సాక్షి, అనంతపురం : పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జిల్లాలోని ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలివి.. పెళ్లి ట్రాక్టర్ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వారిలో ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందటం స్థానికంగా విషాదం నింపుతోంది. మరో పది నిమిషాల్లో పెళ్లి మంటపానికి ఈ బృందం చేరుకునేది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. రేపు ఉదయం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ, సమీప బంధువులైన చిన్నారులు నాగేశ్వరి(12) మంజునాథ్(10) కార్తీక్(12)లు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment