ్రి కమలహాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. -
పవర్ఫుల్ ఛాన్స్
ఎవరు.. ఎవరు..? పవన్‌కల్యాణ్ పక్కన నటించబోయే కథానాయికలు ఎవరు? ఫిల్మ్‌నగర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో ఇద్దరు, ఆర్.టి. నేసన్ చిత్రంలో ఒకరు. మొత్తం మీద ముగ్గురు కథానాయికలు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి కావాలి. అందులో ఒకరు ఇప్పుడు ఖరారయ్యారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న చిత్రంలో ఓ నాయికగా కీర్తీ సురేశ్ ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరి 1న విడుదలైన ‘నేను.. శైలజ’తో ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగుకి పరి చయమయ్యారు. ప్రస్తుతం నాని ‘నేను లోకల్’లో నటిస్తున్నారు. ఇప్పుడు డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చేస్తున్న పవన్, త్వరలోనే త్రివిక్రమ్ సినిమా సెట్స్‌లోకి వస్తారట. పవన్ సరసన ఛాన్స్‌తో, ‘‘అయామ్ వెరీ హ్యాపీ’’ అని కీర్తీ సురేశ్ ఆనందం వ్యక్తం చేశారు. -
రేసులో ఎవరున్నారు?
ముహూర్తం బాగుందని పవన్‌కల్యాణ్ హీరోగా ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఎ.ఎం. రత్నం నిర్మించనున్న సినిమా పూజ చేశారు. కానీ, సినిమా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైముంది. ‘కాటమరాయుడు’ పూర్తి కావాలి. ఆ తర్వాత లైనులో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి చేయాలి. అప్పుడు ఆర్.టి. నేసన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. ఈలోపు పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. పూజ జరగడమే తరువాయి... పవన్‌కు జోడీగా నయనతారను ఎంపిక చేసే ప్రయత్నాల్లో నిర్మాత ఎ.ఎం.రత్నం ఉన్నారని ప్రచారం మొదలైంది. లేటెస్ట్గా రకుల్ పేరు వినిపిస్తోంది. అసలు రేసులో ఎవరున్నారు? అని ఆరా తీస్తే... ప్రతి సినిమాకీ హీరోయిన్ పాత్రకు రెండు మూడు ఆప్షన్స్ అనుకోవడం, వాళ్లను సంప్రదించడం కామన్. దర్శకుడు ఆర్.టి. నేసన్, నిర్మాత ఎ.ఎం. రత్నంలు ఇప్పటివరకూ పవన్‌కి జోడీగా నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని చూస్తున్నారు. అందులో భాగంగానే వీళ్లిదరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే... ముందు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అందులో హీరోయిన్ల ఎవరనేది ఫైనలైజ్ అయిన తర్వాత పవన్ సరసన నటించే భామ నయన్, రకుల్, లేక మరెవరు అన్న క్లారిటీ వస్తుంది. -
మేం అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్
‘‘సప్తగిరి ‘గబ్బర్‌సింగ్’లో ఓ సీన్ చేశాడు. ఆ సీన్లో మేమిద్దరం కలిసి నటించలేదు కానీ, బాగా చేశాడు. అప్పట్నుంచి కలవాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. నన్నిక్కడికి రప్పించింది నాపై అతనికున్న ప్రేమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. అరుణ్ పావర్ దర్శకత్వంలో శ్రీసాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్‌పై డా. రవి కిరణ్ నిర్మించారు. రోషిణి కథానాయిక. విజయ్ బుల్గానిక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ -‘‘నాతో శరత్‌మరార్ తీస్తున్న చిత్రానికి ‘కాటమరాయుడు’ టైటిల్ అనుకున్నాం. సప్తగిరి చిత్రానికి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు. కానీ, పెద్ద మనసుతో మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను సినిమాల్లో నటిస్తా కానీ, తక్కువగా చూస్తా. నేను చేసినవాటిలో ఇప్పటికీ రెండు సినిమాలు చూసుకోలేదు. ట్రైలర్ చూశాక సప్తగిరి సినిమా చూడాలనిపిస్తోంది.. చూస్తా’’ అన్నారు. ‘‘ఇంతమంది మెగాభిమానుల మధ్య ఓ మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతుందని ఊహించలేదు. చిన్నప్పట్నుంచి చిరంజీవిసార్ను అభిమానిస్తూ పెరిగా. నిజాయతీ గల అభిమానిని కాబట్టే పవన్‌సార్ వచ్చారు’’ అని సప్తగిరి అన్నారు. ‘‘సినిమా ఎలా తీయాలో త్రివిక్రమ్సార్ దగ్గర నేర్చుకున్నా. నన్ను ఆశీర్వదించడానికి పవన్ సార్ వచ్చినందుకు హ్యాపీ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇది’’ అని డా. రవి కిరణ్ అన్నారు. -
పవన్ మరో సినిమా మొదలెట్టేశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ పవర్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మించే సినిమాను కొద్ది రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు(శనివారం) మరో సినిమాను కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు పవన్. చాలా రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సినిమా ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. అతి కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కాటమరాయుడు షూటింగ్ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అతనికి చెల్లెలు అవుతుంది!
తెలుగు, తమిళ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా హిందీలో శ్రుతీహాసన్ ఏడాదికి ఒక సినిమా అయినా ఒప్పుకుంటారు. వీలైతే రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. శ్రుతి నటించిన హిందీ చిత్రం ‘యారా’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మరో చిత్రం అంగీకరించారు. ‘బెహెన్ హోగీ తేరి’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ సరసన శ్రుతి నటించనున్నారు. అంటే.. ‘ఆమె నీకు చెల్లెలు అవుతుంది’ అని అర్థం. మరి.. సినిమాలో శ్రుతీని ఉద్దేశించి ఏ పాత్ర ఇలా అంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పంజాబీలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ కె. పన్నాలాల్ ఈ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమవుతున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. డిసెంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టి, జనవరిలో పూర్తి చేయాలనుకుంటున్నారు. నితిన్ సరసన? శ్రుతి చేస్తున్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సరసన ‘కాటమరాయుడు’లో నటిస్తున్నారు. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న చిత్రంలో ఆమెను కథానాయికగా అడిగారట. ఈ సినిమాలో నటించడానికి శ్రుతి సుముఖంగానే ఉన్నారని సమచారం. డిసెంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట. శ్రుతీహాసన్ ఈలోపు డైరీ చెక్ చేసుకుని, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారట. -
కాటమరాయుడు సెట్లో ఖైదీ
చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండు సార్లు చిరు, పవన్ లు కలిసినా.. అంతా ఓకె అన్న భావన మాత్రం కలిగించలేకపోయారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినీ వేడుకలలో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పవన్ కనిపించకపోవటంతో ఏదో జరుగుతుందన్న భావనలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాటమరాయుడు సెట్ లో సందడి చేస్తున్నాడు. ఊరికే కాదులేండి..ఖైదీ నంబర్ 150 సినిమాలోని కొన్ని సీన్స్ ను కాటమరాయుడు సెట్ లో షూట్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ఒకే సెట్ లో కలుసుకున్న చిరు, పవన్ లు గంటపాటు విడిగా మాట్లాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చర్చ సంగతి అటుంచితే.. మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సెట్ లో షూటింగ్ చేస్తున్నారన్న వార్తలతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. -
వేసవి బరిలో కాటమరాయుడు
-
వేసవి బరిలో...కాటమరాయుడు
మార్చి 29న ‘ఉగాది’కి రిలీజ్ పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే తెరపై ఇప్పుడు జోరు పెంచినట్లే కనిపిస్తున్నారు. ఇతర పనుల మాట ఎలా ఉన్నా, సినిమా పనులకు నికరంగా సమయం కేటాయిస్తున్నారు. ఒకపక్క ఇప్పటికే సెట్స్ మీద ఉన్న తాజా సినిమా ‘కాటమరాయుడు’ షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోపక్క నిర్మాత ఏ.ఎం. రత్నం కొత్త సినిమాకు కూడా నవరాత్రుల్లో ఆయన కొబ్బరికాయ కొట్టారు. పట్టాలెక్కడానికి కాస్తంత జాప్యమైనా, ఒకసారి పట్టాలెక్కేశాక బండి ఊపందుకోవడం సహజమే. అందుకు తగ్గట్లే ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్ కూడా స్పీడుగా సాగుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత చకచకా ఈ సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు నూతన సంవత్సరాది కానుకగా ‘కాటమరాయుడు’ రిలీజ్ కానుంది. అంటే వచ్చే వేసవి రిలీజుల్లో బరిలో ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ ముందుగానే కర్చీఫ్ వేసేశారన్న మాట! లుంగీ గెటప్... నాన్‌స్టాప్ షూటింగ్... ఇలా డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ మధ్య మధ్యలో ఒకటీ అరా రోజుల విశ్రాంతి మినహా, ఎక్కడా విరామం లేకుండా షూటింగ్ చేయాలని నిశ్చయించుకున్నట్లు భోగట్టా! ‘‘ఇప్పటికే హీరోయిన్ శ్రుతీహాసన్‌తో ఒక వారం పైగా షూటింగ్ కూడా చేశాం. ప్రస్తుతం టాకీ పార్ట్ తీస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. లుంగీ కట్టు, కోర మీసంతో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ గెటప్‌లో కెమేరా ముందు ఉత్సాహంగా ఉన్నారని షూటింగ్ చూసొచ్చిన కర్ణపిశాచి కథనం. శివబాలాజీ, అజయ్, అలీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. గతంలో ‘గోపాల... గోపాల’తో పవన్ కల్యాణ్ మనసు చూరగొన్న దర్శకుడు కిశోర్ పార్థసాని (అలియాస్ డాలీ) కూడా తనపై నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనువైన సొంత టీమ్‌తో చకచకా షూటింగ్ చేస్తున్నారు. హిట్ సినిమా కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, పూర్తిగా తెలుగు వాతావరణం, పాత్రలతో తయారవుతున్న ‘కాటమరాయుడు’ వార్తల్ని బట్టి చూస్తే, వచ్చే వేసవిలో సినీప్రియులకు ఈ సినిమాతో పాటు ‘బాహుబలి-2’ కనువిందు కన్ఫర్మ్ అన్నమాట! -
ఖుషీగా మొదలు
తెలుగు దర్శకులతో పాటు చెన్నై దర్శకుల కథలంటే పవన్‌కల్యాణ్‌కు ఆసక్తి ఎక్కువ. గతంలో పలు తమిళ చిత్రాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారాయన. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘కాటమరాయుడు’ కూడా తమిళ చిత్రం ‘వీరమ్’కి రీమేకే. తాజాగా మరో తమిళ రీమేక్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లో నటించడానికి అంగీకరించారాయన. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. దర్శకులు కరుణాకరన్, ఎస్.జె.సూర్య, ధరణి, విష్ణువర్ధన్ల తర్వాత పవన్‌కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకుల్లో ఆర్.టి.నేసన్ ఐదో వ్యక్తి. ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ‘‘పవన్‌కల్యాణ్‌తో మూడో చిత్రమిది. సూర్య మూవీస్ పతాకంపై ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాలు నిర్మించాం. నా పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న 4వ చిత్రమిది. కమర్షియల్ ఎంటర్టైనర్. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేశాం’’ అన్నారు దర్శకుడు ఆర్.టి.నేసన్. ఈ వేడుకలో నిర్మాత శరత్ మరార్, దర్శకుడు జ్యోతికృష్ణ, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ పాల్గొన్నారు. -
పవన్.. రెండేళ్లలో నాలుగు సినిమాలు చేస్తాడట..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత కాస్త ఆలస్యంగా కాటమరాయుడు సినిమాను మొదలు పెట్టిన పవన్, జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2017 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు పవన్. అంతేకాదు 2019 ఎన్నికల్లో పోటి చేయాలని భావిస్తున్న పవర్ స్టార్, ఈ లోగా నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి అదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ తరువాత 2018లో మరో రెండు సినిమాలు రిలీజ్ చేసి తరువాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడు. -
పవన్ తమ్ముళ్లు వీళ్లే..!
సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్రలకు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేశాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు. అయితే ఈ పాత్రల్లో ఎవరు కనిపించనున్నారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఫైనల్‌గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ సోదరుడిగా నటించిన అజయ్ ఒక తమ్ముడిగా నటిస్తుండగా, కమల్ కామరాజు, శివబాలజీలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.