
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
లారీ లోయలో పడి ముగ్గురి మృతి
మరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.
లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment