కాటమరాయుడి కల్యాణ వైభోగం
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జరిగిన కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారికి పట్టువస్త్రాలు తెచ్చారు. కల్యాణ వేదిక ఎత్తులో ఉండటంతో సామాన్య భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని తనివితీరా తిలకించారు.
పల్లకీపై విచ్చేసిన నారసింహుడు : యాగశాల నుంచి నవ వధువుల అలంకృతులై శ్రీదేవి, భూదేవిలతో పాటు వరుడు లక్ష్మీ నారసింహుడు పల్లకీలో రాత్రి 9 గంటల ప్రాంతంలో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ మం డపం చేరుకున్నారు. గోవింద నామస్మరణ మా ర్మోగింది. శ్రీవారి కల్యాణ విశిష్టతను టీటీడీ నుంచి వచ్చిన అర్చక పండితులు అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ముక్కోటి దేవతలు వీక్షించే ఈ కల్యాణోత్సవాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక పండితులు తెలియజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. దీంతో కాటమరాయుడి కళ్యాణం పూర్తయింది. అనంతరం భక్తులకు శ్రీవారి తలంబ్రాలు పంచారు.
Comments
Please login to add a commentAdd a comment